ప్రపంచ కప్ క్రికెట్- 2019


Wed,July 17, 2019 01:03 AM

download
-44 ఏండ్ల ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు గెలవని ఇంగ్లండ్ జట్టు ప్రపంచ క్రికెట్ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించింది. అసలు క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లండ్ సొంతగడ్డపై జరిగిన ప్రపంచ కప్-2019 టైటిల్‌ను ఎట్టకేలకు సొంతం చేసుకుంది. చారిత్రక లార్డ్స్ మైదానంలో సాగిన ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్ పైచేయి సాధించింది. తొలుత ఇరు జట్ల స్కోర్ సమం కావడంతో మ్యాచ్ టై అయింది. దీంతో సూపర్ ఓవర్లలో కూడా ఇరు జట్లు స్కోర్ సమం కావడంతో, మెరుగైన బౌండరీలు సాధించిన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా ప్రకటించారు. రెండోసారి న్యూజిలాండ్‌కు ఫైనల్‌లో చుక్కెదురైంది.

-ప్రపంచకప్ క్రికెట్‌ను అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) ప్రతి నాలుగేండ్లకోసారి నిర్వహిస్తుంది. ఈ టోర్నమెంట్ ప్రతి నాలుగేండ్లకోసారి నిర్వహిస్తారు. మొదటి ప్రపంచకప్ క్రికెట్ పోటీలను 1975లో ఇంగ్లండ్‌లో నిర్వహించారు. ఇంగ్లండ్‌లో జరిగిన మెదటి మూడు ప్రపంచ కప్ పోటీలను ప్రుడెన్షియల్ కంపెనీ నిర్వహించడంతో ప్రుడెన్షియల్ కప్‌గా పిలిచారు. 1987 నుంచి 1996 వరకు జరిగిన ప్రపంచకప్ క్రికెట్ పోటీలను రిలయన్స్ నిర్వహించడంతో రిలయన్స్ కప్ అని పిలిచేవాళ్లు. 12వ ప్రపంచ కప్ క్రికెట్ పోటీలను ఇంగ్లండ్, వేల్స్ దేశాల్లో మే 30 నుంచి జూన్ 14వ తేదీ వరకు జరిగింది.

-ప్రపంచ కప్ క్రికెట్‌ను ఆస్ట్రేలియా ఐదుసార్లు, వెస్టిండీస్, భారత్ రెండు సార్లు, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఒకసారి గెల్చుకున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో 27 ఏండ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ రెండోసారి ఫైనల్‌కు చేరింది. ఇప్పటి వరకు ప్రపంచకప్‌ను సాధించని రెండు జట్లు ఫైనల్‌కు చేరాయి. ఇంగ్లండ్ ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడం ఇది నాలుగోసారి. ఇంగ్లండ్ చిరకాల ప్రత్యర్థి డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాను సెమీఫైనల్‌లో చిత్తుచేసి ఫైనల్‌కు చేరి, ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఇంతకుముందు ఇంగ్లండ్ 1979, 1987, 1992లో ఫైనల్‌కు చేరింది. లార్డ్స్ మైదానం ఐదోసారి ప్రపంచకప్ ఫైనల్ పోటీలకు వేదికగా నిలిచింది.
pdf1
(గత ప్రపంచకప్‌ల చరిత్రను పరిశీలిస్తే.. గత నాలుగు ఫైనల్‌లలో మూడుసార్లు తొలుత బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. మరో విశేషమేమిటంటే టాస్ గెలిచిన ప్రతి జట్టు ఫైనల్‌లో ఓటమి పాలవడం)
-ఐసీసీ చైర్మన్: శశాంక్ మనోహర్
-ముఖ్య కార్యనిర్వహణాధికారి: మను సహానే
-మొత్తం పాల్గొన్న జట్లు: 10
-మొత్తం మ్యాచ్‌లు: 48
-మొత్తం రోజులు: 46
-మొత్తం వేదికలు: 10
-ప్రారంభ వేదిక: ఓవల్ మైదానం
-ఫైనల్ వేదిక: లార్డ్స్ మైదానం
-ప్రారంభ మ్యాచ్: ఇంగ్లండ్ - దక్షిణాఫ్రికా
-ఫైనల్ మ్యాచ్: ఇంగ్లండ్ - న్యూజిలాండ్
-విజేత: ఇంగ్లండ్
-రన్నరప్: న్యూజిలాండ్
-సెమీఫైనల్‌కు వచ్చినవి: న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్
-ప్రపంచకప్ గెలుచుకున్న జట్లు: 6- ఆస్ట్రేలియా, భారత్, శ్రీలంక, వెస్టిండీస్, పాకిస్థాన్, ఇంగ్లండ్
-అత్యధిక సార్లు గెలిచిన దేశం: ఆస్ట్రేలియా (ఐదుసార్లు)

