నేవీలో 2700 పోస్టులు


Wed,November 6, 2019 01:03 AM

ఇండియన్ నేవీలో సెయిలర్, ఎస్‌ఎస్‌ఆర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
indian_navy
-పోస్టు: సెయిలర్
-విభాగాల వారీగా ఖాళీలు: ఏఏ (ఆర్టిఫైజర్ అప్రెంటిస్)-500, ఎస్‌ఎస్‌ఆర్ (సీనియర్ సెకండరీ రిక్రూట్స్)-2200.
-అర్హతలు: ఏఏ పోస్టులకు కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ (మ్యాథ్స్/ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ, కంప్యూటర్‌సైన్స్‌లలో ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి)
-ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులకు-ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ/బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక సబ్జెక్టులో ఉత్తీర్ణత.
-వయస్సు: 2000, ఆగస్టు 1 నుంచి 2003, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
-ఎంపిక విధానం: ఏఏ పోస్టులకు-జాతీయస్థాయిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పీఎఫ్‌టీ, మెడికల్ టెస్ట్‌ల ద్వారా చేస్తారు.
-ఎస్‌ఎస్‌ఆర్ పోస్టులకు- రాష్ట్రస్థాయిలో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, పీఎఫ్‌టీ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
-శారీరక ప్రమాణాలు: కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ, బరువు కలిగి ఉండాలి.
-శిక్షణ: ఆగస్టు 2020 నుంచి ఏఏ పోస్టుకు 9 వారాలు, ఎస్‌ఎస్‌ఆర్ పోస్టుకు 22 వారాల శిక్షణ ఉంటుంది.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: నవంబర్ 18
-వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in

614
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles