విద్యుత్తు శాఖలో కొలువుల పండుగ


Wed,October 23, 2019 12:17 AM

current
- మూడు వేలకుపైగా ఖాళీలతో తెలంగాణలోని విద్యుత్‌ శాఖలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. జూనియర్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ & కంప్యూటర్‌ ఆపరేటర్‌, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా పరీక్ష తీరును పరిశీలిస్తే...


జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌

- ప్రిపరేషన్‌: ఎక్కువ ప్రాధాన్యం ఉన్న అంశాలపై దృష్టి సారించడమే సరైన వ్యూహం. జూనియర్‌ అసిస్టెంట్‌ & కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌కు ఎక్కువ వెయిటేజీ ఉంది, కాబట్టి దానికి సిద్ధం కావాలి. జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌కు సిద్ధం అయ్యేవాళ్లు హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, ఇండస్ట్రియల్‌ లా, జనరల్‌ లా, లేబర్‌ లా అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే మిగతా అంశాల జోలికి వెళ్లాలి.
- జూనియర్‌ అసిస్టెంట్‌ & కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రిపరేషన్‌ ప్లాన్‌:

- న్యూమరికల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌లకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. స్టాఫ్‌ సెలెక్షన్‌ కమిషన్‌ లేదా బ్యాంక్‌ ఉద్యోగాలకు సంబంధించిన క్వాంటిటేటీవ్‌ పుస్తకాలతో ప్రిపరేషన్‌ ప్రారంభించవచ్చు. ముందుగా bodmas ఆధారిత ప్రశ్నలకు సమాధానం కనుగొనే విధానాన్ని నేర్చుకోవాలి. ఆ తర్వాత అర్థమెటిక్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను నేర్చుకోవాలి. అభ్యర్థి సూత్రాల ఆధారంగా కాకుండా, తార్కికంగా ఆలోచిస్తూ సమాధానాలు కనుగొనాలి. రీజనింగ్‌ అంశానికి సంబంధించి ఫజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెట్‌, అల్ఫాబెట్‌ టెస్ట్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, సిలాజిసం, ర్యాంకింగ్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరీక్ష డిసెంబర్‌లోనే ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు మాక్‌ పరీక్ష రాయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.
- కంప్యూటర్‌ అవేర్‌నెస్‌ కూడా కీలకం. ఇందులో ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, లాంగ్వేజెస్‌, ఎంఎస్‌ ఆఫీస్‌, ఎక్సెల్‌ తదితర ప్రాథమిక అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తున్నారు. కంప్యూటర్‌కు సంబంధించి ప్రాథమిక అంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. గతంలో బ్యాంకింగ్‌ పరీక్షల్లో కంప్యూటర్‌ అవేరెనెస్‌ ఉండేది. దానికి సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి (బ్యాంకింగ్‌ సర్వీస్‌ క్రానికల్‌, అరిహంత్‌ ప్రచురణలు). వాటిని చదివి, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలను చదివితే సరిపోతుంది.
- ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ప్రొఫీషియన్సీకి సంబంధించి, ముఖ్యంగా కాంప్రెహెన్షన్‌పై కూడా దృష్టి సారించాలి. పదాలకు అర్థాలు, వ్యతిరేక పదాలను నేర్చుకోవాలి. సందర్భోచితంగా తెలియని కొత్త పదాలను అర్థం చేసుకొనే సామార్థ్ధ్యాన్ని పెంచుకోవాలి. ఇందుకు నిత్యం ఆంగ్ల దినపత్రికలు చదవడం ఒక్కటే మార్గం. వాక్యాలను పునర్‌ నిర్మించే సామర్థ్యం పెరగాలంటే ఇంగ్లిష్‌ భాషపై పట్టు సాధించాలి (జంబుల్డ్‌ సెంటెన్స్‌). నిత్యం ఆంగ్ల దినపత్రికల్లో వచ్చే వ్యాసాలను చదవడం, తెలియని పదాలను ఊహించి, దగ్గరి అర్థాన్ని, వ్యతిరేఖ అర్థాన్ని పట్ట గలిగే సామార్థ్ధ్యాన్ని పెంచుకోవాలి.
current2
- జనరల్‌ నాలెడ్జ్‌లో భాగంగా కరెంట్‌ అఫైర్స్‌ ముఖ్యం. గడిచిన 6 నుంచి 8 నెలలలో జరిగిన కీలక పరిణామాలపై దృష్టి సారించాలి. అంతర్జాతీయ, జాతీయ, ఆర్థిక, శాస్త్ర-సాంకేతిక, క్రీడ, వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన అంశాలను చదవాలి. ముఖ్య నియామకాలు, అవార్డులు (నోబెల్‌ తదితరాలు) పరిశీలించాలి. భారత, తెలంగాణ చరిత్ర, భుగోళ, ఆర్థిక వ్యవస్థల్లో సాధారణ పరిజ్ఞానాన్ని సంపాదించాలి. అంటే తెలంగాణలో తొలి శాసనం, తెలంగాణలో తొలి కవి లేదా భారత దేశ చరిత్రలో తొలిసారిగా సిద్ధ సైన్యాన్ని ఏర్పాటు చేసిన రాజులు.. ఈ తరహావి సాధారణ పరిజ్ఞానం కిందకు వస్తాయి. జనరల్‌ స్టడీస్‌ తరహాలో చదవాల్సిన అవసరం లేదు. జాగ్రఫీలో భాగంగా వివిధ ఖనిజాలు దేశంలో అవి ఎక్కడ లభిస్తున్నాయి, లేదా తెలంగాణలో ఎక్కడ లభిస్తున్నాయి... ఈ తరహాలో చదవాలి. సిలబస్‌లో స్పష్టంగా జనరల్‌ నాలెడ్జ్‌ అన్నారు కాబట్టి, అంత మేరకే పరిమితం కావాలి. నిత్య జీవితంలో ఉపయోగపడే సైన్స్‌ అంశాలను కూడా చదవాలి. పర్యావరణ అంశాలు, పర్యావరణ ఒప్పందాలు, ప్లాస్టిక్‌ నిషేధం అలాగే విపత్తు నిర్వహణ తదితర అంశాలను కూడా అధ్యయనం చేయాలి. తెలంగాణ సమాజం, సంస్కృతి, అంటే తెలంగాణలో వెనకబడిన వర్గాలు, ఇక్కడ జరిగే పండగలు, జాతరలు వాటి విశేషాలను నేర్చుకోవాలి. అలాగే కన్జూమర్‌ రిలేషన్స్‌ అన్న అంశాన్ని పేర్కొన్నారు, దానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను చదవాలి.

జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ప్రిపరేషన్‌ విధానం

- ఈ విభాగంలో ముఖ్యంగా మానవవనరుల అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అలాగే పారిశ్రామిక చట్టాలు, కార్మిక చట్టాలను చదవాలి. వీటిలో ఇటీవల వచ్చిన మార్పులను అధ్యయనం చేయాలి. ఇది చాలా కీలక విభాగం. ఎక్కువ మార్కులను కలిగి ఉంది. అలాగే చాలా మంది గ్రాడ్యుయేట్లకు ఇది కొత్త అంశం. కాబట్టి, ఈ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించాలి. చదివిన ప్రతి అంశాన్ని, ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నగా ఎలా మలుస్తారో పరిశీలించాలి. ఇందులో భారత రాజ్యాంగం, ప్రత్యేక లక్షణాలు, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, చట్టం చేసే విధానం, ఆర్డినెన్స్‌ (అధికరణం 123, 213) తదితరాలను చదవాలి. న్యాయ వ్యవస్థకు సంబంధించి రిట్‌ పరిధిని పేర్కొన్నారు (అధికరణం 32), రిట్లు, అవి జారీ చేయడంలో ఇమిడి ఉన్న అంశాలను చదవాలి. సమాచార హక్కు చట్టం, కనీస వేతనాలు, ఫ్యాక్టరీలు తదితర చట్టాలను పేర్కొన్నారు, అవి చేసిన లక్ష్యాలు, అమలు తీరును చదువుకోవాలి.
- కంప్యూటర్‌ అవేర్‌నెస్‌లో భాగంగా ప్రాథమిక అంశాలను చదివితే సరిపోతుంది. ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, లాంగ్వేజెస్‌, అకౌంటింగ్‌కు సంబంధించిన కంప్యూటర్‌ అంశాలను చదవాలి.
current1

జూనియర్‌ లైన్‌మెన్‌, జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్య తేదీలు

- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ- అక్టోబర్‌ 22
- ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ- నవంబర్‌ 10
- దరఖాస్తు చేసుకోడానికి చివరితేదీ- నవంబర్‌ 10
- పరీక్ష తేదీ- డిసెంబర్‌ 15
జూనియర్‌ అసిస్టెంట్‌ & కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్య తేదీలు
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- అక్టోబర్‌
- ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- నవంబర్‌ 20
- దరఖాస్తుకు చివరితేదీ- నవంబర్‌ 20
- పరీక్ష తేదీ- డిసెంబర్‌ 22

- సెక్షన్‌ సిలో భాగంగా రెండు అంశాలు ఉన్నాయి. కాంప్రెహెన్షన్‌.. ఇది ఇంగ్లిష్‌కు సంబంధించింది, తక్కువ వేయిటేజీ ఉన్నందున రోజూ ఒక కాంప్రెహెన్షన్‌, అలాగే కొత్త పదాలు వాటి అర్థాలు తెలుసుకోవాలి. అలాగే రీజనింగ్‌, మెంటల్‌ న్యూమరికల్‌ ఎబిలిటీలకు సంబంధించి పాత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ఆ కోణంలో చదివితే సరిపోతుంది. మరో ముఖ్య అంశం జనరల్‌ అవేర్‌నెస్‌. ఇందులో కరెంట్‌ అఫైర్స్‌ కీలకం. పరీక్షకు ముందు 6 నుంచి 8 నెలల వరకు జరిగిన జాతీయ, అంతర్జాతీయ అంశాలను చదవాలి. అలాగే తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ భావన (1948-70), మొబిలైజేషన్‌ దశ (1970-90), తెలంగాణ ఏర్పాటు దిశగా (1991-2014) వరకు చదవాలి. ముఖ్యంగా తొలి దశలో ఆపరేషన్‌ పోలోకు దారి తీసిన పరిస్థితులు, స్వతంత్ర రాష్ట్రంగా హైదరాబాద్‌, ఆ సమయంలో ముల్కీ ఉద్యమం, పెద్ద మనుషుల ఒప్పందం, ఉల్లంఘనలను చదవాలి. ఆ తర్వాత 1969 ఉద్యమానికి దారితీసిన పరిస్థితులు, ఈ సమయంలో ముల్కీ నిబంధనలపై వివిధ తీర్పులు, వాటిని వెలువరించిన న్యాయమూర్తులు, అలాగే ఆరు సూత్రాలు, అయిదు సూత్రాలు, ఎనిమిది సూత్రాల పథకాలు, వివిధ కమిటీల (వాంఛు, వశిష్ట భార్గవ)ను పరిశీలించాలి. మూడో దశలో కవులు, కళాకారులు, అలాగే వివిధ రాజకీయ పక్షాలపాత్ర, తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు, పురోగతి, 2009 తర్వాత జేఏసీ ఏర్పాటు, దాని కార్యక్రమాలను చదవాలి.
current3

1151
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles