అధిక దిగుబడికి ఐఐఆర్‌ఆర్ 93ఆర్

Thu,May 23, 2019 01:40 AM

paddy-iirf
బీపీటీ (5204)కి ప్రత్యామ్నాయంగానే ఐఐఆర్‌ఆర్ 93 ఆర్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్) అనే నూతన వరి వంగడాన్ని భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు ఉత్పత్తి చేశారు. భారతీయ వరి పరిశోధనా సంస్థ హైదరాబాద్, సీసీఎంబీ హైదరాబాద్ వారు సంయుక్తంగా ఉత్పరివర్తనం అనే పద్ధతి ద్వారా అభివృద్ధి చేసిన వరి రకం ఇది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఈ వరి రకాన్ని రైతులు సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించవచ్చు. ప్రస్తుతం ఈ వరి విత్తనాలు కొప్పుల సత్యనారాయణ వద్ద అందుబాటులో ఉన్నాయి.

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కిష్టంపేటలో కొప్పుల సత్యనారాయణ అనే అభ్యుదయ రైతు తన పంట పొలం లో ఐఐఆర్‌ఆర్ 93 ఆర్ అనే వరి పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. సత్యనారాయణ సాగు చేసిన వరి పంటను శాస్త్రవేత్త శేషు మాధవ్ పరిశీలించి, ఈ వరి వంగడం గురించి పలు విషయాలు వెల్లడించారు. సన్నరకాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో బీపీటీ 5204కు బదులుగా ఐఐఆర్‌ఆర్ 93ఆర్ అనే వరి వంగడాన్ని ఉత్పత్తి చేసి, సాగు చేసేందుకు అభ్యుద య రైతులకు ఇవ్వడం జరిగింది. కిష్టంపేట గ్రామానికి చెందిన కొప్పుల సత్యనారాయణ ఈ వరి పంటను సాగు చేసి అధిక దిగుబడి సాధించారు. ఈ మధ్యకాలంలో బీపీటీ వరి పంటకు ఎక్కువ దోమపోటు, అగ్గితెగులుతో పాటు రకరకాల రోగాలు వస్తున్నాయ నే విషయాన్ని గమనించిన భారతీయ వరి పరిశోధనా సంస్థ ఆధ్వ ర్యంలో దీనికి ప్రత్యామ్నాయంగా ఐఐఆర్‌ఆర్ 93 ఆర్ అనే నూత న వరి వంగడాన్ని ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం లో నల్గొండ, సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్ నాగర్‌కర్నూల్, భువనగిరి తదితర ప్రాంతాల్లో ఈ వరి వంగడాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఈ రకం పంట కాలం 120 రోజుల నుంచి 125 రోజులు కాగా వానకాలం, యాసంగికి అనుకూలంగా ఉంటుందన్నారు. స్వల్పకాలిక పంట రకం. గింజ సన్న రకంగా ఉండి పిలుకలు ఎక్కువగా ఉంటాయి. ఈ వరి పంటపై పరిశోధ న చేసి ఆంధ్ర రాష్ర్టాలతో పాటు, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాల్లో పరిశోధన చేయగా, దిగుబడి 10శాతం ఎక్కువగా వచ్చిందన్నారు. కాండం తొలుచు పురుగు, దోమపోటును తట్టుకుని అధిక దిగుబడిని ఇస్తుందన్నారు.

paddy-iirf3

ఐఐఆర్‌ఆర్93ఆర్ ప్రధాన లక్షణాలు

-వానకాలం, యాసంగి పంటకు అనుకూలం ఇది. వానకాలం లో జూన్ నుంచి జూలై చివరి వారం వరకు నారు పోసుకోవ చ్చు. యాసంగిలో నవంబర్ 20 నుంచి డిసెంబర్ చివరి వారం వరకు నారు పోసుకోవచ్చు.
-వానకాలం, యాసంగిలో పండిన వరి గింజ ఒకే మాదిరిగా ఉండి నూక శాతం తక్కువగా ఉంటుంది.
పంట కాలం: వానకాలంలో 125 రోజుల నుంచి 130 రోజుల పంట కాలం. మధ్యకాలిక వరి రకం పంట. ఉల్లి కోడు తట్టుకుంటుంది. అగ్గి తెగులు, పొట్ట కుళ్ళు, మెడవిరుపును తట్టుకుని ఎక్కు వ దిగుబడి ఇస్తుంది. తక్కువ ఎరువులు వాడుకోవాలి.
దిగుబడి: ఎకరానికి సగటున 28-30 క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుంది.

శాస్త్రవేత్తల సందర్శన

సత్యనారాయణ తయారుచేస్తున్న వరి వంగడాలను పలువురు భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా సంస్థ హైదరాబాద్ శాస్త్రవేత్తలు డాక్టర్ షేక్ ఎన్‌మీరా, డాక్టర్ శేషుమాధవ్, డాక్టర్ అరుణ్‌కుమార్, డాక్టర్ మదన్‌మోహన్, జమ్మికుంట కృషి విజ్ఞాన వరి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త శ్రీనివాస్ రావు పరిశీలించారు. ఈ క్రమంలో భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా కేంద్రం హైదరాబాద్ శాస్త్రవేత్తలు సత్యనారాయణ పంట పొలంలో 18 రకాల వరి వంగడాలను ఉత్పత్తి చేసేందుకు పంటల ప్రదర్శన చేపట్టారు. సత్యనారాయణ తయారుచేస్తున్న వరి వంగడాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
-సిద్ధం సదానందం, 9949889750
కాల్వశ్రీరాంపూర్


paddy-iirf2

దిగుబడి ఎక్కువ

వానకాలం, యాసంగి కాలానికి రైతులు అనువైన వరి విత్తనాలను సేకరించి, పంట సాగు చేస్తే అధిక దిగుబడు లు సాధించవచ్చు. నేను విత్తనాల తయారీలో బ్రీడర్, వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు పాటిస్తున్నా. పంట పొలంలో మేలైన వరి వంగడాలను తీసుకొని, సంకరణం చేసి, అందులో మేలు రకాన్ని తీసుకొని, విత్తనం తయారుచేస్తున్నా. ఒక రకం విత్తనం తయారు కావాలంటే సుమారు 6 నుంచి 7 ఏండ్లు పడుతుంది. ఇంకా నూతన వరి విత్తనాలు తయారు చేయాలనేది నా ఆలోచన. భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ శేషుమాధవ్ ఉత్పత్తి చేసి ఇచ్చిన ఐఐఆర్‌ఆర్ 93ఆర్ అనే వరి విత్తనా న్ని నా పొలంలో వేశా. అధిక దిగుబడి వచ్చింది. ప్రస్తు తం ఐఐఆర్‌ఆర్ 93 ఆర్ విత్తనాలు నా వద్ద అందుబాటు లో ఉన్నాయి. అలాగే తాను సైతం కొన్నేళ్లుగా సొంతం గా వరి విత్తనాలు తయారుచేస్తున్నా. అవసరం ఉన్న చుట్టుపక్కల గ్రామాల రైతులకు అందిస్తున్నా. విత్తనాలు కావాల్సిన రైతులు సెల్ నంబర్ 9908608696లో సంప్రదించవచ్చు.
- కొప్పుల సత్యనారాయణ, రైతు, కిష్టంపేట

4897
Tags

More News