ప్రపంచకప్ కప్‌లో ఇంగ్లండ్ ప్రస్థానం

-1975 - సెమీఫైనల్
-1979 - రన్నరప్
-1983 - సెమీఫైనల్
-1987 - రన్నరప్
-1992 - రన్నరప్
-2019 - విజేత

న్యూజిలాండ్ ప్రస్థానం

-1975 - సెమీఫైనల్
-1979 - సెమీఫైనల్
-1992 - సెమీఫైనల్
-1999 - సెమీఫైనల్
-2007 - సెమీఫైనల్
-2011 - సెమీఫైనల్
-2015 - ఫైనల్
-2019 - రన్నరప్
-ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ - విలియమ్సన్
-ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ - బెన్ స్టోక్స్
-గోల్డెన్ బ్యాట్ - రోహిత్ శర్మ (648) (అత్యధిక పరుగులు)

ప్రైజ్‌మనీ

-విజేత జట్టుకు రూ.27.42 కోట్లు
-రన్నరప్ జట్టుకు రూ.13.71 కోట్లు
-సెమీఫైనల్‌కు చేరిన జట్లకు రూ.5.48 కోట్లు
pdf2
ప్రపంచ కప్-2019 ప్రధానాంశాలు

-ప్రపంచకప్ చరిత్రలో ఒక టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా కెన్ విలియమ్సన్ (న్యూజిలాండ్) 578 పరుగులు చేశాడు. ఇంతకు ముందు శ్రీలంక కెప్టెన్ మహేలా జయవర్ధనె 548 పరుగులు (2017లో) చేశాడు.
-ఆతిథ్య జట్టు ప్రపంచకప్ అందుకోవడం ఇది మూడోసారి. గతంలో భారత్ (2011లో), ఆస్ట్రేలియా (2015లో) జట్లు విజేతలుగా నిలిచాయి.
-గత మూడు ప్రపంచ కప్‌లో చేజింగ్ చేసిన జట్లే విజేతలుగా నిలిచాయి. 2011లో శ్రీలంకపై భారత్, 2015లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలిచాయి.
-1999 ప్రపంచకప్‌లో వర్షం కారణంగా రెండో రోజుకు వాయిదా పడటం జరిగినది. అప్పుడు కూడా వేదిక ఇంగ్లండ్. నాడు ఇంగ్లండ్‌పై భారత్ గెలిచింది.
-ఒక ప్రపంచ కప్‌లో అత్యధిక సెంచరీలు (5) చేసింది రోహిత్ శర్మ. 2015లో శ్రీలంక క్రికెటర్ సంగక్కర నాలుగు సెంచరీలు చేశాడు.
-ఆరు ప్రపంచ కప్‌లు ఆడిన సచిన్ 44 ఇన్నింగ్స్‌లలో 6 శతకాలతో రికార్డు నెలకొల్పాడు. రెండో ప్రపంచకప్ ఆడిన రోహిత్ శర్మ కేవలం 16 ఇన్నింగ్స్‌లలో 6 శతకాలు నమోదు చేయడం విశేషం.
pdf3
-దక్షిణాఫ్రికాపై 122 నాటౌట్
-పాకిస్థాన్‌పై 140
-ఇంగ్లండ్‌పై 102
-బంగ్లాదేశ్‌పై 104
-శ్రీలంకపై 103
-కోహ్లీ తర్వాత వరుసగా మూడు శతకాలు చేసినది రోహిత్ శర్మ.
-ఒక్క మ్యాచ్ కూడా గెలవని జట్టు ఆప్ఘనిస్థాన్.
-భారత్ ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది ఆరోసారి.
-ఫైనల్‌కు చేరడం మూడు సార్లు. 1983, 2011లో విజేతగా నిలిచింది.
-ఇంగ్లండ్‌కిది ఐదో ఫైనల్. 1979లో వెస్టిండీస్, 1987లో ఆస్ట్రేలియా, 1992లో పాకిస్థాన్ జట్లపై ఓడింది.
-న్యూజిలాండ్‌కిది రెండో ఫైనల్. 2015లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
pdf4
ప్రపంచకప్‌లో రికార్డులు

-అత్యధిక భాగస్వామ్యం- శామ్యూల్స్ - క్రిస్‌గేల్ (372)
-ఒక మ్యాచ్‌లో ఎక్కువ ఎక్స్‌ట్రాలు ఇచ్చింది- స్కాట్‌లాండ్ (59)
-అత్యధిక సిక్స్‌లు కొట్టినది- క్రిస్ గేల్ (40)
-డబుల్ సెంచరీ చేసినది- క్రిస్ గేల్
-కెప్టెన్‌గా రెండుసార్లు ప్రపంచకప్ అందుకున్నది- క్లైవ్ లాయిడ్ (వెస్టిండీస్) 1975, 79, పాంటింగ్ (ఆస్ట్రేలియా) 2003, 2007.
Krishnaiah

842
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles