ఓన్‌జీసీలో 1000 స్కాలర్‌షిప్‌లు


Mon,August 26, 2019 01:39 AM

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ (ఓఎన్‌జీసీ) దేశవ్యాప్తంగా 1000 మంది స్కాలర్‌షిప్స్‌ పొందడానికి బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ ఉన్నత విద్యలు చదువుతున్న ప్రతిభావంతులైన ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
STUDENTSs
-అర్హత: ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ చదివే అభ్యర్థులు ఇంటర్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంబీఏ/మాస్టర్‌ డిగ్రీ చదివే అభ్యర్థులు డిగ్రీ స్థాయిలో 60 శాతం మార్కులతో లేదా సమానమైన గ్రేడ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
-వయస్సు: 2019 అక్టోబర్‌ 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-స్కాలర్‌ షిప్‌ విలువ: ఎంపికైన ప్రతి అభ్యర్థికి ఏడాదికి ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.48,000/- అంటే ప్రతి నెలకు రూ.4000/- చొప్పున కోర్సు పూర్తయ్యేవరకు స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు.
-తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.4.50 లక్షలు దాటరాదు.
-50 శాతం స్కాలర్‌షిప్స్‌ బాలికలకు కేటాయించారు.
నోట్‌: డిగ్రీ లేదా పీజీ మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులు కావాలి. ఒకవేళ ఫెయిలైతే తర్వాత ఏడాదికి స్కాలర్‌షిప్‌ ఆపివేస్తారు.
-దేశ వ్యాప్తంగా ఐదు జోన్లలోని ప్రతి జోన్‌కు 200 స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు. సౌత్‌ జోన్‌ పరిధిలోని ప్రాంతాలు- తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, పుదుచ్చేరి, లక్షదీవులు, అండమాన్‌ నికోబార్‌ దీవులు
-కుటుంబంలోని ఒక్కరికి మాత్రమే స్కాలర్‌షిప్‌ వర్తిస్తుంది.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
-చివరితేదీ: అక్టోబర్‌ 15
-వెబ్‌సైట్‌:www.ongcindia.com

582
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles