వెటర్నరీ యూనివర్సిటీలో పాలిటెక్నిక్


Sun,June 16, 2019 03:07 AM

tsvu1-BUILDING
రాజేంద్రనగర్‌లోని పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ 2019-20 విద్యా సంవత్సరానికిగాను రెండేండ్ల పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.


- కోర్సు పేరు: పాలిటెక్నిక్ (పశుసంవర్ధక & మత్స్య శాస్త్రం)
- మొత్తం సీట్ల సంఖ్య:121
- మహబూబ్‌నగర్, కరీంనగర్, సిద్దిపేట పశుసంవర్ధ్దక పాలిటెక్నిక్‌లలో 30 మంది చొప్పున మామనూర్ పశుసంవర్దక పాలిటెక్నిక్‌లో 20 మంది, భావదేవరపల్లి మత్స్య పాలిటెక్నిక్‌లో 11 మందికి ప్రవేశం కల్పిస్తారు.
- గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు స్వయం ఉపాధి కల్పించుకోవాలనే ఉద్దేశంతో పశుపోషణ, మత్స్య పరిశ్రమల్లో శిక్షణ ఇవ్వడానికి పాలిటెక్నిక్‌లను ఏర్పాటుచేశారు.
- అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో కనీసం 60 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇద్దరు కంటే ఎక్కువ మందికి సమానమైన మార్కులు/గ్రేడ్‌లు వస్తే సైన్స్/మ్యాథమెటిక్స్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు.2019 లేదా అంతకుముందు పదోతరగతిలో పాసైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- కనీసం నాలుగు సంవత్సరాలపాటు గ్రామీణ ప్రాంతాల్లోని (నాన్ మున్సిపల్ పరిధి) పాఠశాలలో చదివిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- వయస్సు: 2019 ఆగస్టు 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.

- అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీలకు రూ. 660/- ఎస్సీ/ఎస్టీ/పీహెచ్‌సీలకు రూ. 330/-
- ఎంపిక: పదోతరగతి అకడమిక్ మార్కులు/గ్రేడ్‌ల ప్రామాణికంగా తీసుకుని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
- పాలిటెక్నిక్ కోర్స్ ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత అధికారికి పంపాలి.
- చిరునామా: P.V Narsimha Rao Telangna Veterinary University
- Administrative office: Rajendranagar : Hyderabad - 500 030
- చివరితేదీ: జూలై 10
- వెబ్‌సైట్: http://tsvu.nic.in

1491
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles