సోలరైజేషన్‌తో తెగుళ్ల నివారణ

Thu,April 18, 2019 01:23 AM

నారుమళ్లలో విత్తనం వేసినప్పుడు, నేలలో ఉండే కొన్నిరకాలైన శిలీంధ్ర బీజాలు ఆ విత్తనాన్ని ఆశించి వాటికి తెగులును కలుగజేస్తాయి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తక, మొలకెత్తిన తర్వాత కూడా తెగుళ్లకు గురవుతాయి. దీనివల్ల విత్తనాలు మొలకెత్తకపోవడం, మొలకెత్తిన తర్వాత కూడా నారు కుళ్లిపోయి పడిపోతుంది. ఆ తర్వాత చనిపోతుంది.
Soil-Solarization
నారుకుళ్లు తెగులు పిథియం, ఫైటోప్తోరా అనే కొన్నిరకాల శిలీంధ్రాల వల్ల ఆశిస్తుంది. అయితే ఈ శిలీంధ్రాలు నేలలో ఉండటం వల్ల విత్తనం వేయగానే విత్తనాన్ని ఆశించి, తెగుళ్లను కలుగజేసి నష్టం కలుగజేస్తాయి. ఈ తెగులును క్రిమిసంహారక మందులను ఉపయోగించి విత్తనశుద్ధి చేసి కూడా తగ్గించవచ్చు. అయితే ఇటీవలి కాలంలో క్రిమిసంహాకర మందులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణంలో సమతుల్యత తగ్గిపోతున్నది. వాతావరణంలో కాలుష్యం పెరిగిపోతున్నది. కాబట్టి క్రిమిసంహారక మందులను తక్కువగా ఉపయోగించి, ఇతర పద్ధతులను పాటించి పురుగులను, తెగుళ్లను నివారించడానికి పూనుకొన్నాం. అందులో భాగమే సోలరైజేషన్ పద్ధతి సోలరైజేషన్ అంటే సౌరశక్తిని ఉపయోగించి నేలలో ఉండే పలురకాల తెగుళ్లను కలుగజేసే శిలీంధ్రాలను, బ్యాక్టీరియాను నశింపజేయడం. దీనికి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో నేలను తడిపి, నేలలో తేమ ఉన్నప్పుడు నేలను పాలిథీన్ షీట్‌తో 4 నుంచి 6 వారాల పాటు కప్పి ఉంచాలి. దీనికి తెల్లటి పాలిథీన్ షీటును ఉపయోగించుకోవచ్చు.

ఈ విధంగా చేయడం వల్ల నేలలో ఉండే రోగకారక శిలీంధ్రాలు, శిలీంధ్ర బీజాలు, బ్యాక్టీరియా మొదలైనవి తీవ్రమైన ఉష్ణోగ్రత వల్ల చనిపోతాయి. ఈ పద్ధతి ముందుగా ఇజ్రాయెల్ దేశంలో ప్రారంభించబడింది. అయితే ఇప్పుడు ఇతర దేశాల్లోనూ ఈ పద్ధతిని పాటిస్తున్నారు. సోలరైజేషన్ పద్ధతిలో క్రిమిసంహారక మందులతో అవసరం లేకుండానే నేలలో ఉండే వివిధ రకాలైన శిలీంధ్రాలను, శిలీంధ్ర బీజాలను, నెమటోడ్స్‌ను నివారించవచ్చు. దీనికి కారణం ఏమంటే సోలరైజేషన్ పద్ధతిలో నేల 15 సెం.మీ లోతు వరకు వేడెక్కుతుంది. అయితే 5 సెం.మీ లోతు వరకు ఎక్కువగా ఉష్ణోగ్రత ఉంటుంది. నేల పైపొరలోను, 5 సెం.మీ లోతువరకు కూడా 50 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉంటుంది. సోలరైజేషన్ పద్ధతిలో ఎన్నో లాభాలు ఉన్నాయి. ఈ విషయాన్ని రైతులు గమనించాలి. ముందుగా మనం గమనించాల్సింది ఏమంటే ఈ పద్ధతితో తెగుళ్లను, పురుగులను అరికట్టడానికి ఉపయోగించే మందులతో నిమిత్తం లేదు.
m-vijaya

3168
Tags

More News