ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్స్


Wed,September 4, 2019 01:28 AM

భారత సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ 2019-20 సంవత్సరానికి నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్ ద్వారా ఎస్సీ అభ్యర్థుల విదేశీ విద్య కోసం ఇచ్చే ఉపకారవేతనాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
Study-Visa
-స్కాలర్‌షిప్ పేరు: సెంటర్ సెక్టార్ స్కీం ఆఫ్ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్‌షిప్
-ఎవరికి: ఎస్సీ విద్యార్థులకు
-మొత్తం స్కాలర్‌షిప్‌లు : 100
-విభాగాలవారీగా స్కాలర్‌షిప్స్: ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్-32, ప్యూర్ సైన్సెస్& అప్లయిడ్ సైన్సెస్-17, అగ్రికల్చరల్ సైన్సెస్ అండ్ మెడిసిన్-17, ఇంటర్నేషనల్ కామర్స్, అకౌంటింగ్&ఫైనాన్స్-17, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్స్-17.
-అర్హత : సంబంధిత విభాగాల్లో డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ.
-ఆదాయం: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 6 లక్షలకు మించరాదు.
-వయో పరిమితి: 2019, ఏప్రిల్ 1నాటికి 35 ఏండ్లు మించరాదు.
-పీహెచ్‌డీ చేసేవారికి నాలుగేండ్లు, మాస్టర్స్ డిగ్రీకి మూడేండ్లు స్కాలర్‌షిప్ కింద ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు.
-ఈ పథకం కింద యూకే మినహా అమెరికా, ఇతర దేశాల్లో చదువుకునేవారికి పథకం పరిధిలోకి వచ్చే అన్ని స్థాయిల కోర్సులకు 15,400 US డాలర్లు వార్షిక నిర్వహణ భత్యం ఇస్తారు.
-యూకేలో చదువుకునేవారికి 9,900 గ్రేట్ బ్రిటన్ పౌండ్లు వార్షిక నిర్వహణ భత్యం ఇస్తారు. పైన పేర్కొన్న వాటితోపాటు, కంటింజెన్సీ అలవెన్స్, ఇన్సిడెంటల్ జర్నీ అలవెన్స్, పోల్ ట్యాక్స్, వీసా ఫీజు, ఫీజులు, వైద్య బీమా ప్రీమియం, ఎయిర్ పాసేజ్ కూడా ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేది: సెప్టెంబర్ 30
-వెబ్‌సైట్: http://socialjustice.nic.in

785
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles