బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యం

Thu,June 20, 2019 12:15 AM

TRIPURARAM
రాష్ట్రంలో రైతులు లక్షల ఎకరాల్లో బత్తా యి మొక్కల సాగు చేస్తున్నారు. అయితే బత్తాయి తోటల్లో ఎరువుల యాజమాన్యానికి సంబంధించిన సమాచారాన్ని నిపుణులు అందించారు. ఆ వివరాలు..ఒక్కో చెట్టుకి వయసును అనుసరించి నత్రజని, భాస్వరం, పొటాష్ అందించా లి. నత్రజనిని ఎరువుల రూపంలో కాకుండా 50 శాతం సేంద్రియ పదార్థాల రూపంలో అందించాలి. పశువుల ఎరు వు, ఆముదం లేదా కానుగ లేదా వేపపిండి రూపంలో అందించాలి. భాస్వరం ఎరువులను సింగిల్ ఫాస్ఫేట్ రూపంలో అందించాలి. ఏడాది వయసు ఉన్న చెట్టు కు 25 కిలోల పశువుల ఎరువు, 2.5 కిలోల ఆముదం లేదా కానుగ లేదా వేపపిండి, యూరియా 400 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 600 గ్రాము లు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 250 గ్రాము లు వేసుకోవాలి. 2 నుంచి 3 సంవత్సరా ల చెట్లకు పశువుల ఎరువు 50 కిలోలు, ఆముదం 75 కిలోలు, కానుగ, వేపపిండిలో ఏదో ఒకదానిని 5 కిలోలు కలుపా లి. యూరియా 400 గ్రాములు, 800 లేదా 1200 గ్రాములు సూపర్‌ఫాస్ఫేట్, 1800 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్‌ను అందించాలి.

నాలుగేండ్ల వయస్సు పైబడిన చెట్లకు పశువుల ఎరువు 100 కిలోలు, ఆముదం, కానుగ, వేపపిండి మూడింటిలో ఏదో ఒకటి 25 కిలోలు, యూరియా 1600 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2400 గ్రాములు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 1000 గ్రాములు వేసుకోవాలి. ఎరువులను రెండు దఫాలు గా సమపాళ్లలో వేసుకోవాలి. మొదటగా డిసెంబర్ మాసంలో, రెండవది పిందె కట్టే దశలో, కాయ అభివృద్ధి చెందే దశలో జూన్, జూలై మాసంలో వేసుకోవాలి. లేత తోటల్లో 3-4 దఫాలుగా ఎరువులను వేసుకోవాలి. భాస్వరం ఎరువులను నత్రజని, పొటాష్ ఎరువులను రెండు దఫాలుగా వేసుకోవాలి.

ఎరువులను వేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎరువులను పాదులలో మొదలుకు 4 అడుగుల దూరంలో 10 సెంటీమీటర్‌ల లోతులో వేసుకోవాలి. గుండ్రటి రింగు చేసి ఎరువులను వేసుకోని మట్టితో కప్పివేయాలి. ఎరువులను ఎక్కువ లోతులో వేసుకోకూడదు. బత్తాయికి పీచు వేరు వ్యవస్థ 25 సెంటీమీటర్‌ల లోతులో ఉంటుంది కాబట్టి ఎరువులను నిర్దేశించి న విధంగా వేసుకోవాలి. నీటిలో రసాయనిక ఎరువులను డ్రిప్ ద్వారా ఇవ్వాలి. సమగ్ర పోషక, నీటి యాజమాన్య పద్ధతులను చేపడితే తెగుళ్ల బారిన పడకుండా చెట్లను రక్షించుకోవచ్చు. అధిక దిగుబడులను సాధించవచ్చు.

- నగిరి హరీశ్, త్రిపురారం

426
Tags

More News