ఆర్మీ స్కూల్స్‌లో 8000 టీచర్ పోస్టులు


Wed,September 11, 2019 12:33 AM

Army-School
దేశవ్యాప్తంగా ఉన్న 137 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ (ఏపీఎస్)లలో టీచింగ్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

- ఆర్మీ స్కూల్స్: సైన్యంలో పనిచేసే సైనికుడి దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు వారి పిల్లలకు ఉత్తమ విద్య అందించడం కోసం ఏర్పాటుచేసిన పాఠశాలలే ఆర్మీ పబ్లిక్ స్కూల్స్. ఈ వ్యవస్థ ను 1980, జనవరి 15 ఆర్మీడే నాడు ఆర్మీ ప్రకటించింది. ఈ స్కూల్స్‌ను కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ (ఏడబ్ల్యూఈఎస్)కు అప్పగించింది.
- పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ
- మొత్తం ఖాళీలు: సుమారుగా 8000 కిపైగా (పూర్తిస్థాయి ఖాళీలను తర్వాత ప్రకటిస్తారు)
- రాష్ట్రంలో ఆర్మీస్కూల్స్: సికింద్రాబాద్ (ఆర్‌కే పురం), బొల్లారం, గోల్కొండ,
- అర్హతలు: పీజీటీ-కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పీజీతోపాటు 50 శాతం మార్కులతో బీఈడీ ఉత్తీర్ణత.
- టీజీటీ- కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణత.
- పీఆర్‌టీ- కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీఈడీ/రెండేండ్ల డిప్లొమా ఉత్తీర్ణత.
నోట్: ఆన్‌లైన్ స్క్రీనిగ్ టెస్ట్ రాయడానికి సీటెట్/టెట్ తప్పనిసరి కాదు. టీజీటీ/పీఆర్‌టీ ఉద్యోగాల నియామకానికి టెట్/సీటెట్ తప్పనిసరి. అయితే టెట్ క్వాలిఫై కానివారు ఎంపికైతే వారిని తాత్కాలిక ప్రాతిపదికన తీసుకుని టెట్‌లో అర్హత సాధించిన తర్వాత రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకుంటారు.
- వయస్సు: 2020, ఏప్రిల్ 1 నాటికి ఫ్రెషర్స్‌కు 40 ఏండ్లు, అనుభవం ఉన్నవారికి (గత పదేండ్లలో కనీసం ఐదేండ్లు బోధనలో ఉన్నవారు) 57 ఏండ్ల మించరాదు.
- ఎంపిక విధానం: మూడు దశల్లో నిర్వహిస్తారు.
- స్టేజ్-1లో స్క్రీనింగ్ టెస్ట్‌ను అక్టోబర్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. దీనిలో వచ్చిన స్కోర్ మూడేండ్లు వ్యాలిడిటీ ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
- స్టేజ్-2 ఇంటర్వ్యూ. ఖాళీలను బట్టి ఆయా ప్రదేశాలలో ఉన్న ఆర్మీ స్కూల్స్ ప్రకటన ఇస్తాయి. ఆ ప్రకటనల ఆధారంగా దరఖాస్తు చేసుకుని అక్కడ నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
- స్టేజ్-3లో ఈ దశలో టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీని పరీక్షిస్తారు. లాంగ్వేజ్ టీచర్లకు 15 మార్కులకు రాతపరీక్ష (ఎస్‌ఏ, కాంప్రహెన్షన్)తోపాటు టీచింగ్ స్కిల్స్ పరీక్ష నిర్వహిస్తారు.
- రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, సికింద్రాబాద్

ముఖ్యతేదీలు:- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: సెప్టెంబర్ 21
- ఫీజు: రూ.500/-
- పరీక్ష తేదీలు: అక్టోబర్ 19, 20
- ఫలితాల వెల్లడి: అక్టోబర్ 30
- వెబ్‌సైట్: http://aps-csb.in


- కేశవపంతుల వేంకటేశ్వరశర్మ

969
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles