బత్తాయిలో తెగుళ్ల నివారణ

Thu,June 13, 2019 12:53 AM

TRIPURARAM
బత్తాయి తోటల్లో వివిధరకాల తెగుళ్లు సోకి చెట్లు చనిపోతున్నాయి. ఈ తెగుళ్లు వ్యాపించకుండా ఉండడానికి రైతులు ఏడాది పొడవునా సమగ్రమైన పోషకా లు, నీరు అందించాలి.

వేరుకుళ్లు తెగులు: వేరుకుళ్లు తెగులు వేర్ల ను ఆశించిన శీలింధ్రాలు ముందుగా పీచు వేర్లను నాశనం చేస్తాయి. దీనివల్ల చెట్లకు నీరు, పోషక విలువలు అందక చెట్లకు పల్లాకు తెగులు ఆశిస్తుంది. తరువాత ఎన్ని మందులు పిచికారీ చేసినా చెట్లు కోలుకోవు. చెట్లకు పూత, పిందె విపరీతంగా వచ్చి రాలిపోతాయి. దీంతో చెట్లు పూర్తిగా ఎండిపోయి చనిపోతాయి.

తెగులు సోకడానికి కారణాలు: నేలలో తేమ తక్కువగా ఉండటం. నీటి తడుల్లో ఎక్కువగా వ్యత్యాసం ఉండటం. అధిక తేమ నీరు నేరుగా చెట్టు కాండానికి తగల డం. వేర్లకు సరిగా గాలి సోకకపోవడం. ఎక్కువ మొతాదులో ఎరువులను ఒకేసా రి చల్లుకోవడం. నత్రజని ఎరువులు సరైన మోతాదులో అందించకపోవడం. వేర్లకు తరచూ గాయాలు అవుతుండటం వల్ల వేరు కుళ్లు తెగులు వ్యాపిస్తుంది.

నివారణ చర్యలు: చెట్లు వాడిపోయే లక్షణాలు ప్రాథమిక దశలో కనిపించినప్పుడే చెట్లకు నీరు కట్టి మరుసటి రోజున లీటరు నీటికి 2 గ్రా, కార్బండిజం, 2.5 గ్రా, మాంకోజెబ్, 20 నుంచి 30 లీటర్ల నీటి లో కలిపి చెట్టు పొద అంతా తడిచే లాగా పోయాలి. నెల రోజుల వ్యవధిలో రెండు లేదా మూడుసార్లు ఈ పద్ధతిని అనుసరించాలి. ట్రైకోడెర్మా విరిడి 2 కిలోలను 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండితో కలిపి 10 కిలోల చొప్పున పాదుల్లో వేసి కలియగలపాలి. శీలింధ్రాలు వృద్ధి చెందకుండా ఇది దోహదపడుతుంది.

TRIPURARAM2
తెగుళ్ల నివారణ పద్ధతులు: క్రమం తప్పకుండా సేంద్రియ ఎరువులను వాడాలి. దీనివల్ల భూమిలో సారం పెరుగుతుంది. చెట్ల మధ్య ఖాళీ స్థలంలో చెట్ల పాదుల్లో పచ్చిరొట్టె పంటలైన జనుము, జీలుగ చల్లి మొగ్గదశ వచ్చినపుడు దున్నితే భూ సారం పెరుగుతుంది. నీరు, పోషకాలు ఏడాది పొడవునా సరిపడేలా అందించా లి. ఫర్టిగేషన్ పద్ధతిని అవలంబించాలి. తక్కువ ఖర్చుతో నీటిలో కరిగే రసాయనిక ఎరువులు వాడాలి.

నీటి యాజమాన్య పద్ధతులు : నేల స్వభావం, వాతావరణ పరిస్థితులు, చెట్ల వయస్సును బట్టి చెట్లకు నీటిని అందించాలి. లేత చెట్లకు మొదటి 6 నెలల వరకు ప్రతి 3 రోజులకు ఒకసారి, 6 నెలల తరువాత 4 - 6 రోజులకు ఒకసారి 10 నుంచి 15 లీటర్ల నీటిని అందించాలి. 4 నుంచి 5 ఏండ్ల వయస్సు గల చెట్లకు 6 నుంచి 15 రోజుల వ్యవధిలో సుమారు 50 - 75 లీటర్ల నీటిని అందించాలి. కాపు దశలో ఉన్న చెట్లకు రోజుకు 130 - 150 లీటర్ల నీటిని అందించాలి. పాదుల్లో ఎక్కువగా నీరు నిల్వ ఉండటం వల్ల వేరువ్యవస్థ దెబ్బ తింటుంది. చెట్ల పాదుల్లో వరి ఊక, వేరుశనగ పొట్టు వేసి మల్చింగ్ చేయాలి. దీనివల్ల నీరు వృథా కాదు. అంతేకాకుండా ఇది మంచి సేంద్రియ ఎరువుగానూ ఉపయోగపడుతుంది.
-నగిరి హరీశ్, త్రిపురారం

2706
Tags

More News