ఆర్మీలో టీజీసీ


Wed,October 23, 2019 12:09 AM

army
ఇండియన్‌ ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ)-131 నోటిఫికేషన్‌ విడుదలైంది.


- టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు (టీజీసీ-131, జూలై 2020లో ప్రారంభం)
- మొత్తం ఖాళీలు: 40
- విభాగాల వారీగా.. సివిల్‌-8, ఆర్కిటెక్చర్‌-1, మెకానికల్‌-4, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రికల్‌&ఎలక్ట్రానిక్స్‌-5, సీఎస్‌ఈ/ఎమ్మెస్సీ/ఐటీ-11, ఈసీఈ-8, ఎలక్ట్రానిక్స్‌-1, ఎలక్ట్రానిక్స్‌&ఇన్‌స్ట్రుమెంటేషన్‌-1, ఏరోనాటికల్‌/ఏవియానిక్స్‌-1 ఖాళీలు ఉన్నాయి.
- పేస్కేల్‌: రూ.56.100-1,77,500/- వీటికి అదనంగా ఇతర అలవెన్సులు, సౌకర్యాలు కల్పిస్తారు.
- అర్హతలు: అవివాహిత పురుష అభ్యర్థులు. సంబంధిత బ్రాంచీల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు లేదా ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ 2020, జూలై 1 నాటికి కోర్సు పూర్తిచేసేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయస్సు: 2020, జూలై 1 నాటికి 20- 27 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1993, జూలై 2 నుంచి 2000, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
- ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్నవారిని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. తర్వాత రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. ఎస్‌ఎస్‌బీ స్టేజ్‌-1, 2లను ఐదురోజులపాటు నిర్వహిస్తారు.స్టేజ్‌-1లో అర్హత సాధించినవారికి స్టేజ్‌-2 నిర్వహిస్తారు. దీనిలో ఎంపికైన వారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- శిక్షణ: డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో 49 వారాల శిక్షణనిస్తారు. శిక్షణ విజయవంతం అయిన వారికి లెఫ్టింనెట్‌ హోదాలో ఆర్మీలో ఉద్యోగం ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు రూ.56,100/- స్టయిఫండ్‌గా ఇస్తారు.
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
- చివరితేదీ: నవంబర్‌ 14
- వెబ్‌సైట్‌: www.joinindianarmy.nic.in

408
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles