సాగు సూచనలు

Thu,June 20, 2019 12:20 AM

ప్రస్తుతం వర్షాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రైతులు శాస్త్రవేత్తల సూచనలు, వారు చెప్పే ప్రత్యామ్నాయాలను దృష్టిలో పెట్టుకుని సాగు చేయాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు చేయాల్సిన పనులు:

ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రుతుపవన వర్షాలు కావు. కాబట్టి వీటి ఆధారంగా వర్షాధార పంటలు వేసుకోరాదు. పంటలు విత్తుకోవటానికి కచ్చితంగాలోతు దుక్కులు చేసుకోవాలి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరవాత మాత్రమే తేలికపాటి నేలల్లో 50-60 మి.మీ. బరువు నేలల్లో 60-75 మి.మీ. వర్షపాతం నమోదైన తర్వాత లేదా నేల 15-20 సెం.మీ లోతు భూమి తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలు వేయాలి. సోయాచిక్కుడు, మక్కజొన్న, జొన్న, కంది, పెసర, పత్తి మొదలగు పంటలను వేసుకోవచ్చు. వరిసాగు చేయాల నుకున్న పొలాల్లో మాత్రం తొలకరి వర్షాలను ఉపయోగించుకొని పచ్చిరొట్ట పంటలైన జను ము, జీలుగలను ముందస్తుగా సాగు చేయాలి. అలాగే నీరు ఆలస్యంగా విడుదలయ్యే ప్రాంతం లో పెసరను ప్రధాన పంటగా లేదా పచ్చిరొట్టగా వేసుకోవచ్చు.

కొన్ని పంటల్లో కొంత సమయం దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నాటుకోరాదు. పెసర, జొన్న లను జూన్ 30 వరకు, మొక్కజొన్న, పత్తి, సోయాచిక్కుడులను జూలై 15 వరకు, కంది జూలై 31 వరకు, ఆముదం ఆగస్ట్ 15 వరకు నాటుకోవడం పూర్తి చేయాలి. ఆ తర్వాత విత్తుకుంటే దిగుబడులు గణనీయంగా తగ్గిపోతాయి.

సోయ సాగు...

సోయాచిక్కుడు తేలికనేలల్లో సాగు చేయకూడదు. విత్తనాల్ని బోదెలు, సాళ్ల పద్ధతిలో విత్తుకోవడం మేలు. వర్షాభావ పరిస్థితులున్నప్పుడు 1-2 తడులు కచ్చితంగా ఇవ్వాలి. దీంతో దిగుబడులు పెరుగుతాయి. ఒకే పంటకు బదులు అంతర పంటగా సోయ పంట సాగు చేస్తే దిగుబడులు బాగుంటాయి. సోయా చిక్కుడును కంది (ఒక వరుస సోయ 7 వరుసలు కంది) పత్తి (ఒక వరుస సోయ, ఒక వరుస పత్తి) జొన్న, మక్కజొన్న (ఒక వరుస సోయ, మూడు వరుసల్లో జొన్న లేదా మక్కజొన్న) పంటల్లో సోయాను అంతరపంటగా సాగు చేయవచ్చు.
Karnataka

మక్కజొన్న సాగు

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో సారవంతంకాని, తేలిక నేలల్ని మక్క జొన్న సాగుకు ఎన్నుకోరాదు. నేలలు తరుచుగా బెట్టకు గురయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి మధ్యకాలిక ఏకసంకర రకాలైన డీహెచ్ ఎం 117, కరీంనగర్ మక్క -1 మాత్రమే సాగు చేసుకోవాలి. మక్కజొన్నలో అంతరపంటగా తక్కువకాల పరిమితి గల కంది రకాలైన పీఆర్‌జీ -176, డబ్లూఆర్‌జీ -967 లేక మారుతి లాంటి రకాలను 2:1 (తేలిక నేలలు)లేదా 4:1 బరువునేలల్లో సాగుచేసు కోవాలి. కత్తెరపురుగు మక్కజొన్నను ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి నాలుగు లింగాకర్షక బుట్టల్ని అమర్చి పురుగు ఉనికిని గమనించాలి. పొలంలో గుడ్లు, మొదటి దశ పురుగుల్ని నివారించడానికి వేప సంబంధిత అజాడిరక్టిన్ 15 పీపీఎం లీటరు నీటికి 5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ లీటరు నీటికి 0.4 మి.లీ. కలిపి పిచికారీ చేయాలి.
cotton-farming

పత్తి సాగు..

పత్తిలో వర్షాధారంగా అయితే మధ్యస్థ కాయ పరిమాణం కల బీటీ సంకర రకాలను, నీటిపారుదల కింద అయితే పెద్దకాయ పరిమాణం గల సంకర రకాలను సాగు చేయాలి. జూన్ 30 వరకు విత్తనం నాటడం పూర్తి చేయాలి. నల్లరేగడి నేలల్లో అయితే 120X45 సెం.మీ లేదా 90X60 సెం.మీ. తేలికపాటి నేలల్లో అయితే 90X45 సెం.మీ లేదా 90X30 సెం.మీ మధ్య దూరం ఉండేలా చూసుకోవాలి.

495
Tags

More News