ఓయూలో దూరవిద్య


Thu,July 18, 2019 01:25 AM

ఉస్మానియా విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో 2019-20 విద్యాసంవత్సరానికి గాను వివిధ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
OUCDE
-పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ (ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, సంస్కృతం, ఉర్దూ, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్‌ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌, హిస్టరీ, సైకాలజీ), ఎంకామ్‌, ఎమ్మెస్సీ (మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌)
-గ్రాడ్యుయేట్‌ కోర్సులు: బీఏ, బీకాం జనరల్‌, బీబీఏ, బీఏ (మ్యాథ్స్‌ & స్టాటిస్టిక్స్‌)
-పీజీ డిప్లొమా కోర్సులు (ఏడాది): మ్యాథమెటిక్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ టీచింగ్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌
n అర్హత: పీజీ కోర్సులకు సంబంధిత విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ, అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు ఇంటర్‌, పీజీ డిప్లొమా కోర్సులకు ఏదైనా డిగ్రీ/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఎంబీఏ/ఎంసీఏ కోర్సులకు డిగ్రీతోపాటు టీఎస్‌/ఏపీ ఐసెట్‌-2019 లేదా పీజీఆర్‌ఆర్‌సీడీఈ నిర్వహించే అర్హత పరీక్షలో పాసవ్వాలి.
గమనిక: ఈ విద్యాసంవత్సరం నుంచి ఎంఏ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బీకాం కంప్యూటర్‌ అప్లికేషన్‌, పీజీ డిప్లొమా ఇన్‌ డాటా సైన్స్‌ కోర్సులను ప్రారంభించనున్నారు.
-దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్‌ 30
-వెబ్‌సైట్‌: www.oucde.net

555
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles