గేట్ అంత కష్టమా


Mon,June 17, 2019 12:48 AM

దేశంలో బహుళ ప్రయోజనకరమైన పరీక్షలో గేట్ అత్యంత ముఖ్యమైంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉద్యోగాలతోపాటు ఉన్నత చదువులకు కూడా ఈ పరీక్ష ఎంతో కీలకం. అయితే గేట్ చాలా కఠినమైన పరీక్ష అని చాలామంది విద్యార్థులు భయపడతారు. నిజమేనా?
Getting-a-masters

ర్యాంక్ రాకపోవడానికి కారణాలు

-GATEలో విజయం సాధించాలంటే ముందుగా అందులో ఫెయిల్ కావడానికి కారణాలను తెలుసుకోకపోవడం
-గేట్ ప్రిపరేషన్‌ను బీటెక్ చివరి ఏడాదిలోనే ప్రారంభించడం
-స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ మొదటగా ప్రిపేర్ కాకపోవడం
-డౌట్స్ క్లారిఫై చేయడానికి వనరులు (రిసోర్సెస్) లేకపోవడం
-సీక్వెన్షియల్ ప్రిపరేషన్ తెలియకపోవడం
-సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేక, గేట్ కష్టమని భావించడం
-కాలేజీ లెవల్ బేసిక్స్ (ఇంటర్ లేదా డిప్లొమా) లేకపోవడం
-రీడింగ్, రైటింగ్ స్కిల్స్ లేకపోవడం
-రెగ్యులర్ టెస్ట్ సిరీస్ (ఆన్‌లైన్) ఫాలో కాకపోవడం
-గ్రూప్ స్టడీ లేకపోవడం
-గేట్ ప్రిపరేషన్, కాలేజీలో అకడమిక్ ప్రిపరేషన్ రెండింటికి బ్యాలెన్స్ చేయలేకపోవడం
-గేట్ స్కోర్ మంచిగా రావడంవల్ల వచ్చే లాభాలను తెలుసుకోకపోవడం
-సరైన గైడెన్స్‌లో గేట్ ప్రిపేర్ కాకపోవడం
-ఫోర్త్ ఇయర్ బీటెక్‌లో అకడమిక్, గేట్ ప్రిపరేషన్‌కు సరిపడా టైమ్ కేటాయించకపోవడం
-గేట్ సిలబస్ ప్రకారం ప్రశ్నల విధానంపై అవగాహన లేకుండా చదవడం
-ఇంటర్ లెవల్ మ్యాథ్స్‌పై పట్టులేకపోవడం
-ఆప్టిట్యూడ్ స్కిల్స్‌పై పట్టులేకపోవడంగేట్‌లో మంచి స్కోర్ రావాలంటే?
-గేట్ సిలబస్ ప్రకారం ప్రతి సబ్జెక్టుకు స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ సేకరించాలి.
-గేట్ ప్రిపరేషన్ బీటెక్ ఫస్టియర్ నుంచి ప్రారంభించాలి.
-బీటెక్ ఫస్టియర్ డురేషన్‌లో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, ఆప్టిట్యూడ్‌పై పట్టు తెచ్చుకోవాలి.
-బీటెక్ సెకండియర్ డురేషన్‌లో బేసిక్ ఇంజినీరింగ్ సబ్జెక్టుల మీద గట్టిగా ప్రిపేర్ కావాలి. ఉదా: ఈసీఈ, ఈఈఈ వారికి, నెట్‌వర్క్ థియరీ, కంట్రోల్ సిస్టమ్స్, సిగ్నల్ సిస్టమ్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఆపరేషనల్ ఆంప్లిఫయర్స్ అండ్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్స్ స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ నుంచి ప్రిపేర్ కావాలి.
-బీటెక్ థర్డ్ ఇయర్ డురేషన్‌లో కోర్ సబ్జెక్ట్స్‌మీద ప్రిపేర్ కావాలి. అంటే ఈఈఈ వారు ఎలక్ట్రానికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, పరవ్ ఎలక్ట్రానిక్స్, ఈసీఈ వారు కమ్యూనికేషన్ సిస్టమ్స్
-బీటెక్ ఫోర్త్ ఇయర్ డురేషన్‌లో మొత్తం రివిజన్ చేయాలి. అప్లికేషన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి.
-బీటెక్ ఫోర్త్ ఇయర్ ప్రిపరేషన్‌లో ప్రతి వారం ప్రిపేర్ అయిన సబ్జెక్టులపైన ఆన్‌లైన్ ఎగ్జామ్ రాయాలి.
-గేట్ ప్రిపేర్ అయ్యేటప్పుడే ఎప్పటికప్పుడు సినాప్టిక్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఫార్ములా కిట్‌ను తయారుచేసుకోవాలి. దాన్ని పీరియాడికల్‌గా రివిజన్ చేసుకోవాలి.
-మొదటి నుంచి స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్‌లోని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్‌సైజ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి.
-గేట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్ నుంచి కొత్తగా గేట్ స్టాండర్డ్‌లో క్వశ్చన్స్‌ను ఊహించి విభిన్న కోణాల్లో ఆలోచించి తయారుచేసుకోవాలి.
-గేట్ సిలబస్ ప్రకారం ప్రతి టాపిక్ మీ కంట్రోల్‌లోకి రావాలి.
-మంచి స్కిల్స్ ఉన్న లెక్చరర్లు, గేట్ ఆస్పిరెంట్స్, గేట్ అచీవర్స్‌ను పరిచయం చేసుకుని గ్రూప్ చేసుకుని వారితో కలిసి ఎప్పటికప్పుడు మీ డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవాలి.
-గేట్ ప్రిపరేషన్ ఆర్డర్ ప్రకారం జరగాలి. ఉదా: మ్యాథ్స్ ప్రిపేర్ కాకుండా ఇంజినీరింగ్ కోర్ సబ్జెక్ట్స్ ప్రిపేర్ కాలేము. అలా ఆర్డర్‌ను సెట్ చేసుకుని ప్రిపరేషన్ కొనసాగించాలి.
-గేట్ ప్రిపరేషన్‌కు కావాల్సిన స్టడీ మెటీరియల్ కలెక్ట్ చేసి మీకు అందుబాటులో ఉంచుకోవాలి.
-గేట్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడే కాన్సెప్ట్ రిఫరెన్స్ కోసం ప్రతి సబ్జెక్టు స్టాండర్డ్ టెక్ట్స్ బుక్స్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.
-గేట్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసేటప్పుడే ఫాస్ట్‌గా రీడ్ చేయడం, అర్థం చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సిస్టమ్ మానిటర్‌పై చదవడం అలవాటు కావాలి.
-మంచి వ్యక్తిత్వం అలవాటు చేసుకోవడానికి వ్యక్తిత్వ వికాస పుస్తకాలను చదవాలి.
-కాలేజీలో అకడమిక్ షెడ్యూల్‌లో గేట్ ప్రిపరేషన్ కలిసేలా అయ్యేటట్లు చూసుకోవాలి.
-గేట్ ప్రిపరేషన్ కోసం మంచి కోచింగ్ సెంటర్‌ను ఎంచుకోవాలి. పర్సనల్ కేర్ ఎక్కువ ఉన్నచోట, నీ ప్రిపరేషన్ పర్యవేక్షించి, డౌట్లను క్లారిఫై చేసేచోటును ముఖ్యంగా చూడాలి.
-గేట్ ప్రిపేరింగ్ గ్రూప్‌లో ఎప్పటికప్పుడు కొత్తగా ఉన్న ప్రశ్నలను అప్‌డేట్ చేసుకుంటూ ప్రిపేర్ కావాలి. ఉదా: ఆ ఇయర్‌లో జరుగుతున్న కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్న గేట్ రిలేటెడ్ ప్రశ్నలు క్యాట్, ఈఎస్‌ఈ, సివిల్ సర్వీసెస్ మొదలైనవి.
-రెగ్యులర్‌గా గేట్ రిలేటెడ్ న్యూస్ ఫాలో చేస్తూ ఉండాలి. గేట్‌కు సంబంధించిన ఆర్టికల్స్, జాబ్ నోటిఫికేషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ ఎంటెక్ అడ్మిషన్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ గేట్ స్కోర్ వీటికి సంబంధించిన న్యూస్ తెలుసుకోవాలి.
-గేట్ ప్రిపేరయ్యే వాళ్లు ఆప్టిట్యూడ్ స్కిల్స్ పెంచుకోవడంవల్ల వారికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసే సరళిలో టైమ్ సేవ్ చేస్తారు.
-గేట్ ప్రిపేరయ్యేటప్పుడు ప్రాపర్ ఆటిట్యూడ్ కలిగి ఉండాలి. అంటే అర్థంకాని టాపిక్, ఒకటికి రెండుసార్లు ఓపికగా చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడానికి ఆటిట్యూడ్ బాగుండాలి.
-గేట్ ప్రిపేరయ్యేటప్పుడు ఫండమెంటల్స్ మ్యాథ్స్, ఫిజిక్స్‌లపై పట్టు సాధించాలి.
-గేట్ ప్రిపరేషనల్‌లో కాన్సన్‌ట్రేషన్ లెవల్ అంచనావేసి తక్కువుంటే పెంచగలగాలి. దానికి ప్రతిరోజూ కొంతసేపు మెడిటేషన్ చేయడం మంచిది.
-వీలైన చోట షార్ట్ కట్స్‌తో ప్రాక్టీస్ చేయాలి.
22

గేట్ స్ట్రక్చర్


-ఎగ్జామ్ డురేషన్ 3 గంటలు
-టోటల్ ప్రశ్నలు 65
-టోటల్ మార్కులు 100
-జనరల్ ఆప్టిట్యూడ్- 10 ప్రశ్నలు, 15 మార్కులు.
-ఇంజినీరింగ్ మ్యాథ్స్ అండ్ రెస్పెక్టివ్ ఇంజినీర్- 55 ప్రశ్నలు, 85 మార్కులు నెగెటివ్ మార్కింగ్
-ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 1/3 మార్కులు తగ్గిస్తారు.
-2 మార్కుల మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలకు 2/3 మార్కులు తగ్గిస్తారు.
-న్యూమరికల్ ఆన్సర్ టైప్ ప్రశ్నలకు నెగెటివ్ మార్కింగ్ లేదు.
Jayachandra

2292
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles