స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?


Wed,August 14, 2019 12:31 AM

Deers

1. తెలంగాణ రాష్ట్ర అడవుల విస్తీర్ణంలో రిజర్వ్ ఫారెస్ట్ ఎంత?

ఎ) 6, 953 చ.కిమీ
బి) 7, 013 చ.కిమీ
సి) 5, 925 చ.కిమీ
డి) 6, 230 చ.కిమీ

2. కోళ్ల పరిశ్రమకు ప్రభుత్వం యూనిట్‌కు ఎన్ని రూపాయల చొప్పున సబ్సిడీ అందజేస్తుంది?

ఎ) రూ.2
బి) రూ.3
సి) రూ.4
డి) రూ.5

3. తెలంగాణ భూవనరుల వినియోగంలో వాస్తవ అంశాలు ?

1) సాగుభూమి శాతం 39%
2) అటవీభూమి 22.7%
3) వ్యవసాయేతర వినియోగం 7.9%
ఎ) 1,2
బి) 2,3
సి) 1,3
డి)1,2,3

4. వ్యవసాయ వృద్ధి తగ్గుదలకు కారణాలు ఏమిటి?

ఎ) పంట ఉత్పాదకతలో స్తబ్ధత
బి) విద్యుత్ సమస్య
సి) పారిశ్రామికరణ
డి) పైవన్నీ

5. తెలంగాణలో శ్రామికుల డిమాండ్, సప్తయ్ మధ్య అసమతౌల్యానికి కారణాలు ఏమిటి?

1) వ్యవసాయధారిత పరిశ్రమల వృద్ధి కాకపోవడం
2) అల్ప నీటి పారుదల సౌకర్యాలు
ఎ) 1వాస్తవం
బి) 2వాస్తవం
సి) 1, 2 వాస్తవాలు
డి)1, 2 వాస్తవాలు కాదు

6. తెలంగాణలో ఏ ల్యాబ్‌లలో ఎరువులను, క్రిమిసంహార ప్రయోగాలను పరీక్షిస్తారు?

ఎ) అగ్రిల్యాబ్‌లు
బి) ఎరువుల ల్యాబ్‌లు
సి) E- అగ్రిల్యాబ్‌లు
డి) వ్యవసాయ ల్యాబ్‌లు

7. కింది వానిలో సరైన అంశం ఏది?

1. దేశంలో 20%శాతం రైతులు సర్టిఫైడ్ విత్తనాలు వాడుతున్నారు.
2. తెలంగాణలో 70% రైతులు సర్టిఫైడ్ విత్తనాలు వాడుతున్నారు.
ఎ) 2 సరైనది, 1 సరైనది కాదు
బి) 1, 2 సరైనవి
సి) 1, 2 సరికావు
డి) 1 సరైనది, 2 సరైనది కాదు

8. కల్పవృక్షం అని కింది వాటిలో దేనిని పిలుస్తారు?

ఎ) జనుము
బి) కొబ్బరి
సి) మొక్కజొన్న
డి) పల్లి

9. కింది వాటిలో వ్యవసాయానికి ప్రధాన ఆటంకాలు ఏవి?

ఎ)తక్కువ యాంత్రీకరణ
బి) వడ్డీ వ్యాపారుల దోపిడీ
సి) 63% వ్యవసాయం వర్షాధారితకు
డి) వడ్డీ వ్యాపారుల దోపిడీ

10. హైదరాబాద్ మొదటి హార్టికల్చర్ అంతర్జాతీయ ప్రదర్శన ఎప్పుడు జరిగింది?

ఎ) 2015 జనవరి 22-26
బి) 2015 జనవరి 30-పిబ్రవరి 3
సి) 2015 జనవరి 28-30
డి) 2015 జనవరి 26-30

11. వరిపంట విస్తీర్ణం శాతం ఆహార పంటల విస్తీర్ణంలో ఏంత?

ఎ)32%
బి) 45%
సి)30%
డి) 40%

12. కింది వాటిలో ఏ పంట అల్ప వర్షపాతం, అల్పనీటి పారుదల ప్రాంతంలో పండుతుంది?

ఎ) కాయగూరలు
బి) సజ్జలు
సి) వరి
డి) చెరకు

13. కింది వాటిలో సరైన వాక్యం ఏది?

1. అటవీ వనరుల అత్యధిక వాటాగల ఏడాది 2004-05
2. అటవీ వనరుల అత్యల్ప వాటా గల ఏడాది 2014-15
ఎ) 1, 2 సరైనవి కావు
బి) 2 వాస్తవం, 1 సరైనది కాదు
సి) 1 సరైనవి, 2 సరైనది కాదు
డి) 1, 2 సరైనవి

14. కింది వాటిలో సరైనది?

1. బెల్లంపల్లిలో పండ్ల ప్రాసెసింగ్ కేంద్రం కలదు
2. అరటి పరిశోధన కేంద్రం సంగారెడ్డిలో కలదు
ఎ) 1 వాస్తవం
బి) 2 వాస్తవం
సి) 1, 2 వాస్తవం
డి) 1, 2 అవావస్తవం

15. తృణ ధాన్యాలకు సంబంధించి సరియైన అంశాన్ని గుర్తించండి?

ఎ) తృణ ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం అగ్రస్థానంలో ఉన్నది
బి) సజ్జలకు మరొక పేరు ముత్యాల తృణ ధాన్యాలు
సి) రాగులకు ఫింగర్ మిల్లెట్ అని మరొక పేరు కలదు
డి) పై అన్ని సరైనవే

16. తెలంగాణ దేశంలో జీవసంపదలో ఎన్నవ స్థానంలో ఉన్నది?

ఎ) 9వ స్థానం
బి) 12వ స్థానం
సి) 15వ స్థానం
డి) 10వ స్థానం

17. ఈ కింది వానిలో సరైనవి?

ఎ) సేకరణ ధరలను నిర్ణయించేది FCI
బి) మద్దతు ధరలను నిర్ణయించేది వ్యవసాయ వ్యయాల ధరల కమిషన్
సి) మార్కెట్ ధరలు, సేకరణ ధరలు, మద్దతు ధరలు, మధ్య సంబంధం మద్దతు ధరలు< సేకరణ సేకరణ< మార్కెట్ ధరలు
డి) పైవన్నీ

18. భారతదేశంలో పండ్లతోటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రం స్థానమెంత?

ఎ) 1
బి) 3
సి) 4
డి) 6

19. కాకతీయ, సరస్వతి, లక్ష్మి అనే మూడు ప్రధాన కాలువల గల ప్రాజెక్టు?

ఎ) ప్రయదర్శిని ప్రాజెక్టు
బి) కడెం నారాయణ ప్రాజెక్టు
సి)శ్రీరాంసాగర్ ప్రాజెక్టు
డి) ఇందిరాసాగర్

20. కింది వాటిలో సరైనది?

1. దేశంలో భూకమతాల పరిమాణం- 1.16 హెక్టార్లు
2. రాష్ట్రంలో భూకమాతాల సగటు పరిమాణం- 1.12 హెక్టార్లు
ఎ) 1 వాస్తవం
బి) 2 వాస్తవం
సి) 1, 2 వాస్తవం
డి) 1, 2 అవాస్తవం

21. తెలంగాణ ప్రాంత మధ్యవర్తుల తొలగింపు చట్టాలు ఏవి?

1. తెలంగాణ ఇనాంల రద్దు చట్టం-1995
2. తెలంగాణ ఇనాంల సవరణ చట్టం-1985
ఎ) 1,2
బి) 1
సి) 2
డి) ఏదికాదు

22. అటవీ నివాసుల ( అటవీ హక్కుల గుర్తింపు) చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు?

ఎ) 2002
బి) 2006
సి) 2011
డి) 2014

23. తెలంగాణలో పేదరికపు అసమానతలు తొలగిపోవడానికి ఎక్కడ భూపంపిణీ పథకాన్ని ప్రారంభించారు?

ఎ) వరంగల్
బి) బేతోల్
సి) షాద్‌నగర్
డి) హైదరాబాద్

24. తెలంగాణలో భూమి కొనుగోలు పథకం ఎప్పుడు ప్రారంభమైంది? ఎ) 15 సెప్టెంబర్ 2014
బి) 15 సెప్టెంబర్ 2015
సి) 15 ఆగస్టు 2015
డి) 15 ఆగస్టు 2014

25. ఈ కింది వానిలో భూసంస్కరణలు అన్నింటిలోను అత్యంత ప్రధానమైనది?

ఎ) భూపంపిణీ
బి) భూకమతాల గరిష్ట పరిమితి
సి) భూ యాజమాన్య హక్కులు
డి) అసైన్డ్ భూముల రక్షణలు

26. 2011 ప్రకారం తెలంగాణలో వ్యవసాయదారులు, వ్యవసాయ కార్మికులు మొత్తం?

ఎ) 76.84 లక్షలు
బి) 75.84 లక్షలు
సి) 77.84 లక్షలు
డి)72.83 లక్షలు

27. పంట రుణాల మాఫీపథకం కింద ఎక్కువగా లాభం పొందిన జిల్లా?

ఎ) కరీంనగర్
బి) నిజామాబాద్
సి) మహబూబ్‌నగర్
డి) మెదక్

28. ఈ కింది వానిలో సరియైనది?

1. 2014-15 స్థూల సాగు విస్తీర్ణం- 53.2 లక్షల హెక్లార్లు
2. 2014-15 నికర సాగు విస్తీర్ణం- 43.8లక్షల హెక్టార్లు
ఎ) 1 వాస్తవం
బి) 2వాస్తవం
సి) 1, 2 వాస్తవం
డి) 1, 2, 3 అవాస్తవాలు

29. ఎన్నేండ్లకోసారి రైతుబందు పథకాన్ని రెన్యువల్ చేసుకోవాలి?

ఎ) 3 సంవత్సరాలు
బి) 5 సంవత్సరాలు
సి) 2/12 సంవత్సరాలు
డి) 4 సంవత్సరాలు

30. అత్యధిక నికర నీటిపారుదల నిష్పత్తి నమోదైన సంవత్సరం?

ఎ) 2011-12
బి) 2012-13
సి) 2009-10
డి) 2010-11

31. వర్షపాతం కొరత ఉన్న ప్రాంతాల్లో సుస్థిర ఉత్పత్తి కోసం పంటల సాగుకు అనుసరించే పద్దతులు ఏవి?

ఎ) సరైన పంటల ఎంపిక
బి) వర్షపు నీటి నిల్వ
సి) సకాలంలో కలుపు నియంత్రణ
డి) పైవన్ని

32. జింకల వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?

ఎ) షామీర్‌పేట్
బి) కరీంనగర్
సి) ములుగు
డి) సిద్దిపేట

33. మొత్తం ఉద్యానవన రంగంలో పండ్లు ఎక్కువగా ఎంత శాతం భౌగోళిక విస్తీర్ణం?

ఎ) 24.52%
బి) 19.1%
సి) 22.2%
డి) 54.5%

34. ఏ ప్రాజెక్టు పేరును సీతారామ ఎత్తిపోతల పథకంగా మార్చారు?

ఎ) దుమ్ముగూడెం ఎత్తిపోతల
బి) తమ్మడిహట్టి
సి) కాళేశ్వరం
డి) శ్రీశైలం

35. తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటైన మొదటి విద్యుత్ కేంద్రం ఏది?

ఎ) జాతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్
బి) హుస్సేన్‌సాగర్ థర్మల్ పవర్ స్టేషన్
సి) కాకతీయ థర్మల్ పవర్ కార్పొరేషన్
డి) ఏదికాదు

36. తెలంగాణ విద్యుత్ వినియోగదారులకు సంబంధించిన అంశాల్లో సరైనవి ఏవి?

1) గృహ వినియోగదారలు 73%
2) వ్యవసాయ వినియోగదారులు 17%
3) వాణిజ్య వినియోగదారులు 17%
ఎ) 1,2
బి) 1, 3
సి) 2, 3
డి) 1, 2, 3

37. సింగరేణి కాలరీస్ ఎప్పుడు ప్రారంభించారు?

ఎ) 1921
బి) 1930
సి) 1946
డి) 1945

38. మహిళా పారిశ్రామిక పార్కులు ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?

1. జడ్చర్ల
2. సుల్తాన్‌పూర్
3. ఆదిభట్ల
ఎ) 1, 2
బి) 2, 3
సి) 1,3
డి) ఏదీకాదు

39. పోచంపల్లి చీరలు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాముఖ్యతను పొందాయి?

ఎ) 1900 ఏండ్లు
బి) 1800 ఏండ్లు
సి) 1700 ఏండ్లు
డి) 1600 ఏండ్లు

40. తెలంగాణలోని పోచంపల్లి ఏ విధంగా ప్రసిద్ధి పొందింది?

ఎ) తెలంగాణ కాటన్ రంగం
బి) తెలంగాణ సిల్క్ నగరం
సి) తెలంగాణ జనుము నగరం
డి) తెలంగాణ ఉన్ని నగరం

41. తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల నుంచి వచ్చే విలువపరంగా ఎన్నో స్థానంలో ఉన్నది?

ఎ) 8వ స్థానం
బి) 9వ స్థానం
సి) 7వ స్థానం
డి) 6వ స్థానం

42. చేనేత కార్మికుల కోసం ఆరోగ్య బీమా పథకం ఎప్పుడు ప్రతిపాదించబడింది?

ఎ) 1 ఏప్రిల్ 2013
బి) 2 ఏప్రిల్ 2015
సి) 15 మార్చి 2015
డి) 1 జనవరి 2014

43. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం?

ఎ) మహారాష్ట్ర
బి) ఆంధ్రప్రదేశ్
సి) గుజరాత్
డి) పంజాబ్

44. ఏ సంవత్సరంలో కాగితం ఉత్పత్తి తెలంగాణలో ప్రారంభమైంది?

ఎ) 1942
బి) 1944
సి) 1946
డి) 1948
Deers1

525
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles