వరిలో విత్తనోత్పత్తి

Thu,June 13, 2019 12:57 AM

దేశవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతున్న ప్రధాన ఆహారపంట వరి. రాష్ట్రంలో దాదాపు 45 లక్షల హెక్టార్లలో వరి సాగు చేస్తున్నారు. అయితే సంప్రదాయ పద్ధతిలో కాకుండా నాణ్యమైన విత్తనం, సాంకేతిక పరిజ్ఞానంతో సాగు చేస్తే ఆశించిన దిగుబడులు పొందే అవకాశం ఉన్నది. రైతులకు నాణ్యమైన విత్తనాలు పంపిణీ చేసి తద్వారా విత్తనోత్పత్తి చేపట్టేందుకు గాను గత కొద్ది సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ విశేష కృషి చేస్తున్నది.
paddy-seeds
తెలంగాణ ప్రభుత్వం, జాతీయ విత్తన సంస్థ, విత్తన ఉత్ప త్తిదారులు ఈ సంస్థకు వాటాదారులుగా ఉంటున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాల్లో విత్తనాల ను అందుబాటులో ఉంచుతారు. నాణ్యమైన అధిక దిగుబడి రకాలు, సంకరజాతి రకాల విత్తనాలను మాత్రమే ఉత్పత్తి చేసి అమ్ముతారు. విత్తన క్రమంలో భాగంగా ఈ సంస్థ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పరిశోధన సంస్థల నుంచి బ్రీడర్ విత్తనాలను ముందుగానే తీసుకుంటారు. అనంతరం మూల(ఫౌండేషన్) విత్తన ఉత్పత్తిచేసి నిపుణు ల పర్యవేక్షణలో ధృవీకరణ, లేబుల్ విత్తనాలను ఉత్పత్తి చేస్తారు. ఈవిధంగా ఉత్పత్తి చేసిన విత్తనాలను విత్తన పరీ క్షా కేంద్రాలలో పరీక్షించిన అనంతరం రైతులకు విక్రయిస్తా రు. విత్తనశుద్ధి(ప్రాసెసింగ్), ప్యాకింగ్ సైతం సంస్థ 14 ప్రాసెసింగ్ యూనిట్లలో నిపుణుల పర్యవేక్షణలో జరుగుతుంది. ఒకవేళ ఫిర్యాదులు ఉన్నట్లు అయితే సత్వర చర్య లు తీసుకుంటారు. కాబట్టి విత్తనోత్పత్తిలో రైతులు ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి యాజమాన్య పద్ధతు లు అవలంబించాలో తెలుసుకోవాలి. ముఖ్యంగా వరి విత్తనోత్పత్తిలో ఎదురయ్యే ఇబ్బందులు, నివారణ చర్యల గురించి వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించిన వివరాలు..

నారు పోసుకునే సమయం..

పంట సాగు కాలం వానకాలం జూన్ నుంచి డిసెంబర్ వరకు, యాసంగి నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఉంటుం ది. సారవంతమైన నేల, నీటివసతి కలిగి ముంపునకు గురికాని నేలలు అనుకూలం. గత సంవత్సరం పండించిన మొక్కలను తీసివేయాలి. నీటి వసతి కింద దీర్ఘకాలిక రకాలకు మే చివరి వారం నుంచి జూన్ 20 వరకు నారుపోసుకోవచ్చు. మధ్యకాలిక రకాలకు జూన్ 20 నుంచి జూలై 15 వరకు, స్వల్పకాలిక రకాలకు సంబంధించి జూలై చివ రి వరకు కూడా నార్లు పోసుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. యాసంగి విషయానికి వస్తే అన్నిరకాల స్వల్ప కాలిక విత్తనాలు సాగు చేసుకోవచ్చు.

విత్తన మోతాదు, శుద్ధి ఇలా...

ఎకరానికి 20-30 కిలోలు అవసరం. చిన్న పరిణామం కలిగిన విత్తనాలు ఎకరానికి 15 కిలోలు సరిపోతాయి. ఒక కిలో విత్తనానికి ఒక లీటర్ నీటికి1 గ్రాము కార్బండిజం కలిపి అట్టి ద్రావణంలో 24 గంటలు నానబెట్టిన అనంతరం మండె కట్టుకోవాలి. అనంతరం మొలకెత్తిన విత్తనాలను నారు మడుల్లో చల్లుకోవాలి. వరి విత్తనాలలో నిద్రావస్థను తొలిగించడానికి 6-10 మిల్లీగ్రాముల నత్రికామ్లం లీటర్ నీటిలో కలిపి 24 గంటలు నానబెట్టాలి. అనంతరం నిద్రావస్థ విత్తనాలను నీటితో కడిగి మండె కట్టుకోవాలి.

paddy-seeds3

నారుమడి పెంపకం..

పొలంలో నీరుపెట్టి రెండు, మూడుసార్లు మొత్తగా దున్ని దమ్ము చేసి, చదును చేసుకోవాలి. 100 చదరపు మీటర్ల నారుమడికి అరకిలో యూరియాను విత్తనం చల్లే మందు మరొక అరకిలో యూరియాను విత్తిన 12-14 రోజులలో నారుమడిలో వేసుకోవాలి. అయితే అరకిలో భాస్వరం, అరకిలో పొటాష్ ఇచ్చే ఎరువులు నారుమడి ఆఖరి దుక్కి లో వేసుకోవాలి. జింకు లోపం గమనిస్తే 1 లీటర్ నీటికి 2.0 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. విత్తనం చల్లిన వారంరోజుల వరకు ఆరుతడులు ఇచ్చి తరువాత పలుచగా నీరు పెట్టుకోవాలి. నారు పీకే వారం రోజుల ముందు 2.5 సెంట్లు నారుమడికి 400 గ్రా కార్బోఫ్యూరాన్ 3గ్రా గుళికలను ఇసుకలో కలిపి చల్లి పలుచగా నీరు ఉంచాలి.

ప్రధాన పొలం తయారీ-యాజమాన్య పద్ధతులు

నీరు పెట్టుకొని 2-3 సార్లు దున్ని మరుగబెట్టిన అనంతరం దమ్ము చేసుకోవాలి. మురగ దమ్ము చేసినైట్లెతే కలుపు మొక్కలు తగ్గి, మొక్కలకు ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చదరపు మీటర్‌కు దీర్ఘ, మధ్యకాలిక రకాలకు 33 కుదుళ్లు, స్వల్ప కాలిక రకాలకు 44 కుదుళ్లు ఉండాలి. వానకాలంలో సాళ్ల మధ్య 20 సెం.మీ, యాసంగిలో 15 సె.మీ ఎడం ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే విధంగా ఎకరానికి 4 టన్నుల పశువుల ఎరువుతో పాటు, నత్రజని, భాస్వరం ఎరువులను సైతం వేసుకోవాలి. నత్రజని ఎరువులు రెండు, మూడు ధపాలుగా సమభాగాలుగా చేసుకొని వాడుకోవాలి. భాస్వరం, పొటాష్ ఎరువులను ఆఖరి దమ్ములో వేయాలి. వీటితో పాటు మరో 20 కి, గ్రాముల జింక్ సల్ఫేట్‌ను కూడా వేసుకోవాలి.

నీటి యాజమాన్యం- చీడపీడల నివారణ..

నాట్లు వేసే సమయంలో పొలంలో నీరు పలుచగా ఉండా లి. తర్వాత దుబ్బు చేయడం పూర్తయ్యేంత వరకు 2 లేదా 3 సెంటీమీటర్లు, చిరుపొట్ట దశ నుంచి గింజ గట్టిపడేంత వరకు ఐదు సెంటీమీటర్ల నీటి మట్టం ఉండాలి. కోతకు వారం పది రోజుల ముందు నుంచి క్రమంగా నీటి మట్టం తగ్గించి ఆరబెట్టుకోవాలి. నాటిన మూడు నుంచి ఐదు రోజుల్లోపు బ్యూటాక్లోర్ 1 లీటర్ లేదా ప్రిటిలాక్లోర్ 500-600 మిల్లీ లీటర్లు ఎకరానికి 20-25 కిలో గ్రాముల పొడి ఇసుకలో కలిపి చల్లుకుంటే కలుపును నివారించుకోవచ్చు. ఇక వరిలో తరచుగా వచ్చే కాండం తొలుచు పురుగు నివారణకు మొదటి దశలో ఎకరానికి 8-10 కిలో గ్రాముల కార్బోఫ్యూరాన్‌ను ఇసుకలో కలిపి చల్లుకోవాలి. సుడిదోమ నివారణకు ఇతర చీడపీడలు, ఉల్లికోడు, తాటాకు తెగు లు, వరి ఈగ, తామర పురుగుల నివారణకు 1.6 మిల్లీ లీటర్ల మోనోక్రోటోఫాస్ ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మామిడిపండు, కాండం కుళ్లు తెగుళ్ల నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీమీటర్లు, వాలిడామైసిన్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రాఫికొనజోల్ 1 మిల్లీలీటర్ నీటిలో కలి పి పిచికారీ చేసుకోవాలి. అదే విధంగా పొట్టకుళ్లు, ఆకుపచ్చ తెగులు నివారణకు కార్బండిజం ఒక గ్రాము లేదా మాంకోజెబ్ 2 గ్రాములు ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.

విత్తనం ఆరబెట్టే పద్ధతి

పొలం వెన్నుల్లో కనీసం 80-90 శాతం విత్తనాలు పక్వానికి వచ్చి పసుపు రంగుకు మారినప్పుడు పంటకోత కోసుకుని రెండు, మూడురోజుల పాటు పొలంలోనే ఆరనివ్వా లి. బల్లకట్టు పద్ధతిలో కాని, యంత్ర సహాయంతో కాని పగులకుండా నూర్చుకోవాలి. విత్తనం చేతికి వచ్చిన తర్వాత శుభ్రమైన గాలి చొరబడే గదులలో లేదా గోదాములలో నిల్వ చేయాలి. ఎలుకలు కన్నాలు వేయకుండా చూసుకోవాలి. సంచులపై రకంపేరు కనపడే విధంగా ముద్రించుకోవాలి. నిర్ధారించిన పరిణామం గల సంచులలో నింపి మూల విత్తనానికి తెలుపురంగు ట్యాగ్‌లను, ధ్రువీకరణ విత్తనాలకు నీలి రంగు ట్యాగ్‌లను జతపర్చి కుట్టుకోవాలి. విత్తనపు సంచులను గోదాములలో గోడకు తగలకుండా కింది భాగంలో చెక్కతో గాని ఇనుముతో చేసిన ప్లేట్లను ఉంచుకోవాలి.

వరిలో రకాలు.. పంటకాలం..

paddy-seeds2
-మద్దెల లక్ష్మణ్, 9010723131
ఖమ్మం వ్యవసాయం

5467
Tags

More News