మంచి నీటిలో జీవించే స్పంజిక ఏది?


Wed,June 12, 2019 12:11 AM

water
- జంతువులను వెన్నెముక ఆధారంగా రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1. అకశేరుకాలు( Invertebrates/ Non- chordata)
2. సకశేరుకాలు( Vertebrates/ chordata)
water1

అకశేరుకాలు/నాన్ కార్డేటా

- వెన్నెముక లేదా పృష్టవంశం లేని జంతువులను అకశేరుకాలు అంటారు.
- ఈ అకశేరుకాలను/నాన్‌కార్డేటాలను స్థూలంగా కింది వర్గాలు (phyums) గా విభజించవచ్చు.

1. ప్రొటోజొవా ( Protozoa)

- వీటిని గురించిన అధ్యయనాన్ని ప్రొటోజువాలజీ అంటారు.
- proto అంటే మొదటి అని, Zoa అంటే జంతువులు అని అర్థం.
- ఇవి జంతురాజ్యంలో మొట్టమొదటి జీవులు
- ఇవి అతి సరళమైన, అతి ప్రాచీనమైన మొట్టమొదటి జంతువులు.
- ఇవి ఏకకణ జీవులు. వీటిలోని ఒకటే కణం శ్వాస, విసర్జన, జీర్ణ, ప్రత్యుత్పత్తి మొదలైన విధులను నిర్వర్తిస్తుంది.
- వీటిలో ఒకటే కణం అన్ని విధులను నిర్వర్తించటం వలన వీటిని ఏకకణ జీవులు అంటారు.
- ప్రొటోజొవాలో సుమారుగా 50 వేల జాతుల జీవులు ఉంటాయి.
ఉదా: అమీబా, యూగ్లినా, పారామీషియం, ప్లాస్మోడియం, నాక్టిల్యుకా, సిరాన్షియం, బాలంటీడియం కోలై, ఎంటమీబా హిస్టాలిటికా, జియార్డియా, ఇంటస్టైనాలిస్, లిష్మానియా బ్రాసిలయెన్సిస్/డొనోవాని/ట్రోఫికా, ప్లాస్మోడియం వైవాక్స్/ఫాల్సిఫెరమ్/మలేరియే/ఓవెల్, ట్రైకోమోనాస్, ట్రిఫనోసోమా, టాక్సోప్లాస్మా.

అమీబా

- ఇది నిర్ధిష్టమైన ఆకారం లేని ఏకకణజీవి
- ఇది ఎల్లప్పుడూ తన ఆకారాన్ని మార్చుకోవడం వల్ల దీన్ని ప్రోటియస్ ఎనిమల్‌క్యూల్ (గ్రీకుదేవత) అంటారు.
- దీని చలనాంగాలు మిద్యాపాదాలు (pseudopodia)

యూగ్లినా

- ఇది జంతు, వృక్ష లక్షణాలను కలిగి ఉండే ఏకకణజీవి. కావునా దీన్ని వృక్షాలకు, జంతువులకు మధ్య సంధాన సేతువు (connecting link) అంటారు.
- దీని చలనాంగాలు కశాభాలు (flagella).

పారమీషియం

- ఇది కాలిచెప్పు ఆకారంలో ఉంటుంది. ఈ కారణంగా దీనిని స్లిప్పర్ ఎనిమల్ క్యూల్ అంటారు.
- దీని చలనాంగాలు శైలికలు (cilia)

ప్లాస్మోడియం

- ఇది మలేరియా వ్యాధిని కలుగజేస్తుంది.
- ప్లాస్మోడియం అనే ప్రజాతిలో 4 రకాల జాతులు ఉండి 4 రకాల మలేరియాను కలుగజేస్తాయి.
- ప్లాస్మోడియం వైవాక్స్- బినైన్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం ఫాల్సిఫెరం-మాలిగ్నెంట్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం ఓవెల్- మైల్డ్ టెర్షియన్ మలేరియా
- ప్లాస్మోడియం మలేరియా- క్వార్టన్ మలేరియా
- పై నాలుగింటిలో ప్లాస్మోడియం వైవాక్స్ సాధారణమైన, అధికంగా విస్తరించిన మలేరియా పరాన్నజీవి.

నాక్టిల్యుకా, సిరాన్షియం

- ఇవి రెండు కూడా జీవసందీప్తిని (Bioluminiscence) ప్రదర్శిస్తాయి.
- కొన్ని ప్రొటోజొవా పరాన్న జీవుల వలన మానవుడికి వివిధ రకాల వ్యాధులు కలుగుతాయి.

2. పొరిఫెరా (Porifera)

- వీటిని గురించిన అధ్యయనాన్ని పారా జువాలజి అంటారు.
- pore అంటే రంధ్రం అని fera అంటే కలిగి ఉండటం అని అర్థం.
- వీటిని సాధారణంగా స్పంజికలు (sponges) అని పిలుస్తారు.
- ఇది అతి చిన్న వర్గం. ఇవి మొదటి బహుకణ జీవులు.
- వీటి ప్రధాన లక్షణం దేహంపై రంధ్రాలు కలిగి ఉండటం. ఈ రంధ్రాలనే ఆస్టియా అంటారు.
- ఇవి తమ దేహంలో కుల్యావ్యవస్థ (canal system)ను కలిగి ఉంటాయి. ఈ కుల్యావ్యవస్థ ఆహార సేకరణ, శ్వాస, విసర్జన క్రియల్లో తోడ్పడుతుంది.
- ఇవి సాధారణంగా సముద్రజీవులు. కాని స్పాంజిల్లా అనే జీవి మాత్రం మంచినీటిలో జీవిస్తుంది.
- ఇవి స్థానబద్ద జీవులు అంటే ఏదైనా ఒక ఆధార తలాన్ని అంటిపెట్టుకుని జీవిస్తాయి.
- వీటి శరీర కుడ్యం ద్విస్తరితం (దేహం వెలుపల బహిస్తచం/పినాకోడర్మ్ ఉంటుంది)
- వీటిలో నిల్వ ఆహారం థీసోసైట్‌లు అనే కణాల్లో నిల్వ ఉంటుంది.
- ఇవి ఉభయలైంగిక జీవులు (hermaphrodites). అంటే ఒకే జీవి అండాలను, శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది.
- వీటిలో కంటకాలు (spicules), స్పాంజిన్ తంతువులు (spongin fibers) అనే అస్థిపంజర నిర్మాణాలు ఉండి దేహానికి ఆధారాన్ని ఇస్తాయి. వీటిలోని కంటకాలు, స్పాంజిన్ తంతువులు CaCo3, Si తో ఏర్పడుతాయి.

water2

ఉదాహరణ

- సైకాన్ (స్కైఫా)
- స్పాంజిల్లా (మంచినీటి స్పంజిక)
- యూస్సాంజియా (స్నాన స్పంజిక/bath sponge)
- యూప్లెక్టెల్లా (వీనస్‌పూల సజ్జ/venus flower basket) దీనిని జపాన్‌లో పెళ్లి జంటలకు కానుకగా ఇస్తారు.
- ఛలైనా (మృతునివేలు/dead man finger)
- క్లయోన (boring sponge) ఇది ముత్యపు చిప్పలకు రంధ్రాలు చేస్తుంది.
- హయలోనీమా (గాజుతాడు స్పంజిక)
- డిస్కోడెర్మియా డిసోల్యూటా- దీని నుంచి డిస్కో డెర్మోలైడ్ అనే పదార్థం లభిస్తుంది. దీనిని క్యాన్సర్ చికిత్సలో వాడుతారు.

3. సీలెంటిరేటా/నిడీరియా (Coelenterata/Cnidara)

- వీటిని అధ్యయనాన్ని నిడీరియాలజి అంటారు.
- నిడీరియన్‌లు (గతంలో సీలెంటిరేటాగా పిలువబడేవి) జలచరాలు. ఇవి ఎక్కువగా సముద్ర జీవులు.
- వీటి శరీరం మధ్యలో ఖాళీ కుహరం ఉంటుంది. దీనిని జఠర ప్రసరణ కుహరం/ సీలెంటిరాన్ అంటారు. అందువల్లనే గతంలో ఈ వర్గాన్ని సీలెంటిరేటా అని పిలిచేవారు.
- ఈ జీవుల శరీరంలో కుట్టుకణాలైన దంశకణాలు (Chidoblasts/cnidocytes) ఉంటాయి. ఈ కణాలు ఉండటం వల్ల ఈ వర్గానికి ఇటీవల కాలంలో డేరియా అనే పేరు వచ్చింది.
- దంశకణాలు అంటిపెట్టుకోవడానికి, ఆత్మరక్షణకు, బోజ్యజీవిని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి.
- ఇవి మొట్టమొదటి కణజాలస్థాయి ఏర్పడిన ద్విస్తరిత బహుకణజీవులు.
- ఈ జీవులలో నాడీవ్యవస్థకు సంబంధించిన నిర్మాణాలు మొట్టమొదటగా ఏర్పడినాయి.
- ఈ జీవులలో రెండు రకాల జీవకాలు ఉంటాయి. అవి పాలిప్, మెడ్యూసా
- పాలిప్ స్థానబద్దజీవి స్తూపాకారాన్ని కలిగి ఉంటుంది.
- ఉదా: హైడ్రా, ఎడామ్సియా
- మెడ్యూసా గొడుగు ఆకారంలో ఉండి, స్వేచ్చగా ఈదే జీవకం
- ఉదా: అరీలియా

mallesh

588
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles