సీఏ విజేతలు.. విజయ రహస్యాలు


Wed,August 21, 2019 03:51 AM

ఏదైనా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఆ దిశగా అవరోధాలు ఏర్పడితే నిరాశ, నిస్పృహలతో వెనుకడుగు వేస్తారు. దీంతో లక్ష్యసాధనలో విజయం సాధించలేరు. కాబట్టి లక్ష్యం సాధించాలనుకున్నప్పుడు వెనుకడుగు వేయకుండా ముందుకు సాగితే విజయం వరిస్తుంది. దృఢ సంకల్పమే లక్ష్యానికి మార్గం సుగమం చేస్తుందని నిరూపించారు ఇటీవల వెలువడిన సీఏ ఫలితాల్లో ఆలిండియా ర్యాంకులు సాధించిన విద్యార్థులు. వారు విజయం సాధించడానికి దోహదపడిన అంశాలు వారి మాటల్లో చూద్దాం..

విజయం శాశ్వతం

-హాయ్ నా పేరు తరుణ్‌కుమార్. నాన్న కిశోర్ ప్రైవేట్ ఉద్యోగి. అమ్మ ఝాన్సీరాణి గృహిణి. హైదరాబాద్‌లోనే ఉంటున్నాం. నాకు పదో తరగతిలో 570 మార్కులు వచ్చాయి. ఇంటర్ ఎంఈసీలో 968 మార్కులు సాధించాను. నేను పదో తరగతి చదువుతున్నప్పటి నుంచే మా నాన్న సీఏ చదవమని ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహంతోనే మాస్టర్‌మైండ్స్‌లో సీఏలో చేరాను.
-అంతేకాకుండా సీఏలకు సమాజంలో ఉన్న గౌరవం, ఉపాధి అవకాశాలు కూడా బాగుండటంతో ఈవైపు అడుగువేశాను. సీఏ చదివేటప్పుడు ఆందోళనకు దూరంగా ఉండి, పరీక్ష ఫలితాల గురించి ఒత్తిడికి గురయ్యేవాడిని కాదు. పరీక్షలకు ముందునుంచే ప్రణాళికతో హార్డ్‌వర్క్ చేసేవాడిని.
-మాస్టర్‌మైండ్స్ వారు నిర్వహించే సీఏ ఫైనల్ రివిజన్ ఎగ్జామ్స్‌ను తప్పనిసరిగా రాసేవాడిని. ఈ రివిజన్ ఎగ్జామ్స్‌లో మార్కులు బాగా వచ్చేవి. దీంతో నాపై నాకు నమ్మకం పెరిగింది. ఆ నమ్మకంతో కష్టపడి చదివి ఈ పరీక్షలో సీఏ ఫైనల్‌లో ఆలిండియా 12వ ర్యాంకు సాధించాను.
-మనం చదివింది ఎక్కడికీ పోదు మనకు గుర్తుంటుందని నమ్మాలి. మనం విజయం సాధిస్తే మనకే కాదు మన అమ్మానాన్నల కష్టానికి కూడా ప్రతిఫలం లభిస్తుందని భావించాలి. సీఏ చదివేటప్పుడు మిగతా కోర్సుల విద్యార్థుల మాదిరిగా రకరకాల సౌకర్యాలు, సెలవులను చూసి మనం వాళ్లలాగా ఎంజాయ్ చయలేకపోతున్నామని బాధపడకూడదు. వారి ఎంజాయ్ తాత్కాలికం, మనం కష్టపడి సాధించిన విజయం శాశ్వతం అని గుర్తుంచుకోవాలి.
-సీఏ చదవాలనుకునేవారికి సీఏపై అవగాహన ఏర్పర్చుకోవాలి. పట్టుదల, సరైన ప్రణాళికలతో కష్టపడి చదివితే సీఏ ఉత్తీర్ణత సాధించవచ్చు. కాన్సెప్టులపై అవగాహన ఏర్పర్చుకుని చదవాలి. చదివినవాటిని పదే పదే రివిజన్ చేసుకోవాలి.
Audit

-పరీక్షలకు మందు సాధ్యమైనంత ఎక్కువ సిలబస్‌ను రివైజ్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక అటెంప్ట్ ఫెయిల్ అయినా నిరాశకు గురికాకుండా మరింత పట్టుదలతో చదివితే విజయం సాధించవచ్చు.

- చారుగండ్ల తరుణ్ కుమార్, సీఏ ఫైనల్ ఆలిండియా 12వ ర్యాంకు

నాన్న ప్రేరణతోనే..

-నేను సీఏలో చేరడానికి ప్రేరణ మా నాన్న సురేంద్రరెడ్డి. హైదరాబాద్‌లో చార్టర్డ్ అకౌంటెంట్‌గా స్థిరపడ్డారు. అమ్మ సంధ్య గృహిణి. సీఏ చదివితే మంచి ఉద్యోగంతోపాటు సమాజంలో హోదా, తగిన గుర్తింపు ఉంటాయని మా నాన్నను చూశాకే అర్థమయ్యింది.
-పదో తరగతిలో 9.8 గ్రేడ్ పాయింట్లు సాధించాను. ఇంటర్ ఎంఈసీ 956 మార్కులతో పాసయ్యాను. తర్వాత సీఏలో సీఏ-సీపీటీలో 147, సీఏ-ఐపీసీసీలో 436 మార్కులు సాధించాను. సీఏ ఫైనల్‌లో 558 మార్కులతో ఆలిండియా 10వ ర్యాంకులో నిలిచాను. నా ఈ విజయానికి మాస్టర్‌మైండ్స్‌లో చేరడమే కారణం.
-సీపీటీ పూర్తయ్యాక నామీద నాకు నమ్మకం కలిగింది. దీంతో సీఏ-ఐపీసీసీని మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేశాను. సీఏ ఫైనల్ కూడా మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయడంలో, అఖిల భారత స్థాయిలో 10వ ర్యాంకు సాధించడంలో అమ్మానాన్నల ప్రోత్సాహం చాలా ఉంది.
-సీఏలో చేరిన మొదటిరోజు నుంచే లక్ష్యం దిశగా అడుగులు వేశాను. ఆ లక్ష్యంతో అందరూ కష్టమనుకునే సీఏని ఎంతో ఇష్టంతో చదివాను. మాస్టర్‌మైండ్స్‌వారు అందించే మెటీరియల్‌తోపాటు స్టడీ అవర్స్, రివిజన్ ఎగ్జామ్స్ చాలా తోడ్పడ్డాయి.
-ఏదైనా మొదటి ప్రయత్నంలోనే సాధించాలి. రెండో ప్రయత్నమనే మాటే రావద్దని నిర్ణయించుకునేవాడిని. ఆ నిర్ణయంతోనే సీఏలోని అన్ని దశలు మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేశాను. ఇందుకు ప్రణాళికాబద్ధంగా చదివాను. ఎక్కువ సమయం చదివిన అంశాలను రివిజన్ చేసుకునేవాడిని.
-కృతనిశ్చయంతో, ఏకాగ్రతతో చదివితే సీఏలోని అన్ని దశలను మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయవచ్చు. సీఏ చేయాలనుకునే ప్రతిఒక్కరూ ప్రజెంటేషన్ స్కిల్స్, హార్డ్‌వర్క్‌ను అలవర్చుకోవాలి.
-అన్ని పేపర్లకు సమప్రాధాన్యమిస్తూ ప్రతి సబ్జెక్టులోని అన్ని చాప్టర్లలో ఉన్న ప్రశ్నలను క్షణ్ణంగా చదవాలి. ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) మెటీరియల్‌తో పాటు సీఏ చదివే ఇన్‌స్టిట్యూట్‌వారు ఇచ్చే స్టడీ మెటీరియల్, రివిజన్ టెస్ట్ పేపర్స్, మాక్ టెస్ట్ పేపర్స్ చదివితే తప్పకుండా విజయం సాధించవచ్చు.

- చల్లా సత్యసాయి సుజిత్ రెడ్డి, సీఏ ఫైనల్ ఆలిండియా 10వ ర్యాంకు


సీఏతో లైఫ్ సెటిల్

-నా పేరు శ్రావణ్ రెడ్డి. మాది నిజామాబాద్. నాన్న లచ్చిరెడ్డి సాధారణ రైతు. అమ్మ వసంత గృహిణి. పదో తరగతిలో 9.2 గ్రేడ్ పాయింట్లు వచ్చాయి. ఇంటర్ ఎంఈసీలో 963 మార్కులు సాధించాను. సీఏ చదివితే లైఫ్ త్వరగా సెటిలవుతుందని, అత్యధిక వేతనంతో ఉద్యోగం లభిస్తుందని నాన్నకు తెలిసినవారు చెప్పారు. దీంతో నాన్న ప్రోత్సాహంతో పదో తరగతిలోనే సీఏ చదవాలనకున్నాను.
-సీఏ-సీపీటీలో 149, సీఏ-ఐపీసీసీలో 401 మార్కులు సాధించాను. సీఏ ఫైనల్‌లో 38వ ర్యాంకు పొందాను. సీఏ ఫైనల్‌కు ప్రిపేరయ్యేటప్పుడు మాస్టర్‌మైండ్స్‌వారు నిర్వహించే స్టడీఅవర్స్‌కు తప్పనిసరిగా అటెండ్ అయ్యేవాడిని. రివిజన్ ఎగ్జామ్స్ రాసేవాడిని.
-ప్రతి సబ్జెక్టను ప్రణాళిక ప్రకారం రివైజ్ చేసుకుంటూ చదివేవాడిని. ఒకవేళ ఏదైనా సబ్జెక్టు బ్యాక్‌లాగ్ ఉన్నా వాటిని వదిలేయకుండా చివర్లో కంప్లీట్ చేసేవాడిని. తక్కువ సహాయం ప్రిపేరయినా పూర్తి ఏకాగ్రతతో, ఓపికతో చదివాను. ఎప్పటికప్పుడు మనల్ని మనమే స్వీయప్రేరణ చేసుకోవాలి.
-నిబద్ధతగా చదివేవాడిని. పరీక్ష ఫలితాల గురించి ఆలోచించేవాడినికాదు. ఎందుకంటే హర్డ్‌వర్క్ చేస్తే ఫలితం అనేది మనకు ఫేవర్‌గానే వస్తుందని నమ్ముతాను కాబట్టి. ఇంకో విషయం ఒకరితో మనం ఎప్పుడు పోల్చుకోకూడదు. మనమీద మనకు నమ్మకం ఉంటే ఎంతటి సమస్య అయినా దానటంతదే తొలగిపోతుంది.
-సీఏ కోర్సు చేయాలనుకునేవారికి మంచి ప్రణాళిక అవసరం. తద్వారా కోర్సు చాలా ఈజీ అవుతుంది. చాలా మంది విద్యార్థులు తమకు పదో తరగతి, ఇంటర్‌లో ఎక్కువ మార్కులు వచ్చాయనో, లేదా తెలిసినవారు ఫలానా కోర్సు చేశారని తామూ ఆయా కోర్సులను ఎంపికచేసుకుని సర్టిఫికెట్ సాధిస్తున్నారు. కానీ జీవితంలో తొందరగా స్థిరపడలేకపోతున్నారు. కాబట్టి అందరిలా కాకుండా ఎంపికచేసుకునే కోర్సుతో మనం లైఫ్‌లో సెటిల్ అయ్యేలా ఉండాలనే విజన్‌తో ఉన్నత చదువులను ఎంచుకోవాలి.
- జిన్నా శ్రావణ్ రెడ్డి, సీఏ ఫైనల్ ఆలిండియా 38వ ర్యాంకు

374
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles