ఆర్‌బీఐలో గ్రేడ్ బీ ఆఫీసర్లు


Tue,October 1, 2019 01:08 AM

RESERVEBANK
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)లో గ్రేడ్ బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 199
-విభాగాల వారీగా ఖాళీలు: జనరల్-156, డీఈపీఆర్-20, డీఎస్‌ఐఎం-23 ఉన్నాయి.
-వయస్సు: 2019, సెప్టెంబర్ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-అర్హతలు: డీఆర్-జనరల్ విభాగానికి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ (ఇంటర్, పదోతరగతిలో కూడా 60 శాతం మార్కులు ఉండాలి).
-డీఈపీఆర్ పోస్టుకు-కనీసం 55 శాతం మార్కులతో పీజీ (ఎకనామిక్స్/మ్యాథమెటికల్ ఎకనామిక్స్/ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్/ఫైనాన్స్ లేదా తత్సమాన సబ్జెక్టు)లో ఉత్తీర్ణత. లేదా పీజీడీఎం/ఎంబీఏ ఫైనాన్స్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-డీఎస్‌ఐఎం పోస్టుకు- కనీసం 55 శాతం మార్కులతో పీజీ (స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా తత్సమాన సబ్జెక్టు) ఉత్తీర్ణత.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఎగ్జామ్ (ఫేజ్-1, ఫేజ్-2), ఇంటర్వ్యూ ద్వారా
-రాష్ట్రంలో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్-రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-ఫీజు: జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ.850/-,
-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ.100/-
-చివరితేదీ: అక్టోబర్ 11
-వెబ్‌సైట్: www.rbi.org.in

658
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles