సీడాక్-సీక్యాట్


Wed,June 12, 2019 12:16 AM

CDAC
ఐటీ రంగంలో నిపుణులు కావాలనుకుంటున్నారా? డిగ్రీ, బీఈ/బీటెక్ చేసి ఐటీ రంగంలో స్థిరపడాలనుకుంటున్నవారు, ఇప్పటికే ఐటీ/సాఫ్ట్‌వేర్ రంగంలో ఉండి కొత్త టెక్నాలజీలను నేర్చుకుని అప్‌డేట్ కావాలనుకుంటున్నవారికి ఇదొక అవకాశం. ఐటీ రంగంలో అత్యుత్తమ శిక్షణ, పరిశోధనా సంస్థగా ఖ్యాతిగడించిన సీడాక్ జాబ్ ఓరియంటెడ్ పీజీ డిప్లొమాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే సీక్యాట్ పరీక్ష ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో సంస్థ వివరాలు సంక్షిప్తంగా...

సీడాక్:

- దేశంలో ఐటీలో ఎలక్ట్రానిక్స్ దాని అనుబంధ రంగాలలో అత్యుత్తమ పరిశోధన కోసం 1998లో దీన్ని కేంద్రం ప్రారంభించింది. ఐటీ రంగంలో నిపుణులను తయారుచేయడంతోపాటు రోజురోజుకు మారుతున్న సాంకేతికతపై శిక్షణనిస్తూ దేశంలోని ఐటీ విప్లవంలో సీడాక్ ముందుంది. ఈ సంస్థ పీజీ, యూజీ, డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులను అందిస్తున్నది. అంతేకాకుండా రాష్ట్ర, జాతీయ సంస్థలకు, ఏజెన్సీలకు, కార్పొరేట్, పరిశ్రమ, విదేశాలకు, విదేశీ విద్యార్థులకు అవసరమైన ఐటీ నైపుణ్యాన్ని అందిస్తున్నది సీడాక్.

సీ-క్యాట్:

- సీడాక్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (సీక్యాట్). దీనిద్వారా కెరీర్ ఓరియంటెడ్ పీజీ డిప్లొమాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఏటా జూన్/డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.
- ఎవరు అర్హులు: బీఈ/బీటెక్ లేదా బీఎస్సీ ఇంజినీరింగ్‌లో ఐటీ/సీఎస్‌ఈ, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ లేదా పీజీ (ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మ్యాథ్స్) లేదా తత్సమాన కోర్సులు.
- కోర్సు కాలవ్యవధి: ఆరునెలలు, ఫుల్‌టైం రెసిడెన్షియల్ పోగ్రామ్.
- సీడాక్ ట్రెయినింగ్ సెంటర్ల: హైదరాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఇండోర్, జైపూర్, కరాడ్, కొచ్చి, కోల్‌కతా, మొహాలి, ముంబై, నాగ్‌పూర్, నాసిక్, నవీ ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పుణె, తిరువనంతపురం.
- పరీక్ష తేదీలు: జూన్ 23 నుంచి 30 మధ్య నిర్వహిస్తారు.
- పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉంది.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: జూన్ 17
- ఫలితాల వెల్లడి: జూలై 10
- తరగతులు ప్రారంభం: ఆగస్టు 20 నుంచి
- వెబ్‌సైట్: https://www.cdac.in

సీక్యాట్ ద్వారా ప్రవేశాలు కల్పించే పీజీ డిప్లొమాలు:

- జియోఇన్ఫర్మాటిక్స్
- అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్
- బిగ్‌డాటా అనాలసిస్
- ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్ & సెక్యూరిటీ
- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ)
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
- మొబైల్ కంప్యూటింగ్
- సిస్టమ్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
- అడ్వాన్స్‌డ్ సెక్యూర్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్
- హెచ్‌పీసీ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్
- ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్
- వీఎల్‌ఎస్‌ఐ డిజైన్
- బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ & హెల్త్ ఇన్ఫర్మాటిక్స్.

కోర్సు ప్రత్యేకతలు:

- 24 వారాల ఫుల్‌టైం కోర్సలు-900 గంటలు థియరీ+ల్యాబ్+ప్రాజెక్టు.
- రోజుకు 8 గంటలు థియరీ+ల్యాబ్, వారానికి ఆరురోజులు.
- కోర్సును సీడాక్ (ఐసీటీ) పరిశ్రమకు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించినది.
- ఆప్టిట్యూడ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో ప్రత్యేక శిక్షణ ఇస్తారు.
- క్యాంపస్ ప్లేస్‌మెంట్స్, టాప్ ఐసీటీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు.
- ఘనమైన క్యాంపస్ ప్లేస్‌మెంట్ రికార్డు

- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

445
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles