సివిల్స్ జనరల్ ఎస్సే ప్రిపరేషన్ ఎలా?


Mon,June 17, 2019 12:40 AM

-దేశంలో అత్యున్నత ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సివిల్ సర్వీసెస్‌లో చేరడానికి ప్రతి ఏటా యూపీఎస్సీ నిర్వహించే మూడంచెల పరీక్ష విధానంలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పూర్తయ్యింది. ఇది మెయిన్స్ రాయడానికి అర్హత పరీక్ష మాత్రమే. సెప్టెంబర్‌లో జరిగే మెయిన్స్‌లో వచ్చే మార్కులే అభ్యర్థి విజయాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి అభ్యర్థులు సమయాన్ని శాస్త్రీయ పద్ధతిలో సమర్థవంతంగా వినియోగించుకుని అత్యధిక మార్కులు సాధించేవిధంగా సొంతంగా ప్రణాళికలు రూపొందించుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి.
-2013 నుంచి సివిల్స్ మెయిన్స్‌లో ఆప్షనల్స్ పాత్ర తగ్గింది. జనరల్ స్టడీస్ పాత్ర గణనీయంగా పెంచారు. మెయిన్ మొత్తం 1750 మార్కుల్లో 1250 మార్కులు జనరల్ స్టడీస్ 5 పేపర్లకు కేటాయించారు. ఇందులో జనరల్ ఎస్సే ఒక పేపర్.


జనరల్ ఎస్సే సిలబస్

-నిజానికి జనరల్ స్టడీస్‌లోని మిగతా నాలుగు పేపర్లకు నిర్దిష్ట సిలబస్ పేర్కొన్నారు. కానీ జనరల్ ఎస్సేకు మాత్రం ప్రత్యేకంగా ఎలాంటి సిలబస్‌ను ఇవ్వలేదు.

స్వరూపం

-అభ్యర్థి నిర్దిష్టమైన అంశంపై ఎస్సే రాయాలి. ఇందులో చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. అభ్యర్థి ఆలోచనలు క్రమబద్ధంగా, సంక్షిప్తంగా ఎలా రాయగలడో పరీక్షిస్తారు. సమర్థవంతమైన, కచ్చితమైన వ్యక్తీకరణకు అవకాశం ఉంటుంది.
-జనరల్ ఎస్సే పేపర్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. ప్రతి సెక్షన్ నుంచి నాలుగు ప్రశ్నలు, వీటిలో ఒక్కో సెక్షన్ నుంచి ఒక ప్రశ్న చొప్పున మొత్తం రెండు ప్రశ్నలకు (2X125=250) మూడు గంటల సమయంలో సమాధానాలు రాయాలి.

మౌలిక సూత్రాలు

-ఎంచుకున్న ప్రశ్నకు గంటన్నర సమయం ఒకే సమాధానాన్ని రాయడం ఒక రకంగా ఇబ్బందికరమైన అంశంగా ఉన్నప్పటికీ అభ్యర్థి విషయ పరిజ్ఞానాన్ని (సబ్జెక్టు), మనస్తత్వాన్ని (పర్సనాలిటీ) ఏకకాలంలో అంచనావేయడానికి ఈ పేపర్ ప్రధానంగా దోహదపడుతుంది. అయితే ఈ పేపర్‌కు నిర్దిష్ట సిలబస్ లేకపోవడంవల్ల ప్రశ్నల స్వభావం, స్థాయిని కచ్చితంగా అంచనావేయడం సాధ్యంకాదు. అంతేకాకుండా కొన్ని ప్రశ్నలు ఊహాత్మకంగా, ఆధ్యాత్మికంగా, మైథలాజికల్‌గా ఉండటంవల్ల ప్రశ్న ఎంపిక అత్యంత కీలకం. అదేవిధంగా సమాధానాన్ని ఒక క్రమపద్ధతిలో రాయడానికి కొన్ని మౌలిక సూత్రాలను తప్పనిసరిగా పాటించాలి.

1 ఉపోద్ఘాతం (ఇంట్రడక్షన్)

-జనరల్ ఎస్సేలో ఉపోద్ఘాతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. మొదట కలిగిన అభిప్రాయం కీలకం (ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్). అభ్యర్థి సామర్థ్యానికి ఇది కొలమానంగా ఉంటుంది. కాబట్టి ఉపోద్ఘాతం ఆకర్షణీయంగా (అట్రాక్టివ్), అర్థవంతంగా (మీనింగ్ ఫుల్), సందేశాత్మకంగా (మెసేజ్ ఓరియంటెడ్) ఉండేలా చూసుకోవాలి. ప్రశ్న మౌలిక అర్థం ఇందులో ప్రతిబింబించేవిధంగా మౌలికాంశాలను (కోర్ ఎలిమెంట్స్) స్పష్టంగా, క్లుప్తంగా తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం వచ్చేవిధంగా, ప్రభావవంతంగా (ఎఫెక్టివ్) ఉండేవిధంగా రాయాలి. సాధారణంగా ఉపోద్ఘాతం రెండు లేదా మూడు పేరాగ్రాఫ్‌లుగా (ప్రతి పేరాగ్రాఫ్‌లో 5 నుంచి 7 లైన్లు) ఉండేవిధంగా చూసుకోవాలి.

మధ్య భాగం (బాడీ పార్ట్)

-జనరల్ ఎస్సే సమగ్ర వివరణ మధ్య భాగంలోనే కనిపిస్తుంది. ముఖ్యంగా అభ్యర్థికి సంబంధిత ప్రశ్నపట్ల ఉన్న అవగాహన, విషయస్పష్టత, వాస్తవికాంశాలు, భాష, భావవ్యక్తీకరణ తీరు, విషయాన్ని విభిన్న కోణాల్లో సమగ్రంగా, సంపూర్ణంగా విశ్లేషించే తీరు పేరాగ్రాఫ్‌ల మధ్య అనుసంధానం, ప్రధానంగా సున్నితమైన అంశాలను వివరించేటప్పుడు భావోద్వోగాలను నియంత్రించుకుంటూ (ఎమోషనల్ కంట్రోల్) స్థితప్రజ్ఞత (బ్యాలెన్స్ మైండ్), తటస్థత (న్యూట్రాలిటీ) వంటి అంశాలతోపాటు సంబంధిత అంశంపట్ల లోతైన అవగాహన, ఆశావాద దృక్పథం, అంతిమంగా మధ్యభాగంలోని సమాచారం ఆధారంగా ఒక ప్రభుత్వ అధికారికి ఉండాల్సిన లక్షణాలు ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని అంచనావేయడం జరుగుతుంది.

ముగింపు (కన్‌క్లూజన్)

-ముగింపు మరింత ప్రభావవంతంగా ఉండేలా చూసుకోవాలి. ఇందులో పరిష్కారం మార్గాలు భవిష్యత్ దర్పణం (ఫ్యూచరిస్టిక్, విజనరీ) కనిపించాలి. ముందు రాసిన విషయాలు పునరావృతం కాకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఉపోద్ఘాతంలోని అంశానికి ముగింపులోని అంశానికి అనుసంధానం ఉన్నట్లు కనిపించాలి. ముగింపు ఎంత ప్రభావవంతంగా ఉంటే అన్ని ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంది.

సృజనాత్మకంగా ఉండాలి

-జనరల్ ఎస్సే రాయడం ఒక కళ. అయితే నిరంతరం సాధన చేయడం ద్వారా ప్రతి అభ్యర్థి దీనిలో ప్రావీణ్యాన్ని సాధించవచ్చు. ప్రశ్న ఎంపిక, సమయపాలనకు అధిక ప్రాధాన్యమివ్వడంతో పాటు సమాచారాన్ని క్రమబద్ధంగా, తర్కబద్ధంగా, క్లుప్తంగా, సమగ్ర దృక్పథంతో సందర్భానుసారం వర్తమాన అంశాలను జోడిస్తూ నిరంతరం కొనసాగే ఒక జీవనదిలా సమాచారాన్ని రాయగలిగితే జనరల్ ఎస్సేలో గరిష్ఠ మార్కులు పొందవచ్చు.
-మహోన్నత లక్ష్యాన్ని ఎంచుకుని తదనుగుణంగా జీవితాన్ని మలచుకుని నిరాశ, నిస్పృహలను త్యజించి నిజాయితీగా ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీలేదు. ఒకసారి రంగంలోకి దిగిన తర్వాత వెనుకంజ వేయకూడదు. ఇది కర్తవ్యధీరుల లక్షణం. లక్ష్యసాధనకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండటమే విజయ రహస్యం, విజయం గమ్యం కాదు ఒక గమనం మాత్రమే. శ్రమలో ఆనందాన్ని పొందగలిగితే విజయం దానంతట అదే మన దరికి చేరుతుంది. కాబట్టి అభ్యర్థులు సమయాన్ని వృథాచేయకుండా నిజాయితీగా నిరంతరం కష్టపడితే సివిల్ సర్వీసెస్‌లో తప్పనిసరిగా విజయం సాధిస్తారు.

సివిల్స్ మెయిన్-2016 జనరల్ ఎస్సే

టైమ్: 3 గంటలు
మార్కులు: 250
Write Two essays, choosing ONE from each of the selections A and B, in about 1000-1200 words each

125X2 = 250

Section-A
1. If development is not engendered, it is endangered
2. Need brings greed, if greed increases it spoils breed
3. Water disputes between states in federal india
4. Innovation is the key determinant of economic

Section-B
1. Cooperative federalism: Myth or Reality
2. Cyberspace and Internet: Blessing or curse to the human civilization in the long run
3. Near jobless growth in India: An anomaly or an outcome of economic reforms
4. Digital economy: A leveller or a source of economic inequality

2017
Section-A
1. Farming has last the ability to be a source of subsistence for majority of farmers in India
2. Impact of the new economic measures on fiscal ties between the union and states in India
3. Destiny of a nation is shaped in its classroom
4. Has the Non-Alignment Movement (NAM) lost its relevance in a multipolar world

Section-B
1. Joy is the simplest form of gratitude
2. Fulfilment of new woman in India is a myth
3. We many brave human laws but cannot resist natural laws.
4. Social Media is inherently a selfish medium.

2018
Section-A
1. Alternative technologies for a climate change resilient India
2. A good life is one inspired by love and guided by knowledge
3. Poverty anywhere is a threat to prosperity everywhere
4. Management of India borders disputes- a complex task

Section-B
1. Customary morality cannot be a guide to modern life
2. The past is a permanent dimension of human consciousness and values
3. A people that values its privileges above its principles loses both
4. Reality does not conform to the ideal, but confirms it.
Venkat

1063
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles