సెల్ఫ్ లెర్నింగ్ @ స్వయం


Wed,July 31, 2019 02:13 AM

సాకేత్ బెస్ట్ కాలేజీలో ఇంజినీరింగ్ చేయాలనుకున్నాడు. కానీ అతను కోరుకున్న కాలేజీలో సీటు రాలేదు. అతని కుటుంబ పరిస్థితికి అనుగుణంగా దగ్గర్లోని ఒక కాలేజీలో చేరాడు. అతనికి సరికొత్త కోర్సులను, సాంకేతికను నేర్చుకోవాలనే తపన ఉన్నా ఆర్థిక ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు. సరిగ్గా ఇటువంటి వారి కోసం దేశంలోని బెస్ట్ ఫ్యాకల్టీలతో రూపొందించి వివిధ డొమైన్లలో ఆయా కోర్సులను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదిక స్వయం. స్వయం గురించి ఈ వారం సంక్షిప్తంగా తెలుసుకుందాం...

స్వయం అంటే స్టడీ వెబ్స్ ఆఫ్ యాక్టివ్-లెర్నింగ్ ఫర్ యంగ్ ఆస్పిరింగ్ మైండ్స్ (SWAYAM). దీన్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది. విద్యా విధానంలో యాక్సెస్, ఈక్విటీ, నాణ్యత అనే మూడు కార్డినల్ సూత్రాలను సాధించడానికి రూపొందించిన ప్రోగ్రామ్. దీని ప్రధాన లక్ష్యం అత్యుత్తమ బోధన అభ్యాస వనరులను అందరి దగ్గరికి తీసుకెళ్లడం, అత్యంత వెనుకబడిన వారితోపాటు ఇప్పటి వరకు డిజిటల్ విప్లవానికి అందుకోని, అవకాశం లేని వారికి, జ్ఞానఆర్థిక వ్యవస్థ ప్రధాన స్రవంతిలో చేరలేకపోయిన విద్యార్థుల కోసం, డిజిటల్ విభజనను తగ్గించడానికి దీన్ని కేంద్రం ప్రారంభించింది.
Self

ఏయే తరగతుల వారికి?

9 వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు తరగతి గదులలో బోధించే అన్ని కోర్సుల హోస్టింగ్‌ను సులభతరం చేసే ప్లాట్‌ఫాం ద్వారా ఇది జరుగుతుంది. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా యాక్సెస్ చేయవచ్చు. అన్ని కోర్సులు ఇంటరాక్టివ్, దేశంలోని ఉత్తమ ఉపాధ్యాయులు తయారుచేస్తారు. ఈ కోర్సులన్ని ఏ విద్యార్థికైనా ఉచితంగా లభిస్తాయి. ఈ కోర్సుల తయారీలో దేశవ్యాప్తంగా 1,000 మంది ప్రత్యేకంగా ఎంపిక చేసిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ కోర్సులు నాలుగు భాగాలుగా ఉన్నాయి.

1. వీడియో పాఠాలు
2. ప్రత్యేకంగా తయారుచేసిన మెటీరియల్ (వీటిని డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు)
3. స్వీయ అంచనా (సెల్ఫ్ అసెస్‌మెంట్) కోసం పరీక్షలు, క్విజ్‌లు
4. సందేహాల నివృత్తి కోసం ఆన్‌లైన్ చర్చా వేదిక.

-వీటితోపాటు ఆడియో-వీడియో, మల్టీ-మీడియా, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ బోధన (పెడగాగీ) / సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అభ్యసన అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి చర్యలు తీసుకున్నారు. వీటితోపాటు స్టడీ మెటీరియల్, విద్యలో నాణ్యత కోసం తొమ్మిది జాతీయ సంస్థలను కోఆర్డినేటర్లుగా నియమించింది కేంద్రం. అవి..
-ఏఐసీటీఈ, ఎన్‌పీటీఈఎల్, యూజీసీ, సీఈసీ, ఎన్‌సీఈఆర్‌టీఈ, ఎన్‌ఐవోఎస్, ఇగ్నో, ఐఐఎంబీ, ఎన్‌ఐటీటీటీఆర్.

స్వయం కోర్సు- సర్టిఫికెట్లు

-స్వయం ద్వారా అందించే కోర్సులను విద్యార్థులకు ఉచితంగా అందిస్తారు. ఈ సర్టిఫికెట్ కావాలనుకునే విద్యార్థులు స్వయం నిర్వహించే పరీక్షలకు ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవాలి. నిర్ణీత తేదీల్లో నిర్దేశిత పరీక్ష కేంద్రాల్లో వ్యక్తిగతంగా హాజరు కావాలి. సర్టిఫికెట్ కోసం అర్హత కోర్సు పేజీలో ఉంటుంది. దాని ప్రమాణాలు సరిపోతే అభ్యాసకులకు ధృవీకరణ పత్రాలు ఇస్తారు. ఈ కోర్సులకు సంబంధించిన సర్టిఫికెట్లను అన్ని క్రెడిట్ బదిలీని ఆమోదించే విశ్వవిద్యాలయాలు / కళాశాలల్లో అనుమతిస్తారు. దీనికి సంబంధించిన గెజిట్‌ను ఏఐసీటీఈ ఇప్పటికే వెలువరించింది.

ఏయే కోర్సులను ఎవరు నిర్వహిస్తారు?

-స్కూల్ ఎడ్యుకేషన్- NIOS, NCERT
-Out-of-School Education- IGNOU, NITTTR
-అండర్ గ్రాడ్యుయేట్- NPTEL, AICTE, CEC, IIMB
-పీజీ- NPTEL, AICTE, IIMB, UGC
-కోర్సులు-కాలపరిమితి: సుమారు రెండువేలకు పైగా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి నాలుగు వారాల నుంచి 16 వారాల కాలవ్యవధిగల కోర్సులు.
-యాన్యువల్ రిఫ్రెషర్ ప్రోగ్రామ్ ఇన్ టీచింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఎడ్యుకేషన్, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, హ్యుమానిటీస్ అండ్ ఆర్ట్స్, మేనేజ్‌మెంట్ అండ్ కామర్స్, మ్యాథ్స్&సైన్స్ కోర్సులు ఉన్నాయి.
-ఈ కోర్సుల్లో అత్యాధునిక టెక్నాలజీ నుంచి మొదలుకొని లిబర్ ఆర్ట్స్‌లో లేటెస్ట్ డెవలప్‌మెంట్స్ కోర్సుల వరకు ఉన్నాయి.

-కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

501
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles