త్రీడీ టెక్నాలజీ ల్యూర్‌తో లింగాకర్షక బుట్టలు

Wed,June 5, 2019 10:48 PM

3d-technology-lures
కత్తెర పురుగు, పత్తిలో గులాబీరంగు పురుగు, టమాటాలో పిన్ వాం వంటి పురుగులు కొత్తగా పంటల్లో విపరీతమైన నష్టాన్ని కలుగజేస్తున్నాయి. రైతులు ఇప్పటికే ఆయా పురుగుల ఉధృతిని అంచ నా వేయడానికి, అరికట్టడానికి లింగాకర్షక బుట్టలు వాడుతున్నారు. అయితే వీటిలో వాడే ల్యూర్ సామర్థ్యంతో 15-20 రోజుల కంటే ఎక్కువగా పురుగులను ఆకర్షించలేవు. ఈ నేపథ్యంలో నానో త్రీడీ ల్యూర్‌లు సాధారణ ల్యూర్‌లతో పోలిస్తే మూడింతలు ఎక్కువ కాలం పనిచేస్తాయి. కాబట్టి పురుగుల ఉధృతిని, నష్టాన్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు.

3d-technology-lures2

ఇది పనిచేసే విధానం:

రసాయనాలు టాబ్లెట్ రూపంలో ఉంటుంది. ఈ మాత్రలలో రసాయనం పౌడర్ రూపంలో మూడు పొరలుగా ఉంటుంది. ఒక్కొక్క పొరపై ప్రత్యేక రక్ష ణ కవచం ఉంటుంది. ఈ రక్షక కవచం గాలితో చర్యలోకి వచ్చినప్పుడు ఆక్సీకరణ చెందుతుంది. అప్పటివరకు ఆక్సీకరణ ఉండదు. మొదట ల్యూర్ మాత్రలను లింగాకర్షక బుట్టలో పెట్టినప్పుడు పౌడ ర్ నుంచి మూడు పొరలలో చివరి పొర పనిచేయ డం మొదలవుతుంది. మొదటి పొర కొంతకాలం పనిచేసిన తర్వాతనే, రెండవ పొర (చివరి నుంచి) పనిచేస్తుంది. రెండవ పొర పూర్తిగా అయిపోయిన తర్వాత, మూడవ పొర రక్షణ కవచం గాలితో చర్య చెంది, ఆక్సీకరణ చెందుతుంది. ఈ టెక్నాలజీలో ల్యూర్‌లోని ఫిరమోన్ మూడు దశలలో విడుదలై ఎక్కువ కాలం పురుగులను ఆకర్షిస్తుంది. ఈ విధం గా మిగతా సాధారణ ల్యూర్‌లలో కాకుండా, ఈ నానో త్రీడీ ల్యూర్ నుంచి ఫిరమోన్ ఏక కాలంలో విడుదల కాదు. బదులుగా ఒక పొర తర్వాత మరో పొర నుంచి విడుదలవుతూ ఎక్కువ కాలం ఇంకా సమర్థవంతంగా పనిచేస్తుంది.
-ఆసరి రాజు

v-purushotam-rao
వంకాయలో కొమ్మ కాయ తొలుచు పురు గు, పత్తిలో గులాబీ రంగు పురుగు, పంట వేసిన 30 రోజుల నుంచి వీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ పురుగుల సంఖ్యను గమనించడానికి సాధారణ ల్యూర్ వాడినప్పుడు ప్రతి 20 రోజులకు ఒకసారి ల్యూర్‌లు మార్చాల్సి వచ్చేది. దీంతో కూలీల ఖర్చు పెరుగడంతో పాటు, నిరంతర నిఘా సాధ్య మయ్యేది కాదు. బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకున్న నానో త్రీడీ ల్యూర్‌లతో 60నుంచి 70 రోజుల పాటు నిరంతరంగా ఈ పురుగుల ఉధృతిని గమనించాం. తద్వారా సకాలంలో వివి ధ పద్ధతుల వాటిని నిర్మూలించి పంటను కాపాడుకున్నాం. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం ఈ నెంబర్‌లో సంప్రదించవచ్చు.
-వెలాది పురుషోత్తం రావు, రైతు, 7207501515

3d-technology-lures3

4775
Tags

More News