కోల్గేట్ స్కాలర్‌షిప్స్


Wed,September 4, 2019 01:29 AM

కీప్ ఇండియా స్మైల్ ఫౌండేషనల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్. ప్రతి ఒక్కరికీ చిరునవ్వును చిందించే భవిష్యత్తును పొందే హక్కు ఉంది అనేది దీని నినాదం. ఫౌండేషనల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఏటా రెండు కోట్ల మందికి మంచి జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా స్కాలర్‌షిప్‌తోపాటు అవసరమైనవారికి మెంటార్‌షిప్, కెరియర్ గైడెన్స్ సదుపాయాలనూ అందిస్తారు. విద్యార్థులతో పాటు విద్యాపరంగా ఇతరులకు సాయపడే వారికీ వీటిని అందిస్తున్నారు. ఇంటర్ స్థాయి నుంచి పై చదువుల వారందరికీ ఆర్థిక సాయం అందిస్తోంది. కీప్ ఇండియా స్మైలింగ్ ఫౌండేషనల్ ప్రోగ్రామ్‌ను కోల్గేట్- పామోలివ్ లిమిటెడ్ నిర్వహిస్తుంది.
ou-stuents-in-india

ఇంటర్:

-ఫస్ట్ ఇయర్ ఇంటర్ చదువుతున్నవారికి ఇస్తారు.
-2019లో పదోతరగతి పరీక్షల్లో 75% మార్కులు సాధించి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో చేరి ఉండాలి.
-కుటుంబ వార్షికాదాయం రూ.ఐదు లక్షలు మించరాదు.
-రెండేండ్లపాటు ఇస్తారు. ఏడాదికి రూ. 20,000 చొప్పున చెల్లిస్తారు.

గ్రాడ్యుయేషన్/ డిప్లొమా:

-అర్హతలు: 2019లో ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
-ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో మూడేళ్ల గ్రాడ్యుయేషన్/ డిప్లొమాలో చదువుతున్నవారికి.
-కుటుంబ వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షలు మించకూడదు.
-మూడేండ్లపాటు ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లిస్తారు.

యూజీ/ ఇంజినీరింగ్:

-2019లో ఇంటర్‌లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత.
-ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో చేరి ఉండాలి.
-కుటుంబ వార్షిక ఆదాయం రూ. ఐదు లక్షలు మించరాదు.
-నాలుగేండ్లపాటు ఏడాదికి రూ.30,000 చొప్పున చెల్లిస్తారు.

ఒకేషనల్ కోర్సులు:

-2019లో ఇంటర్‌లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణత.
-ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థలో ఏదేని ఒకేషనల్ కోర్సులో చేరి ఉండాలి.
-కుటుంబ వార్షిక ఆదాయం ఏడాదికి రూ. ఐదు లక్షలు మించరాదు.
-ఏడాదికి రూ.20,000 చెల్లిస్తారు.

స్పోర్ట్స్ పర్సన్స్:

-దేశ/ రాష్ట్ర/ జిల్లా స్థాయిల్లో ఏదో ఒక ఆటలో ప్రాతినిథ్యం వహించి ఉండాలి. అభ్యర్థుల వయసు 28 ఏళ్లకు మించకూడదు.
-జాతీయ స్థాయిలో 500లోపు గానీ, రాష్ట్ర స్థాయిలో 100లోపుగానీ, జిల్లా స్థాయిలో 10లోపుగానీ ర్యాంకు సాధించి ఉండాలి.
-కుటుంబ వార్షిక ఆదాయం రూ.ఐదు లక్షలు మించకూడదు.
-మూడేండ్లపాటు ఏడాదికి రూ.75,000 చొప్పున చెల్లిస్తారు.

ఇతరులకు సాయం అందించేవారికి:

-నిరుపేదలైన పిల్లలకు బోధించడమో, ఆటలకు సంబంధించిన శిక్షణనో ఇస్తున్నవారు అర్హులు.
-ఆర్థికపరంగా వెనుకబడిన లేదా మధ్య తరగతికి చెందినవారై ఉండాలి.
-రెండేండ్లపాటు ఏడాదికి రూ.75,000 చొప్పున చెల్లిస్తారు.

ఎంపిక విధానం

-దరఖాస్తుల నుంచి అర్హులైనవారిని గుర్తించి, సంస్థ ప్రతినిధులు నేరుగా సంప్రదించి వివిధ దశల్లో ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: లేదు.
-జతచేయాల్సిన సర్టిఫికెట్లు: కేటగిరీని బట్టి సంబంధిత సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్ సైజు ఫొటోగ్రాఫ్, ఐడీ ప్రూఫ్, ఆదాయధృవీకరణ పత్రం, మార్కుల షీట్లు, బోనఫైడ్/ అడ్మిషన్ లెటర్ మొదలైనవి.
-చివరితేదీ: 2020. జనవరి 30
-వెబ్‌సైట్: https://www.colgatecares.co.in/keepindiasmiling/get-started.html

1081
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles