జోసాతో జర జాగ్రత్త


Mon,June 17, 2019 12:42 AM

జేఈఈ ఫలితాలు వచ్చేశాయ్.. విద్యార్థుల ర్యాంకులు ప్రకటించారు.. నిట్, ఐఐటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లో చేరాలనుకునే విద్యార్థుల కలలు నెరవేరే సమయం ఆసన్నమైంది. దేశంలోని 31 నిట్‌లు, 23 ఐఐటీలు, 23 ట్రిపుల్ ఐటీలు ఇతర ప్రభుత్వ టెక్నికల్‌కళాశాలల్లో అనేక కోర్సులు ఉన్నాయి. వాటిలో ఏ కోర్సు ప్రత్యేకమైంది. డిమాండ్ ఉన్నదేది, ఏ నిట్‌లో ఏ కోర్సు బాగుందో అని విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పటికే అంతర్జాలంలో అన్వేషించారు. కానీ అసలైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. విద్యార్థులకు వచ్చిన ర్యాంకుతో కళాశాలల ఎంపికకు ఆన్‌లైన్ దరఖాస్తులు (చాయిస్ ఫిల్లింగ్) చేయడం అత్యంత ప్రధానమైనది. జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) వెబ్‌సైట్ ద్వారా ఈ చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూన్ 16 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో విద్యార్థులు కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లతో అత్యంత విలువైన సీటును కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి విద్యార్థులు పాటించాల్సిన కొన్ని పద్ధతులను నిపుణ పాఠకుల కోసం అందిస్తున్నాం.
Getting-a-masters1

సీట్ల ఎంపిక ఇలా....

-విద్యార్థులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో ఎన్ని కోర్సులైనా ఎంపిక చేసుకోవచ్చు. ముందుగా తమకు ఇష్టమైన వాటిని ఎంచుకుని ఒకటి నుంచి చివరి వరకు ఎంపిక చేసుకుంటూ పోవాలి. తప్పనిసరిగా దేశంలోని ఏ నిట్‌లలోనైనా చదవాలనుకున్నప్పుడు తక్కువ ప్రాధాన్యం ఉన్న వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నాకు రాదేమో అనే సందేహాలను పక్కనపెట్టి వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకో వాలి. ప్రతి నిట్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం, ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 50 శాతం కోటాను కేటాయిస్తారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓసీ కేటగిరీలో వీకర్ సెక్షన్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. వీరిని పరిగణలోకి తీసుకునే జోసాలో ర్యాంకులు కేటాయించారు.

-ఒక విద్యార్థి 50 చాయిస్‌ల వరకు ఎంపిక చేసుకున్నప్పుడు సీట్ల అలాట్‌మెంట్‌లో ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంకుతో ఎక్కడ ఖాళీ ఉందో చూస్తారు. ఎంపిక చేసుకున్న వాటిలో 10వ చాయిస్‌కు సీటు వస్తే వెంటనే దగ్గరలో ఉన్న నిట్‌లో సర్టిఫికెట్‌లు వెరిఫికేషన్ చేయించుకుని సీటు రిజర్వ్ చేయించుకోవాలి. ఈ చాయిస్‌తో సంతృప్తిచెందితే ఫ్రీజ్ చేసుకోవాలి. అలా కాకుండా అదే కాలేజీలో ఇంకా మంచి బ్రాంచీలో చాన్స్ వస్తుందనుకుంటే ైస్లెడ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఏ కాలేజీలోకానీ, ఏ చాయిస్ అయినా వెళతాననుకుంటే ఫ్లోట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత క్రమంలో ఎంపిక చేసుకున్నవి (11 నుంచి 50వ చాయిస్) డిఫాల్ట్‌గా ఎడిట్ చేయబడతాయి.
-ఆప్షన్ల ఎంపికలో పొరపాటు చేయకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. సీటు రాగానే ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని సీటు రిజర్వ్ చేసుకోవడం తప్పనిసరి. ఇష్టమైన బ్రాంచీ రాలేదని మరో రౌండ్ వరకు వేచిచూడటం పెద్ద పొరపాటు. ఒకసారి సీటు అలాట్ అయితే రిజర్వ్ చేసుకోనప్పుడు మరో అవకాశం ఉండదు. ఏ నిట్‌లలో సీటు వచ్చినా వరంగల్ నిట్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇక్కడే ఫీజు కట్టవచ్చు.

చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్ వివరాలు

-జూన్ 16 నుంచి రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం
-జూన్ 22న అప్పటి వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నవారికి మొదటి దవ మాక్ సీట్ అలొకేషన్ ఉంటుంది.
-జూన్ 24న రెండో దశ సీట్ అలాట్‌మెంట్
-జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ముగింపు
-జూన్ 27న మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు
-జూన్ 28 నుంచి జులై 2 వరకు సీటు పొందిన విద్యార్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది.
-జులై 3న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం రెండో రౌండ్ సీట్ అలొకేషన్
-జులై 4, 5న డాక్యుమెంట్‌ల ధృవీకరణ, రెండో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
-జులై 6న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం మూడో రౌండ్ సీట్ అలొకేషన్
-జులై 7, 8న డాక్యుమెంట్ల ధృవీకరణ,మూడో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
-జులై 9న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం నాలుగో రౌండ్ సీట్ అలొకేషన్
-జులై 10, 11న డాక్యుమెంట్ల ధృవీకరణ, నాలుగో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
-జులై 12న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం ఐదో రౌండ్ సీట్ అలొకేషన్
-జులై 13, 14న డాక్యుమెంట్ల ధృవీకరణ, ఐదో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
-జులై 15న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం ఆరో రౌండ్ సీట్ అలొకేషన్
-జులై 16, 17న డాక్యుమెంట్ల ధృవీకరణ, ఆడో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
-జులై 18న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం చివరి రౌండ్ సీట్ల అలొకేషన్
-జులై 19న డాక్యుమెంట్ల ధృవీకరణ, చివరి రౌండ్ సీట్ల ఉపసంహరణలతో పాటు జాయినింగ్ రిపోర్ట్ చేయాలి.
-(జులై 19న ఐఐటీ విద్యార్థులు, జులై 19 నుంచి 23 వరకు నిట్ విద్యార్థులు జాయిన్ కావాలి)
నోట్: పూర్తి వివరాల కోసం జోసా వెబ్‌సైట్‌ను చూడండి.

-డాక్టర్ పల్లె రవి వంశీమోహన్
-నిట్ క్యాంపస్, వరంగల్ అర్బన్

1252
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles