సరైన ప్రణాళికతో కేంద్ర కొలువు


Mon,November 4, 2019 01:31 AM

దేశవ్యాప్తంగా ఏటా తప్పనిసరిగా ఉద్యోగ నియామక ప్రకటనలు జారీ చేసే సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో కిందిస్థాయి ఉద్యోగాలను ఈ సంస్థ భర్తీ చేస్తుంది. సాధారణ డిగ్రీ అర్హత ఉన్ననిరుద్యోగులందరికీ అవకాశం ఉండే అనేక ఉద్యోగాలకు వివిధ నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఈ ఏడాది ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ప్రిపరేషన్‌లో ఎలాంటి మెళకువలు పాటించాలన్న అంశంపై నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం.
SBI-SBI
కేంద్రప్రభుత్వంలోని అత్యంత ముఖ్యమైన సంస్థలు ఇన్‌కమ్‌ట్యాక్స్ , ఎక్సైజ్, సీబీఐ పోలీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, కాగ్ వంటి వాటిలో గ్రూప్-బి, గ్రూప్-సి పోస్టులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులను కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ పరీక్ష ద్వారా భర్తీచేస్తారు. కనీస అర్హత డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


1. పే లెవల్-8 (రూ.47,600-రూ.1,51, 100/-)
-అసిస్టెంట్ ఆడిట్/అకౌంట్స్ ఆఫీసర్ (కాగ్)
-గ్రూప్-బి (గెజిటెడ్) పోస్టులకు 30 ఏండ్ల వయసు మించరాదు.

2. పే లెవల్-7 (రూ.44,900-రూ.1,42,400/-) అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ (ఇన్‌కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్), ప్రివెంట్స్ ఆఫీసర్ (ఎన్‌ఫోర్స్‌మెంట్), సబ్ ఇన్‌స్పెక్టర్ (సీబీఐ)
-30 ఏండ్లు మించరాదు.

3. పే లెవల్-6 (రూ.35,400-రూ.1,12,400/-)
-అసిస్టెంట్స్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ మొదలైన పోస్టులు.
-27 ఏండ్ల వయస్సు మించరాదు.

4. పే లెవల్-5 (రూ.29,200-రూ.92,300/-)
-AG, CGAలలో ఆడిటర్స్, అకౌంటెంట్ పోస్టులు
-27 ఏండ్లు మించరాదు.

5. పే లెవల్-4 (రూ.25,500-రూ.1,81,100/-)
-ఇన్‌కమ్ ట్యాక్స్/ఎక్సైజ్‌లలో ట్యాక్స్ అసిస్టెంట్, నార్కోటిక్స్‌లో సబ్‌ఇన్‌స్పెక్టర్ పోస్టులు
-27 ఏండ్లు మించరాదు.

వయస్సు

-2020, జనవరి 1ని ప్రామాణికంగా తీసుకొంటారు. ఉదాహరణకు 30 ఏండ్లు వయస్సు అర్హతగల పోస్టులకు, రిజర్వేషన్ లేనివాళ్లు అంటే ఓపెన్ కేటగిరీలో పోటీపడే అభ్యర్థులు 1990, ఫిబ్రవరి 2కు ముందు జన్మించి ఉండాలి.
-ఎస్సీ/ఎస్టీలకు 5 ఏండ్లు సడలింపు ఉంటుంది. వీరు 1985, జనవరి 2 నుంచి జన్మించి ఉండాలి.
-ఓబీసీలకు 3 ఏండ్లు సడలింపు ఉంటుంది. 1987, జనవరి 2 నుంచి జన్మించి ఉండాలి.
-ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ (అన్ రిజర్వ్‌డ్)కు 10 ఏండ్లు సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు

-స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు కచ్చితంగా మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ చదివి ఉండాలి. మిగతావాటికి అంటే ఏఏఓ, ఇన్‌స్పెక్షన్, ఆడిటర్ వంటి పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైనవారు అర్హులు.
నోట్: ఓబీసీ అభ్యర్థులు ఓబీసీ ఎన్‌సీఎల్ సర్టిఫికెట్‌ను 2019 నవంబర్ 25లోపుగా పొంది ఉండాలి. లేకుంటే రిజర్వేషన్ వర్తించదు.

పరీక్ష విధానం

-టైర్-I - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
-టైర్-II - కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్
-టైర్-III - డిస్క్రిప్టివ్ విధానంలో రాత పరీక్ష
-టైర్-IV - కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్

టైర్-I

-పరీక్ష వ్యవధి: 60 నిమిషాలు.
-విభాగాలు: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్.
-ప్రతి విభాగం నుంచి 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కుల చొప్పున 200 మార్కులు ఉంటాయి.

టైర్-II

-పేపర్-I: క్వాంటిటేటివ్ ఎబిలిటీ. 100 ప్రశ్నలు 200 మార్కులు. (నెగెటివ్ మార్కింగ్ 0.5)
-పేపర్-II: జనరల్ ఇంగ్లిష్. 200 ప్రశ్నలు 200 మార్కులు.
(నెగెటివ్ మార్కింగ్ 0.25)
(పేపర్-III, IV లు ఆప్షనల్. అందరికీ ఉండవు)
-పేపర్-III: స్టాటిస్టిక్స్. 100 ప్రశ్నలు 200 మార్కులు.(నెగెటివ్ మార్కింగ్ 0.5)
-పేపర్-IV: ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్. 100 ప్రశ్నలు, 200 మార్కులు. (నెగెటివ్ మార్కింగ్ 0.5)
-టైర్-III: డిస్క్రిప్టివ్ (జనరల్ ఎస్సే/ ప్రిసైస్/లెటర్/అప్లికేషన్). 60 నిమిషాల వ్యవధి. 100 మార్కులు.
-టైర్-IV: కొన్ని పోస్టులకు టైపింగ్/స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇది కూడా కొన్ని పోస్టులకు మాత్రమే. మిగిలిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.

టైర్-I ప్రిపరేషన్ ప్లాన్

-టైర్-1లో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ అంశాలకు సంబంధించిన సిలబస్‌ను పరిశీలిస్తే..

జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్

-ఈ విభాగం నుంచి వెర్బల్, నాన్‌వెర్బల్‌కు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. ఇందులో క్లాసిఫికేషన్, అనాలజీ, కోడింగ్-డికోడింగ్, పజిల్ టెస్ట్, మ్యాట్రిక్స్, వర్డ్ ఫార్మేషన్, వెన్ డయాగ్రమ్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్స్, వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ అంశాలు ఉంటాయి. వీటిలో నంబర్ సిరీస్, అనాలజీ, కోడింగ్-డికోడింగ్ మొదలైన చాప్టర్లు చాలా ముఖ్యమైనవి. వీటికోసం ఆర్‌ఎస్ అగర్వాల్ పుస్తకం చదివితే సరిపోతుంది. టైర్-1లో రీజనింగ్ సెక్షన్ చాలా సులభమైనది. 45 మార్కులు సాధించడమే లక్ష్యంగా వీలైనన్ని ప్రీవియస్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి.

జనరల్ అవేర్‌నెస్

-స్ట్టాక్ జనరల్ నాలెడ్జ్ (ఇండియన్ హిస్టరీ, కల్చర్ మొదలైన అంశాలు), కరెంట్ అఫైర్స్, స్పోర్ట్స్, బుక్స్ అండ్ ఆథర్స్, ముఖ్యమైన పథకాలు, వార్తల్లో వ్యక్తులకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. అయితే వీటిలో సైన్స్, పాలిటీ, ఎకానమీ, చరిత్రపై దృష్టిసారిస్తే ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటికోసం లూసెంట్ లేదా అరిహంత్ పబ్లికేషన్స్ చదవాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

-ఇందులో సింప్లిఫికేషన్, ఇంటరెస్ట్, పర్సెంటేజ్, రేషియో అండ్ ప్రపోర్షన్, ఏజెస్, స్పీడ్-డిస్టెన్స్ అండ్ టైమ్, నంబర్ సిస్టమ్, మెన్సురేషన్, డాటా ఇంటర్‌ప్రిటేషన్, టైమ్ అండ్ వర్క్, ఆల్జీబ్రా, ట్రిగ్నామెట్రీ, జామెట్రీ నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో పర్సెంటేజ్, ఆల్జీబ్రా, జామెట్రీ, మెన్సులేషన్స్, ట్రిగ్నామెట్రీ చాప్టర్లు ముఖ్యమైనవి. ఎస్సెస్సీ మ్యాథ్స్‌లో కాన్సెప్ట్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. షార్ట్‌కట్స్ వల్ల ఎక్కువగా స్కోర్ చేయడానికి వీలుండదు. కిరణ్ బుక్స్ ప్రాక్టీస్ చేయవచ్చు.

ఇంగ్లిష్ కాంప్రహెన్షన్

-రీడింగ్ కాంప్రహెన్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, స్పెల్లింగ్స్, ఫ్రేజస్ అండ్ ఇడియమ్స్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఎర్రర్ స్పాటింగ్ నుంచి ప్రశ్నలు వస్తాయి. అయితే గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. వీటికోసం ఎస్పీ బక్షి, కిరణ్ పబ్లికేషన్స్ బుక్స్ నుంచి ప్రాక్టీస్ చేయడంవల్ల ఎక్కువగా స్కోర్ చేసుకోవచ్చు.

టైర్-II ప్రిపరేషన్ ప్లాన్

-టైర్-2లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, స్టాటిస్టిక్స్, జనరల్ అవేర్‌నెస్ పేపర్లు ఉంటాయి. వాటికి సంబంధించిన సిలబస్..

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్

-ఈ పేపర్‌లో టైర్-1లో ఉన్న సిలబసే ఉంటుంది. వాటితోపాటు డాటా సఫిషియన్సీ అనే చాప్టర్ అదనంగా ఉంటుంది. ఇందులో ప్రశ్నల కాఠిన్యతస్థాయి పెరుగుతుంది. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడంవల్ల అధికంగా స్కోర్ చేసుకోవచ్చు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్

-రెండో పేపర్ అయిన ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో టైర్-1లో ఉన్న సిలబస్‌తోపాటు క్లోజ్ టెస్ట్, ప్యారా జంబుల్స్, సినానిమ్స్, యాక్టివ్ వాయిస్-ప్యాసివ్ వాయిస్ చాప్టర్లు ఉన్నాయి. వీటిలో క్లోజ్‌టెస్ట్, ప్యారా జంబుల్స్, యాక్టివ్ వాయిస్ -ప్యాసివ్ వాయిస్, ఎర్రర్ స్పాటింగ్ అంశాలను క్షుణ్ణంగా చదవడం, ప్రాక్టీస్ చేయడంవల్ల మార్కులు ఎక్కువగా సంపాదించవచ్చు.

స్టాటిస్టిక్స్

-ఇందులో కలెక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డాటా, మెజర్ ఆఫ్ డిస్పెర్షన్, మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, కోరిలేషన్ అండ్ రిగ్రెషన్, సాప్లింగ్ థియరీ వంటివి ముఖ్యమైన చాప్టర్లు.

జనరల్ స్టడీస్

-ఇందులో ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, ఎకనామిక్స్ అండ్ గవర్నెన్స్ అనే రెండు విభాగాలు ఉంటాయి. వీటిలో ఫండమెంటల్ ప్రిన్సిపుల్స్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్, ఎర్రర్ స్పాటింగ్ అండ్ కరెక్షన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఫైనాన్స్ కమిషన్, థియరీ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లయ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
-పరీక్షకు 25-30 రోజుల ముందునుంచే గ్రాండ్ టెస్టులు వీలైనన్ని రాయడంవల్ల పరీక్ష సమయంలో సమయాన్ని ఆదాచేసుకోవచ్చు. దీంతోపాటు ప్రాక్టీస్ టెస్టుల్లో చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిదిద్దుకున్నట్లయితే ప్రధాన పరీక్షలో ఎక్కువ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
-ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది. కాబట్టి వీటి కోసం www.ssctube.com, textbook.com వంటి సైట్‌లలో ఆన్‌లైన్‌లో పరీక్షలు రాయడం ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష మార్చిలో నిర్వహిస్తే చివరి 45 రోజులు మాక్‌టెస్ట్‌లు రాసి బలహీనతలు గుర్తించి వాటిని అధిగమించాలి.
-ఈ మొత్తం ప్రాసెస్ అవడానికి 8 నెలలు పడుతుంది. కేంద్రప్రభుత్వ సంస్థల్లో గత రెండేండ్లలో ఎక్కువమంది పదవీవిరమణ పొందడంవల్ల ఖాళీల సంఖ్య సుమారు 9వేల వరకు ఉండవచ్చు.

-టైర్-2లో పేపర్-1, 2 ప్రతి ఒక్కరు రాయాల్సి ఉంటుంది. అయితే పేపర్-3 మాత్రం జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (జేఎస్‌ఓ), పేపర్-4 (అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (ఏఏఓ) లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ (ఏఏఓ) పోస్టులకు అప్లయ్ చేసినవారికి మాత్రమే ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: 2019, నవంబర్ 25(5pm)
-ప్రిలిమ్స్ ఎగ్జామ్: 2020, మార్చి 2 నుంచి 11 వరకు
-మెయిన్స్ (టైర్-2+టైర్-3): 2020, జూన్ 22 నుంచి 25 వరకు
-పరీక్ష ఫీజు: రూ.100/-, మహిళలు ఎస్టీ/ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్లకు ఎలాంటి ఫీజు లేదు.
-వెబ్‌సైట్: www.ssc.nic.in


CGL-2019లో ప్రధాన మార్పులు

-టైర్-2,3 లను ఈసారి ఒకేసారి నిర్వహిస్తారు.
-దీనివల్ల రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సుమారు నాలుగునెలల సమయం తగ్గుతుంది.
-టైర్-1,2లలో క్వాలిఫై అయినవారి టైర్-3 పేపర్ మాత్రమే ఎవాల్యూయేషన్ చేస్తారు.

Best books to prepare for SSC CGL 2019
Objective General English - S.P. Bakshi
Lucents General Knowledge -Dr Binary Karn
SSC Elementary and Advanced Mathematics - Kiran Prakashan
Quantitative Aptitude - Dr R. S. Aggarwal / Arun Sharma
Analytical Reasoning by M.K. Pandey/ RS agarwal

T.Srinivas
Advisor
Free classes in Youtube
The SPOORTHY
Cell: 9000976930

597
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles