బ్యాంకుల్లో 4336 పీవోలు


Mon,August 5, 2019 01:08 AM

దేశంలోని తొమ్మిది జాతీయ బ్యాంకుల్లో 4336 ప్రొబేషనరీ పోస్టుల భర్తీకి ఐబీపీఎస్ ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టలకు డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులు. అభ్యర్థుల ఎంపికను రెండుదశల్లో చేస్తారు. ఈ పోస్టులకు అర్హత, పరీక్ష విధానం, సిలబస్ తదితర వివరాలు నిపుణ పాఠకుల కోసం...
IBPS

ఐబీపీఎస్ - సీఆర్‌పీ పీవో/ఎంటీ-IX

-ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) దేశవ్యాప్తంగా ఉన్న జాతీయబ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఉమ్మడి రాతపరీక్ష (సీడబ్ల్యూఈ పీవో/ఎంటీ-IX) నోటిఫికేషన్‌ను ఐబీపీఎస్ విడుదల చేసింది.
-పోస్టు: ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం పోస్టుల సంఖ్య: 4336 (జనరల్-2031, ఈడబ్ల్యూఎస్-432, ఓబీసీ-904, ఎస్సీ-670, ఎస్టీ-299)
-అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే నాటికి విద్యార్హత సర్టిఫికెట్ చెల్లుబాటు అయ్యేవిధంగా ఉండాలి.
-వయసు: 2019 ఆగస్టు 1 నాటికి 20- 30 ఏండ్ల మధ్య ఉండాలి. (1989 ఆగస్టు 2 నుంచి 1999 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి)
-ఎంపిక: రాతపరీక్ష (ప్రిలిమినరీ, మెయిన్స్), ఇంటర్వ్యూ

Prelims Syllabus

English Language : Reading Comprehension, Cloze Test, Para jumbles, Miscellaneous, Fill in the blanks, Multiple Meaning/Error Spotting, Paragraph Completion.

Quantitative Ability : Simplification, Profit & Loss, Mixtures & Allegations, Simple Interest & Compound Interest & Surds & Indices, Work & Time, Time & Distance, Mensuration Cylinder, Cone, Sphere, Data Interpretation, Ratio & Proportion, Percentage, Number Systems, Sequence & Series, Permutation, Combination &Probability.

Reasoning : Logical Reasoning, Alphanumeric Series, Ranking/Direction/Alphabet Test, Data Sufficiency, Coded Inequalities, Seating Arrangement, Puzzle, Tabulation, Syllogism, Blood Relations, Input Output, Coding Decoding.

Mains Exam Syllabus

Quantitative Aptitude : Simplification, Average, Percentage, Ratio and Percentage, Data Interpretation, Mensuration and Geometry, Quadratic Equation, Interest, Problems of Ages, Profit and Loss, Number Series, Speed, Distance and Time, Time and Work, Number System, Data Sufficiency, Linear Equation, Permutation an Combination, Probability, Mixture and Allegations.

General Awareness : Current affairs related to national and international issues of last 6 months.Overview of Indian Financial/banking System, Important Government Schemes on capital & money market. Recent credit and monetary policies etc..

Reasoning :Verbal Reasoning, Syllogism, Circular Seating Arrangement, Linear Seating Arrangement, Double Lineup, Scheduling, Input Output, Blood Relations, Directions and Distances, Ordering and Ranking, Data Sufficiency, Coding and Decoding, Code Inequalities

Computer Aptitude : Internet, Memory, Keyboard Shortcuts, Computer Abbreviation, Microsoft Office, Computer Hardware, Computer Software, Operating System, Networking, Computer Fundamentals /Terminologies etc..
English Language: Reading Comprehension, Vocabulary, Grammar (Error Spotting, Phrase Replacement, Fill in the blanks), Verbal Ability (Para Jumbles) etc..

బ్యాంకుల వారీగా ఖాళీలు:

అలహాబాద్ బ్యాంక్-500 (జనరల్-203, ఈడబ్ల్యూఎస్-50, ఓబీసీ-135, ఎస్సీ-75, ఎస్టీ-37)
-బ్యాంక్ ఆఫ్ ఇండియా-899 (జనరల్-583, ఈడబ్ల్యూఎస్-89, ఓబీసీ-11, ఎస్సీ-158, ఎస్టీ-58)
-బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-350 (జనరల్-143, ఈడబ్ల్యూఎస్-35, ఓబీసీ-94, ఎస్సీ-52, ఎస్టీ-26)
-కెనరా బ్యాంక్-500 (జనరల్-203, ఈడబ్ల్యూఎస్-50, ఓబీసీ-135, ఎస్సీ-75, ఎస్టీ-37)
-కార్పొరేషన్ బ్యాంక్-150 (జనరల్-62, ఈడబ్ల్యూఎస్-15, ఓబీసీ-40, ఎస్సీ-22, ఎస్టీ-11)
-ఇండియన్ బ్యాంక్- 493 (జనరల్-201, ఈడబ్ల్యూఎస్-49, ఓబీసీ-133, ఎస్సీ-73, ఎస్టీ-37)
-ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ - 300 (జనరల్-122, ఈడబ్ల్యూఎస్-29, ఓబీసీ-79, ఎస్సీ-48, ఎస్టీ-22)
-యూకో బ్యాంక్ - 500 (జనరల్-261, ఈడబ్ల్యూఎస్-50, ఓబీసీ-118, ఎస్సీ-53, ఎస్టీ-18)
-యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-644 (జనరల్-253, ఈడబ్ల్యూఎస్-65, ఓబీసీ-159, ఎస్సీ-114, ఎస్టీ-53)

గమనిక: పైన సూచించిన ఖాళీల సంఖ్య బ్యాంక్ అవసరాల మేరకు పెరగవచ్చు/తగ్గవచ్చు.

పరీక్షా విధానం

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్

-మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 ప్రశ్నలను 60 నిమిషాల్లో పూర్తి చేయాలి. విభాగాలవారీ గరిష్ట సమయాన్ని కేటాయించారు. ఒక్కో విభాగాన్ని 20 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మెయిన్ ఎగ్జామినేషన్

-మెయిన్స్‌లో మొత్తం ఐదు సబ్జెక్టులతో నాలుగు విభాగాలుంటాయి. విభాగాల వారీగా సమయాన్ని కేటాయించారు. మొత్తం 3 గంటలు. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో డిస్క్రిప్టివ్ పేపర్‌కు అదనంగా 30 నిమిషాల వ్యవధి. అంటే మెయిన్స్ మొత్తానికి కేటాయించిన సమయం 3.30 గంటలు. అభ్యర్థులు ఈ విభాగాలన్నింటిలో విడివిడిగా ఉత్తీర్ణులవ్వాలి. ప్రతి తప్పు జవాబుకు ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కుల్లో 1/4 మార్కులను కోత విధిస్తారు.

ముఖ్యమైన తేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఆగస్టు 7 నుంచి ప్రారంభం
-చివరితేది: ఆగస్టు 28
-ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ.600. ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌సీలకు రూ.100/-
-ఫీజు చెల్లింపు: ఆగస్టు 7 నుంచి ఆగస్టు 28 వరకు
-ప్రిలిమినరీ పరీక్ష కాల్‌లెటర్ డౌన్‌లోడ్: అక్టోబర్‌లో
-ప్రిలిమినరీ పరీక్ష తేదీ: అక్టోబరు 12, 13, 19, 20
-ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు: అక్టోబరు/ నవంబర్‌లో
-మెయిన్ పరీక్ష కాల్‌లెటర్ డౌన్‌లోడ్: నవంబర్‌లో
-మెయిన్ పరీక్ష తేదీ: నవంబర్ 30
-మెయిన్ పరీక్ష ఫలితాలు: డిసెంబర్ 2019
-ఇంటర్వ్యూ కాల్‌లెటర్ డౌన్‌లోడ్: 2020 జనవరిలో
-ఇంటర్వ్యూ తేదీ: 2020 జనవరి/ ఫిబ్రవరిలో
-ప్రిలిమినరీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
-మెయిన్ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
-వెబ్‌సైట్: www.ibps.in
IBPS2

-తన్నీరు వెంకటేశ్వర్లు

840
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles