కరెంట్ అఫైర్స్


Wed,August 14, 2019 12:54 AM

Telangana
Telangana

కాళోజీ యూనివర్సిటీకి ఎంసీఐ గుర్తింపు

కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) ఆగస్టు 6న గుర్తింపునిచ్చింది. దీంతో వర్సిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చదివే ఎంబీబీఎస్, ఎండీ, సూపర్ స్పెషాలిటీ మెడికల్ విద్యార్థులందరికీ ఈ వర్సిటీ పేరుమీదే సర్టిఫికెట్లు జారీ కానున్నాయి.

టీఐఎఫ్‌ఆర్‌లో ఎక్స్‌ట్రీమ్ సెంటర్

హైదరాబాద్‌లోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసెర్చ్ (టీఐఎఫ్‌ఆర్)లో ఎక్స్‌ట్రీమ్ ఫొటోనిక్ ఇన్నోవేషన్ సెంటర్ (ఎపిక్) ఏర్పాటుకు సంబంధించి ఆగస్టు 9న ఎంఓయూ కుదిరింది. టీఐఎఫ్‌ఆర్, యూకేకు చెందిన రూథర్‌ఫర్డ్ అప్పిలేట్ ల్యాబొరేటరీ-సెంట్రల్ లేజర్ ఫెసిలిటీ (సీఎల్‌ఎఫ్) సంయుక్తంగా ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.

National
National

జమ్ముకశ్మీర్ బిల్లుకు ఆమోదం

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370 అధికరణం ఉపసంహరణకు ఉద్దేశించిన తీర్మానానికి, ఆ రాష్ర్టాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టే జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరణ బిల్లు-2019కు లోక్‌సభ ఆగస్టు 6న ఆమోదం తెలిపింది. లోక్‌సభలో ఈ బిల్లుకు 351 మంది సభ్యులు మద్దతు తెలపగా, 72 మంది వ్యతిరేకించారు. ఈ బిల్లును రాజ్యసభ ఆగస్టు 5నే ఆమోదించింది.

ఈ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆగస్టు 9న ఆమోదం తెలిపారు. ఈ చట్టం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుంచి అమలవుతుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీచేసింది.

ఇండియన్ ఆయిల్ ఈడీగా అరూప్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) దక్షిణ ప్రాంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా అరూప్ సిన్హా ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు సంబంధించిన మానవ వనరులు, ఆర్థిక, ఉత్పత్తి రవాణా, కాంట్రాక్టులు, భద్రత, నాణ్యత నియంత్రణ వంటి పలు బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.

సీఐఐ సమావేశం

న్యూఢిల్లీలో ఆగస్టు 9న పరిశ్రమల సమాఖ్య సీఐఐ జాతీయ మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మందగమన సంకేతాలతో సతమతమవుతున్న ఆర్థిక వ్యవస్థపై తగు చర్యలు తీసుకునే విషయమై, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద కంపెనీలు తప్పనిసరిగా నిర్దేశిత మొత్తం కేటాయించకపోతే తీసుకునే చర్యలపై చర్చించారు.

నాడా పరిధిలోకి బీసీసీఐ

జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) పరిధిలోకి వచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అంగీకరించిందని జాతీయ క్రీడా కార్యదర్శి రాధేశ్యామ్ ఘులనియా ఆగస్టు 9న తెలిపారు. దీంతో బీసీసీఐకి కూడా ఇకపై ఇతర క్రీడలలాగే జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)గా గుర్తింపు లభించింది. దీంతో డోపింగ్ విషయంలో నాడా నిర్వహించే పరీక్షలకు భారత క్రికెటర్లు కూడా హాజరుకావాల్సి ఉంటుంది.

International
International

యాపిల్ క్రెడిట్ కార్డు

టెక్ దిగ్గజం యాపిల్ క్రెడిట్ విభాగంలోకి ప్రవేశించింది. ప్రాథమికంగా మొబైల్ ద్వారా వినియోగించేలా గోల్డ్‌మన్‌శాచ్ భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డును అమెరికాలో ఆగస్టు 6న విడుదల చేసింది.

భారత్‌తో పాక్ వాణిజ్యం నిలిపివేత

భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని పాకిస్థాన్ ఆగస్టు 7న నిర్ణయించింది. ఆర్టికల్ 370 ఉపసంహరణతోపాటు జమ్ముకశ్మీర్ పునర్‌వ్యవస్థీకరించడంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన ఆ దేశ జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్‌లోని భారత హై కమిషనర్ అజయ్ బిసారియాను బహిష్కరించింది. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించాల్సి ఉన్న పాక్ రాయబారి మొయిన్ ఉల్ హక్‌ను పంపకూడదని నిర్ణయించింది.

వెనెజులాలో చమురుశుద్ధి కర్మాగారం

వెనెజులా రాజధాని కారకాస్‌లో చైనా సహకారంతో నిర్మించిన చమురుశుద్ధి కర్మాగారాన్ని ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ఆగస్టు 8న ప్రారంభించారు. చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ సహకారంతో నిర్మించిన ఈ రిఫైనరీ ద్వారా చమురు ఉత్పత్తిని రోజుకు ప్రస్తుతం ఉన్న 1.1 లక్షల బ్యారెళ్ల స్థాయి నుంచి 1.65 లక్షల బ్యారెళ్ల స్థాయికి పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు.

భూమిపుత్రుల దినోత్సవం

అంతర్జాతీయ భూమిపుత్రుల దినోత్సవాన్ని (International day of the Worlds Indigenous people) ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. భూమిపుత్రుల హక్కుల పరిరక్షణ లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భూమిపుత్రుల హక్కుల రక్షణ కోసం ఏర్పాటైన ఐక్యరాజ్యసమితి కమిషన్ 1982 ఆగస్టు 9న మొదటిసారి సమావేశం కావటంతో అదే రోజు ఈ దినోత్సవానికి ఎంపిక చేసుకున్నారు.

Sports

ఫోర్బ్స్ క్రీడాకారిణుల జాబితా

ప్రపంచంలో అత్యధిక మొత్తంలో సంపాదిస్తున్న ఫోర్బ్స్ క్రీడాకారిణుల జాబితాను ఆగస్టు 7న విడుదల చేశారు. ఈ జాబితాలో అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ (29.2 మిలియన్ డాలర్లు) అగ్రస్థానంలో నిలిచింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు (5.5 మిలియన్ డాలర్లు) 13వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో టాప్-15లో చోటు దక్కించుకున్నవారిలో 13 మంది టెన్నిస్ క్రీడాకారిణులే కావడం విశేషం. సింధు, అరియా జుటాసుగర్న్ మాత్రమే ఇతర క్రీడలకు చెందినవారు. అరియా థాయిలాండ్‌కు చెందిన గోల్ఫ్ ప్లేయర్.

బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్

ఆగస్టు 6న ప్రకటించిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 5వ స్థానంలో నిలిచింది. సైనా నెహ్వాల్ 8, పురుషుల సింగిల్స్‌లో కిదాంబి శ్రీకాంత్ 10, సమీర్‌వర్మ 13, సాయిప్రణీత్ 19 ర్యాంకుల్లో ఉన్నారు.

Persons
Persons

రచయిత్రి మారిసన్ మృతి

ప్రముఖ అమెరికన్ సాహితీవేత్త, నవలా రచయిత్రి, నోబెల్ అవార్డు గ్రహీత టోని మారిసన్ న్యూయార్క్‌లోని మోంటిఫియోర్ మెడికల్ సెంటర్‌లో ఆగస్టు 5న మరణించారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలో ఉన్న లొరైన్‌లో 1931, ఫిబ్రవరి 18న ఆమె జన్మించారు. బిలవ్డ్ నవలతో ఆమె గుర్తింపు పొందారు.

సుష్మాస్వరాజ్ మృతి

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ ఆగస్టు 6న గుండెపోటుతో ఢిల్లీలో మరణించారు. ఆమె స్వస్థలం హర్యానాలోని అంబాలా. 1952, ఫిబ్రవరి 14న జన్మించిన సుష్మా 1977లో తొలిసారిగా అంబాలా ఎమ్మెల్యేగా గెలిచి ఆ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో అత్యంత పిన్నవయస్సులో కేబినెట్ మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఆమె. ఏడు సార్లు ఎంపీగా, మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 2009 నుంచి 2014 వరకు 15వ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు నిర్వహించారు. 2014 నుంచి 2019 వరకు విదేశాంగ మంత్రిగా పనిచేశారు.

భారత రత్నాలు

2019 భారతరత్న అవార్డులను రాష్ట్రపతి భవన్‌లో ఆగస్టు 8న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు. భారతదేశ ఉత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న అవార్డును 2019 ముగ్గురికి ప్రకటించిన విషయం తెలిసిందే. మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, అస్సామీ గాయకుడు, సంగీత, సినీ దర్శకుడు భూపేన్ హజారికా (మరణానంతరం), ఆరెస్సెస్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్ (మరణానంతరం)లకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. ఐదు దశాబ్దాలపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన ప్రణబ్‌ముఖర్జీ 2012- 17 మధ్యకాలంలో దేశానికి 13వ రాష్ట్రపతిగా సేవలందరించారు. అంతకుముందు ఆయన కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వంలో 2009 నుంచి 2012 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా సేవలందించారు.

ఈశాన్య రాష్ర్టాల జానపద సంగీతం, పాటలకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చినవారు భూపేన్ కుమార్ హజారికా. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హజారికా హిందీ సినిమాల్లోకి ఈశాన్య ప్రాంత జానపద సంగీతాన్ని ప్రవేశపెట్టిన ఘనత దక్కించుకున్నాడు. 2011లో మరణించిన ఆయనను తన అభిమానులు ముద్దుగా సుధాకాంత (కోకిల) అని పిలుచుకుంటారు.

సంఘ్‌పరివార్ నాయకుడైన నానాజీ దేశ్‌ముఖ్ ఉత్తరప్రదేశ్‌లో ఆ సంస్థ విస్తరించటానికి ఎనలేని సేవలు చేశారు. మొదటి సరస్వతి శిశు మందిర్‌ను యూపీలోని గోరఖ్‌పూర్‌లో 1950లో ప్రారంభించింది ఆయనే. హజారికా, నానాజీలకు మరణానంతరం భారతరత్న ఇచ్చారు.
Persons1

66వ జాతీయ చలనచిత్ర అవార్డులు

66వ జాతీయ చలనచిత్ర అవార్డులను ఆగస్టు 9న ప్రకటించారు. రాహుల్ రవైల్ నేతృత్వంలోని అవార్డుల కమిటీ పలు విభాగాల్లో అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాది 31 విభాగాల్లో 419 సినిమాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి. ఏడాది కొత్తగా మోస్ట్ ఫిలిం ఫ్రెండ్లీ స్టేట్ అనే విభాగాన్ని ప్రవేశపెట్టారు. ఈ విభాగంలో తొలి అవార్డును ఉత్తరాఖండ్ గెలుచుకొంది.

- ఉత్తమ ఫీచర్ ఫిలిం- హెల్లారో (గుజరాతీ)
- ఉత్తమ నాన్ ఫీచర్ ఫిలిం- సన్ రైజ్, ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఫ్రాగ్స్
- ఉత్తమ నటుడు- ఆయుష్మాన్ ఖురానా
- (అంధాదున్), విక్కీ కౌషల్ (ఉరి)
- ఉత్తమ నటి- కీర్తీ సురేష్ (మహానటి- తెలుగు)
- ఉత్తమ సహాయ నటి- సురేఖ సిక్రి (బధాయి హో)
- ఉత్తమ సహాయ నటుడు- స్వనంద్ కిర్‌కిరే
- (చుంబక్ - మరాఠీ)
- ఉత్తమ దర్శకుడు - అదిత్య ధర్ (ఉరి)
- ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- బధాయి హో
- సామాజిక ఇతివృత్తంపై ఉత్తమ చిత్రం-
- ప్యాడ్‌మ్యాన్
- ఉత్తమ పర్యావరణ పరిరక్షణ ఇతివృత్త చిత్రం-
- పాని (మరాఠీ)
- ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం - ఒందల్ల ఎరదల్ల (కన్నడ)
- ఉత్తమ విజ్ఞానాత్మక చిత్రం - సరళ విరళ
- ఉత్తమ సినిమాటోగ్రఫీ - ఎంజే రాధాక్రిష్ణన్ (ఓలు- మలయాళం)
- ఉత్తమ బాలల చిత్రం - సర్కారీ హిరియ ప్రాథమిక శాలే కాసరగోడు (కన్నడ)
- ఉత్తమ బాల నటులు - పీవీ రోహిత్ (కన్నడ), సమీప్ సింగ్ (పంజాబీ), తల్హా అర్షద్ రేషి (ఉర్దు), శ్రీనివాస్ పోకలే (మరాఠీ)
- ఉత్తమ నూతన దర్శకుడి చిత్రం- నాల్ (మరాఠీ)
- ఉత్తమ కొరియోగ్రఫీ - ఘూమర్ (ప్యాడ్‌మ్యాన్)
- ఉత్తమ ఎడిటింగ్- నాతిచరామి (కన్నడ)
- బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ - కేజీఎఫ్ (కన్నడ)
- స్పెషల్ జ్యూరీ అవార్డు - శృతి హరిహరన్,
- జోజు జార్జ్, సావిత్రి, చంద్రచూడ్ రాయ్

ఉత్తమ ప్రాంతీయ చిత్రాలు

- ఉత్తమ తెలుగు చిత్రం- మహానటి
- ఉత్తమ రాజస్థానీ చిత్రం - టర్టిల్
- ఉత్తమ తమిళ చిత్రం - బారమ్
- ఉత్తమ మరాఠీ చిత్రం - భొంగ
- ఉత్తమ హిందీ చిత్రం - అంధాదున్
- ఉత్తమ ఉర్దు చిత్రం - హమీద్
- ఉత్తమ అస్సామీ చిత్రం - బుల్‌బుల్‌కన్ సింగ్
- ఉత్తమ పంజాబీ చిత్రం- హర్జీతా

సంగీతం

- ఉత్తమ గీతం - నాతిచరామి (కన్నడ)
- ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు)- సంజయ్‌లీలా భన్సాలీ (పద్మావత్)
- ఉత్తమ సంగీత దర్శకత్వం (బ్యాగ్రౌండ్ స్కోర్)- ఉరి
- బెస్ట్ సౌండ్ డిజైన్- ఉరి
- ఉత్తమ గాయని- బింధు మాలిని
- (మాయవి మానవే- నాతిచరామి- కన్నడ)
- ఉత్తమ నేపథ్య గాయకుడు- అరిజిత్‌సింగ్
- (బింటే దిల్ -పద్మావత్)

నిర్మాణం

- ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్- అ! (తెలుగు)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్- కుమార సంభవం
- (మలయాళం)
- బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - చి.ల.సౌ (తెలుగు)
- బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - అంధాదున్
- ఉత్తమ మాటలు - తారిఖ్

625
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles