10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం


Wed,October 23, 2019 12:09 AM

indian-army
ఇండియన్‌ ఆర్మీలో పర్మినెంట్‌ కమిషన్‌ కింద 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం కోర్సు-43 ప్రకటన విడుదలైంది.


- కోర్సు: 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీం -43
- నాలుగేండ్ల ఈ కోర్సును పూర్తిచేసిన తర్వాత ఆర్మీలో పర్మినెంట్‌ కమిషన్‌ కింద లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగావకాశాన్ని కల్పిస్తారు.
- మొత్తం ఖాళీలు : 90
- అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌తో ఇంటర్‌ ఉత్తీర్ణత.
- వయస్సు: 16 1/2 - 19 1/2 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 2001, జనవరి 2 నుంచి 2004, జనవరి 1 మధ్య ఉండాలి.
- ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్‌ చేసి స్టేజ్‌-1, 2లలో ఎంపిక చేస్తారు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలను అలహాబాద్‌, భోపాల్‌, బెంగళూరు, కపుర్తలాలో సైకాలజిస్ట్‌, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
- శిక్షణ: ఐదేండ్లు ఇస్తారు. దీనిలో బేసిక్‌ మిలిటరీ ట్రెయినింగ్‌ ఏడాది ఉంటుంది.
- సాంకేతిక శిక్షణ: ఫేజ్‌-1 (ప్రి కమిషన్‌ ట్రెయినింగ్‌) మూడేండ్లు పుణెలోని సీఎంఈ లేదా మోలోని ఎంసీటీఈ లేదా సికింద్రాబాద్‌లోని ఎంసీఈఎంఈలో శిక్షణ ఇస్తారు. ఫేజ్‌-2 (పోస్ట్‌ కమిషన్‌ ట్రెయినింగ్‌) ఏడాది పాటు పై కేంద్రాలలో శిక్షణనిస్తారు.
- నాలుగేండ్ల శిక్షణ తర్వాత పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైనవారికి ఇంజినీరింగ్‌ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఈ డిగ్రీని జేఎన్‌యూ ఇస్తుంది.
- స్టయిఫండ్‌: శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/ ఇస్తారు. నాలుగేండ్ల శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌ హోదాలో ఉద్యోగం ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 13
- వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

682
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles