గేట్ ప్రిపరేషన్ ఇలా చేయండి..


Wed,August 21, 2019 12:42 AM

ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంవారికి గేట్ ఎగ్జామ్‌లో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌కి వెయిటేజీ ఎక్కువ. గేట్‌లోనే కాకుండా ఇతర పోటీ పరీక్షల్లో కూడా మ్యాథమెటిక్స్ చాలా అవసరం. ప్రతి విద్యార్థి తప్పనిసరి నేర్చుకోవాల్సిన సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్ ఒకటి. దీనిపై పట్టు సాధిస్తేనే ఎంపికచేసుకున్న బ్రాంచి సబ్జెక్టులను సులభంగా అర్థం చేసుకోవచ్చు. ప్రతి సబ్జెక్టులో మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ చాలా ఉపయోగపడుతాయి. కాబట్టి మ్యాథ్స్‌ని ప్రాక్టీస్ చేస్తే బ్రాంచి సబ్జెక్టులు కూడా ఈజీగా పూర్తిచేయవచ్చు. గేట్ ఎగ్జామ్‌లో 10-15 మార్కులు వస్తాయి.
-ముఖ్యమైన అంశాలు: లీనియర్ ఆల్జీబ్రా, క్యాలిక్యులస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, క్యాలిక్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ ఫంక్షన్స్, FT, LT, ZT, న్యూమరికల్ మెథడ్స్
-పుస్తకాలు: హయ్యర్ ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్- Dr. BS Grewal

జనరల్ ఆప్టిట్యూడ్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం వారికి గేట్‌లో జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి 15 మార్కులు వస్తాయి. ఈ సబ్జెక్టును క్షుణ్ణంగా అధ్యయనం చేయడంవల్ల గేట్‌తోపాటు ఇతర పోటీ పరీక్షల్లో కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకోవచ్చు. ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నేర్చుకోవడంవల్ల లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఆప్టిట్యూడ్‌ని ఒక ఎగ్జామ్‌లో మార్కుల కోసం చదవడానికి కాకుండా తనకే చాలా ఉపయోగపడుతాయని భావించాలి. కాబట్టి ఆప్టిట్యూడ్ ఎంత నేర్చుకుంటే అన్ని మార్కులు సులభంగా సాధించవచ్చు.
-పుస్తకాలు : క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- ఆర్‌ఎస్ అగర్వాల్
-వెర్బల్ అండ్ నాన్‌వెర్బల్ రీజనింగ్- ఆర్‌ఎస్ అగర్వాల్
Destinations

ముఖ్యమైన అంశాలు

-బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్‌మెంట్, ప్రాఫిట్ అండ్ షేర్, ఏజ్ అండ్ నంబర్స్, పై చార్ట్, బార్‌గ్రాఫ్ ప్రాబ్లమ్స్

నెట్‌వర్క్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ముఖ్యమైన సబ్జెక్టుల్లో నెట్‌వర్క్స్ ఒకటి. గేట్‌లో ఈ సబ్జెక్టు నుంచి 8-12 మార్కులు వస్తాయి. ఇందులో ఉండే అంశాలను సరిగా అర్థం చేసుకుని, ప్రాబ్లమ్స్‌ను ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే సులభంగా మార్కులు సాధించవచ్చు. మెషిన్స్, పవర్ సిస్టమ్స్ నేర్చుకోవాలంటే ముందుగా నెట్‌వర్క్స్ సబ్జెక్టు కాన్సెప్ట్స్ అన్నీ అర్థం చేసుకుని ఉండాలి.
-గేట్‌తోపాటు ఈఎస్‌ఈ, ఇస్రో, బార్క్, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ వంటి పోటీపరీక్షల్లో ఈ సబ్జెక్టు నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి.

సిలబస్

-బేసిక్ కాన్సెప్ట్స్- నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, సోర్స్ ట్రాన్స్‌ఫర్మేషన్స్
-నెట్‌వర్క్ థీరమ్స్- సూపర్ పొజిషన్, థెవినిన్స్, నార్టన్స్, మ్యాగ్జిమమ్ పవర్ ట్రాన్స్‌ఫర్, రెసిప్రోసిటీ
-ట్రాన్సియంట్ అండ్ స్టడీ స్టేట్ అనాలిసిస్
-Two port network

పుస్తకాలు

-ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్- చార్లెస్ కే అలెగ్జాండర్, మాథ్యూ ఎన్‌ఓ సాడికు
-సర్క్యూట్ థియరీ అనాలిసిస్ & సింథసిస్- ఏ చక్రబర్తి
-ఇంజినీరింగ్ సర్క్యూట్ అనాలిసిస్- విలియం హెచ్ హైత్

అనలాగ్ ఎలక్ట్రానిక్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లోని ముఖ్యమైన సబ్జెక్టుల్లో ఇది ఒకటి. ఇందులో నుంచి సుమారు 10 మార్కులు వచ్చే అవకాశం ఉంది. చాలామంది అనలాగ్ ఎలక్ట్రానిక్స్ తమ ప్రధానమైన సబ్జెక్ట్ కాదని అశ్రద్ధ చేయకూడదు. కానీ పోటీ పరీక్షల్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వారికి ఈ సబ్జెక్టు నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి సిలబస్‌పై అవగాహన పెంచుకుని క్షుణ్ణంగా చదివితే ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది. అయితే అనలాగ్ ఎలక్ట్రానిక్స్ కంటేముందు EDC చదివితే సులభమవుతుంది.

ప్రధాన అంశాలు

-డియోడ్, ట్రాన్సిస్టర్, ఎఫ్‌ఈటీ, మాస్ ఎఫ్‌ఈటీ, జెనర్ డియోడ్, ఆంప్లిఫయర్స్, ఆస్కిలేటర్స్, ఓపీ-ఆంప్లిఫయర్స్ సర్క్యూట్స్, 555 టైమర్స్

రిఫరెన్స్ బుక్స్

-మైక్రో ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్- Sedra/Smith
-ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్ థియరీ- Robert L Boylestad

డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో ప్రాసెసెస్

0ఇది ఎక్కువ మార్కులు స్కోర్ చేసుకునే అవకాశం ఉన్న సబ్జెక్టు. దీన్ని సులభంగా అర్థం చేసుకోవచ్చు. గేట్ పరీక్షలో ఈ సబ్జెక్టు నుంచి సుమారు 10 మార్కులకు ప్రశ్నలు వస్తాయి.

ముఖ్యమైన అంశాలు

-Boolean algebra and logic gates
-Ccombinational logic circuits
-Seauential logic circuits- Slipslops, Counters, Shist registers
-ADC & DAC computers
-8085 Micro procersors

పుస్తకాలు

-డిజిటల్ ఫండమెంటల్స్- Thomas L. Floyd
-డిజిటల్ డిజైన్- M.Morris mano

ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఫీల్డ్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ వారికి ఈ సబ్జెక్టు చాలా ముఖ్యమైనది. అయితే ఇది చాలా కష్టమైన సబ్జెక్టు అని ఎక్కువమంది దీనికి సమయం కేటాయించడంలేదు. కానీ ఈ సబ్జెక్టును అవగాహన చేసుకుంటే సులభంగా మార్కులు సంపాదించుకోవచ్చు. గేట్, ఈఎస్‌ఈ గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేసుకోవచ్చు. ఈ సబ్జెక్టులోని ప్రాథమిక (బేసిక్స్) అంశాలను అర్థం చేసుకుంటేనే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ప్రధాన సబ్జెక్టులైన మెషిన్స్, పవర్ సిస్టమ్స్‌ను త్వరగా పూర్తి చేయవచ్చు.
-గేట్ ఎగ్జామ్‌లో ఈ సబ్జెక్టులో 8 నుంచి 10 మార్కులు వస్తాయి.

సిలబస్‌లో ముఖ్యమైన అంశాలు

-ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్ బేసిక్స్, స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్, స్టాటిక్ మ్యాగ్నటిక్ ఫీల్డ్స్, టైప్స్ ఆఫ్ మెటీరియల్స్

చదవాల్సిన పుస్తకాలు

-ఎలిమెంట్స్ ఆఫ్ ఎలక్ట్రోమ్యాగ్నటిక్స్- Mathew N O Sadiku
-ఇంజినీరింగ్ ఎలక్ట్రోమ్నాగ్నటిక్స్- William H Hayt, JP

సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్

-ఇందులోని అంశాలను అర్థం చేసుకుంటే ఈజీగా స్కోర్ పెంచుకోవచ్చు. కాబట్టి విద్యార్థి కాన్సెప్ట్‌ని అర్థం చేసుకుని బాగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్షలో ఈ సబ్జెక్టు నుంచి సుమారు 10 మార్కులు వస్తాయి.

సిలబస్‌లో ముఖ్యమైనవి..

-ఎల్‌టీజే సిస్టమ్స్, Fourier series, Fourier Transform, Laplace transform, Z-Transform, DFT, FFT

పుస్తకాలు

-సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్- Alan V Oppenheim
-డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్- Sanjit K mitra
-సిగ్నల్స్ అండ్ సిస్టమ్స్- Simon Haykin

మెషిన్స్

-ట్రాన్స్‌ఫార్మర్స్: మెషిన్ పవర్ సిస్టమ్స్‌లో దీనిది ముఖ్యమైనపాత్ర. ఇది స్టాటిస్టిక్ మెషిన్ కన్‌స్ట్రక్షన్ ప్రిన్సిపుల్, పర్ఫార్మర్స్ నుంచి, 3 & ట్రాన్స్‌ఫార్మర్, ఆటో ట్రాన్స్‌ఫా ర్మర్, నుంచి ప్రశ్నలు వస్తాయి. ట్రాన్స్‌ఫార్మర్‌లో Hormorics అర్థం చేసుకోవడం అవసరం.
2) ఇండక్షన్ మెషిన్స్: 3& ఇండక్షన్ మోటార్ నుంచి ప్రశ్నలుంటాయి. ఇది ట్రాన్స్‌ఫార్మర్ సూత్రంపై పనిచేసే స్పీడ్ పవర్ అండ్ Torque Equations, రొటేటింగ్ మెషిన్‌పై అవగాహన పెంచుకోవాలి. తద్వారా speed control solve చేయవచ్చు. పవర్ ఎలక్ట్రానిక్స్, స్పీడ్ కంట్రోల్ రెండింటికి సంబంధించిన ప్రశ్నలు వస్తాయి.

సింక్రనస్ మెషిన్స్

-జనరేటింగ్ స్టేషన్‌లో ఈ మెషిన్ అతిముఖ్యమైనది. దీనిలో ప్రిన్సిపుల్ అండ్ ఫర్ఫామెన్స్ పైన ప్రశ్న ఉంటుంది. సింక్రనస్ మెషిన్, పవర్ సిస్టమ్‌తో అనుసంధానించి ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి.

డీసీ మెషిన్

-దీనిలో జనరేటర్, మోటార్ రెండు ఉంటాయి. DC మోటార్స్ పైన ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. DC మోటార్స్ స్పీడ్ కంట్రోల్ పై ప్రశ్నలుంటాయి.

రిఫరెన్స్ పుస్తకాలు

-ఎలక్ట్రికల్ మెషిన్స్- D.P.Kothri, I.J.Nagrath
-ఎలక్ట్రికల్ మెషిన్స్- P.S. Bhimbra
-ఎలక్ట్రికల్ మెషిన్స్- M.G Say

పవర్ సిస్టమ్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో అత్యంత ముఖ్యమైన సబ్జెక్టుల్లో పవర్‌సిస్టమ్ ఒకటి. ఇందులో నుంచి గేట్, ఈఈఈ పరీక్షల్లో సుమారు 12 మార్కులు వస్తాయి. కాబట్టి విద్యార్థులు సరైన ప్రణాళికతో, సిలబస్‌పై అవగాహన పెంచుకొని, అంశాలను ఆకళింపు చేసుకొని సాధన చేస్తే సులువుగా మార్కులు సాధించవచ్చు.

సిలబస్‌లో ముఖ్యమైన అంశాలు

-జనరేషన్, ట్రాన్స్‌మిషన్ & డిస్ట్రిబ్యూషన్, పవర్‌సిస్టమ్ అనాలసిస్- పవర్ ఫ్లో స్టడీస్, ఫాల్ట్ అనాలసిస్, స్టెబిలిటీ, ఎకనమిక్ లోడ్ డిస్పాచ్

రిఫరెన్స్ బుక్స్

1. పవర్ సిస్టమ్స్- సీఎల్ వాద్వా
2. పవర్ సిస్టమ్స్- జేబీ గుప్తా
3. పవర్స్ సిస్టమ్స్ అనాలసిస్- నగ్రత్ కొఠారి
4. పవర్ సిస్టమ్స్- సోని, గుప్తా, భట్నాగర్

కంట్రోల్ సిస్టమ్స్

-ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో ముఖ్యమైన సబ్జెక్టుల్లో ఇది ఒకటి. ఈ సబ్జెక్టు నుంచి గేట్‌తోపాటు, ఈఎస్‌ఈ, ఇస్రో, జెన్‌కో, ట్రాన్స్‌కో, ఎన్‌పీడీసీఎల్, ఎస్‌పీడీసీఎల్ వంటి పోటీపరీక్షల్లో ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల సబ్జెక్టును అర్థంచేసుకుని ప్రాబ్లమ్స్‌ను ప్రాక్టీస్ చేస్తే సులభంగా మార్కులు సాధించవచ్చు. అయితే సబ్జెక్ట్ నాలెడ్జ్‌తోపాటు మ్యాథమెటిక్స్ పరిజ్ఞానం అవసరం.
-గేట్‌లో ఈ సబ్జెక్టు నుంచి 8-12 మార్కులు వస్తాయి.

సిలబస్‌లోని ముఖ్యమైన అంశాలు

-బేసిక్స్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్- టైప్స్ ఆఫ్ ఫీడ్‌బ్యాక్, ఫీడ్‌బ్యాక్ ఎఫెక్ట్స్, సిగ్నల్ ఫ్లోగ్రాఫ్స్, రిడక్షన్ ఆఫ్ మల్టిపుల్ సబ్‌సిస్టమ్స్
-టైమ్ రెస్పాన్స్ అనాలిసిస్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అనాలిసిస్, స్టెబిలిటీ- ఆర్‌హెచ్ క్రైటేరియా, పోలార్ ప్లాట్, బోడ్ ప్లాట్, స్టేట్ స్పేస్ అనాలిసిస్

రిఫరెన్స్ బుక్స్

-కంట్రోల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్- Norman S Nise
-మోడ్రన్ కంట్రోల్ ఇంజినీరింగ్- Katsuhiko ogata
-కంట్రోల్ సిస్టమ్స్ ఇంజినీరింగ్- IJ Nagrath, M Gopal

పవర్ ఎలక్ట్రానిక్స్

-ఈఈఈ, గేట్ పరీక్షలో ఈ సబ్జెక్టు నుంచి 10 మార్కులు వస్తాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ డివైస్, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ బేసిక్ పైన అవగాహన పెంచుకోవడం అవసరం.

పుస్తకాలు

-పవర్ ఎలక్ట్రానిక్స్- P.S. Bhimtra

ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్

-ఈ సబ్జెక్టు నుంచి 5 మార్కులు ఉంటాయి. ఎక్కువగా కన్‌స్ట్రక్షన్, ప్రిన్సిపుల్స్, వర్కింగ్ అండ్ అప్లికేషన్స్ పైన ప్రశ్నలుంటాయి. ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎమర్జెన్సీ కన్వర్షన్ పైన అవగాహన పెంచకోవడంవల్ల మెజర్‌మెంట్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ పైన ప్రశ్నలు Solve చేయవచ్చు.

చదవాల్సిన పుస్తకాలు

-ఇన్‌స్ట్రుమెంట్స్ అండ్ మెజర్‌మెంట్స్- AK satiwarney and Sawhany
-Golding, EW, electrical measurrments and measuring insruments

355
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles