పంట దిగుబడికి విత్తనాల ఎంపికే కీలకం

Thu,May 30, 2019 01:33 AM

seeds-selection
ఏ పంటలోనైనా ఆశించిన దిగుబడులు పొం దాలంటే సాగు చేసే పంటలకు సంబంధించిన విత్తనాల ఎంపికే కీలకం. కాబట్టి రైతులు విత్త నాల కొనుగోలు చేయడానికి ముందే విత్తనాల ఎంపికలో జాగ్రత్తలు పాటించాలి. వాటిపై అవగాహనను పెంపొందించుకుని వాటి ఆధారంగా ఎంపిక చేసుకుంటే అనుకున్న మేర కు దిగుబడులను పొందవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు. అయితే విత్తనాల ఎంపికలో పాటించాల్సిన జాగ్రత్తల గురించి గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరి రెడ్డి వివరించారు. మరిన్ని వివరాల కోసం ఈ నెంబర్‌లో 9440481279 సంప్రదించవచ్చు.

మంచి విత్తనం లక్షణాలు

-ఏ విత్తనమైనా మంచి పరిమాణం, ఆకారం ఉండాలి.
-విత్తనం పరిశుద్ధంగా ఉండాలి. -చీడపీడలు ఆశించనిదై ఉండాలి.
-మొలక శాతం నిర్దేశించబడిన ప్రకారం ఉండాలి.
జన్యు స్వచ్ఛత: ఆయా రకాలకు ఉండాల్సిన సహజమైన ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండాలి. విత్తనం నాటినప్పుడు వాటి నుంచి వచ్చే దిగుబడులు సైతం అవే రకం అయి ఉండాలి. ఒక స్వచ్ఛమైన రకం విత్తనం సాగు చేసి 100 శాతం అవే రకం విత్తనాలు పొందడాన్ని జన్యు స్వచ్ఛత అంటారు.

భౌతిక స్వచ్ఛత: విత్తనానికి ఉండాల్సిన రంగు ఉండాలి. తాలు సగం నిండిన గింజ ఉండ కూడదు. మట్టి పెడ్డలు, ఇసుక, దుమ్ము మొదలైన జడ పదార్థాలు ఉండకూడదు. కలుపు విత్తనాలు కానీ, ఇతర పంట విత్తనాలు కానీ ఉండకూడదు.

తేమశాతం: విత్తనాలలో 13 శాతం తేమ ఉంటే బాగా మొలకెత్తుతాయి. తేమ 14 శాతం మించి ఉంటే విత్తనాలు నిల్వ చేయడానికి పనికిరావు.

మొలక శాతం: వరి, మక్కజొన్న, నువ్వులు కనీస మొలక శాతం 80గా ఉండాలి. జొన్న, పప్పుధాన్యాలు 75 శాతం ఉండాలి, పొద్దు తిరుగుడు, ఉల్లి విత్తనాలలో 70 శాతం, పత్తి 65 శాతం, మిరప 60 శాతం చొప్పున కనీస మొలకశాతం ఉండాలి.

విత్తన వర్గీకరణ: బ్రీడర్ విత్తనం, ఫౌండేషన్ విత్తనం, సర్టిపైడ్, ట్రూత్ లేబుల్ అనే నాలుగు రకాలు ఉంటాయి. బ్రీడర్ విత్తనాన్ని రూపొందించిన పరిశోధనా స్థానంలోనే శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉత్పత్తి చేస్తారు. వీటిలో జన్యు స్వచ్ఛత 100 శాతం ఉంటుంది. ఈ విత్తన సంచులకు పసుపు రంగు లేబుల్ ఉంటుంది.

ఫౌండేషన్ విత్తనం: బ్రీడర్ విత్తనాల నుంచి పరిశోధనా స్థానాలలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలోనూ, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు క్షేత్రాలలోను సాంకేతిక నిపుణుల పర్య వేక్షణలో ఉత్పత్తి చేస్తారు. ఈ విత్తన సంచులకు తెలుపు రంగు లేబుల్ ఉంటుంది.
-సర్టిపైడ్ విత్తనం ఇవి ఫౌండేషన్ విత్తనాల నుంచి రైతులు పొలాల్లో సీడ్ సర్టిఫికేషన్ వారి పర్యవేక్షణలో ఉత్పత్తి చేయబడుతాయి. ఈ విత్తనపు సంచులకు నీలి రంగు లేబుల్ ఉంటుంది.
-ట్రూత్‌పుల్ లేబుల్ ఈ విత్తనాలు ధృవీకరణ కిందికి రావు. ఉత్పత్తిదారుని మీద నమ్మకంపై కొనాల్సి ఉంటుంది. ఈ విత్తన సంచులకు ఆకుపచ్చ రంగు లేబుల్ ఉంటుంది.
-నట్టె కోటేశ్వర్‌రావు, గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,
9989944945

12788
Tags

More News