వానకాలం వరి సాగు రకాలు

Thu,June 20, 2019 12:25 AM

Rythu-Badi
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలలోని వివిధ వరి పరిశోధనా స్థానాలలో రూపకల్పన చేయబడి పరిశీలన దశ లో ఉన్న వరి విత్తనాలతో పాటు కొన్ని విడుదలైన రకాలను కూడా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని గడ్డిపల్లిలో గల కృషి విజ్ఙాన కేంద్రంలో సాగు చేస్తున్నా రు. ఇక్కడ సాగు చేయబడుతున్న నూతన వంగడాల గురించి రైతులకు అవగాహన కల్పించేందుకు కేవీకే శాస్త్రవేత్త టి.యాదగిరిరెడ్డి వాటిలోని రకాలు, గుణగణాలకు సంబంధించిన వివరాలను అందించారు. మరింత అదనపు సమాచారం కోసం 9440481279 నెంబర్‌ను సంప్రదించవచ్చు. నూతన వంగడాలకు సంబందించి ఆయన అందించిన వివరాలు..

జేజీఎల్ 18047: ఈ రకాన్ని వానకాలం, యాసంగి పంటలుగా సాగు చేయడానికి అనుకూలం. దీని పంటకాలం 120 రోజులు. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది. కోత సమయంలో గింజ రాలడం 1010తో పోల్చితే తక్కువ. దీన్ని సాధారణంగా బతుకమ్మ రకం అంటారు.

కెఎన్‌ఎమ్ 118: దీన్ని వానకాలం, యాసంగిలలో సాగు చేయవచ్చు. దీని పంట కాలం 120-125 రోజులు. అగ్గి తెగులును తట్టుకుంటుంది. సన్నరకం, గింజ పొడవు. కోత సమయంలో గింజ రాలడం తక్కువ. దీన్ని కూనా రం సన్నాలు అనే పేరుతో పిలుస్తారు.

డబ్ల్యూజిఎల్ 347: ఈ రకం కూడా వానకాలం, యాసంగిలలో సాగు చేయవచ్చు. పంటకాలం 125-130 రోజులు. చలిని తట్టుకునే స్వభావం కలిగిన సన్నరకం. దీన్ని సోమనాథ్ అనే పేరుతో పిలుస్తుంటారు.
డబ్ల్యూజిఎల్ 505: ఈ రకాన్ని రెండు సీజన్‌లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఉల్లికోడును తట్టుకోగల సన్నరకం.
బీపీటీ 2615: ఇది రెండు సీజన్లలో సాగు చేసుకోవచ్చు. పంటకాలం 120 రోజులు. సుడిదోమను తట్టుకోగల సన్నరకం.
ఆర్‌ఎన్‌ఆర్ 2458: దీన్ని వానకాలం పంటగా సాగు చేసేందుకు అనుకూలం. పంటకాలం 135 రోజులు. అగ్గితెగులుకు తట్టుకునే సన్నరకం. దీనికి కృష్ణ పేరు పెట్టారు.
ఆర్‌ఎన్‌ఆర్ 15038: వానకాలం పంటగా సాగు చేసుకోవచ్చు. పంట కాలం 125 రోజులు. ఇది సన్నరకం.
ఆర్‌ఎన్‌ఆర్15048: దీన్ని వానకాలం పంటగా అయితే ఆలస్యంగాను, యాసంగి పంటగాను సాగు చేసుకోవ చ్చు. పంటకాలం 120-125 రోజులు. ఇది అగ్గితెగులును తట్టుకునే రకం. ఇతర చీడపీడల సమస్య కూడా తక్కువ. తెలంగాణ సోన అని పేరు పెట్టారు. ఈ రకం లో ైగ్లెసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులకు ఈ రకం బియ్యం చాలా అనుకూలం.
Rythu-Badi1
ఆర్‌ఎన్‌ఆర్11718: ఈ రకం మూడవ సంవత్సరం చిరు సంచుల దశలో ఉన్నది. మధ్యస్థ గింజ రకం. వివి ధ చీడపీడలను తట్టుకోవడంతో పాటు చౌడు నేలల్లో కూడా అధిక దిగుబడులు ఇచ్చే రకం.
ఆర్‌ఎన్‌ఆర్ 93 ఆర్: ఇది సన్నగింజ రకం. పంటకాలం 125 రోజులు. కాండం తొలుచు పురుగులు, అగ్గితెగులును తట్టుకొంటుంది. దీనిలో వెన్ను విరుగుడు చాలా తక్కువ. జూలై చివరిలో నాటుకోవాలి.
జేజీఎల్ 1118: ఈ రకాన్ని రెండు సీజన్‌లలోనూ సాగుచేసుకోవచ్చు. పంటకాలం 120-125 రోజులు. ఇది ఉల్లికోడును తట్టుకుంటుంది. సన్నరకం. ఆలస్యంగా నాటుకోవడానికి అనువైనది.
జేజీఎల్ 11727: వానకాలం, యాసంగిలలో సాగు చేసుకునేందుకు అనువైన రకం. పంటకాలం 135 రోజులు. ఇది ఉల్లికోడు, అగ్గితెగులు, ఎండాకు తెగులు ను తట్టుకునే సన్నరకం.
డబ్ల్యూజీఎల్ 283: ఇది యాసంగి పంటగా సాగు చేసుకునేందుకు అనువైన రకం. పంటకాలం 125 రోజులు. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది. సుడిదోమను, చలిని తట్టుకుంటుంది.
డబ్ల్యూజీఎల్ 32100: ఇది వానకాలంగా పంటగా సాగు చేసేందుకు అనువైన సన్నరకం. పంటకాలం 135 రోజులు. దీన్ని సాధారణంగా వరంగల్ సన్నాలు అంటారు.
డబ్ల్యూజీఎల్ 3912: ఇది వానకాలం పంటగా సాగు చేసేందుకు అనుకూలం. పంటకాలం 135 రోజులు. ఉల్లికోడును తట్టుకుంటుంది. గింజ సన్నగా, పొడవుగా ఉంటుంది.
డబ్ల్యూజీఎల్ 44: ఇది వానకాలానికి అనుకూలం. పంటకాలం 140 రోజులు. ఉల్లికోడును తట్టుకుంటుం ది. గింజ మధ్యస్థ రకం. చేను మీద పడిపోదు.
డబ్ల్యూజిఎల్ 14: ఇది కూడా వానకాలానికి అనుకూ లం. పంటకాలం 135 రోజులు. బ్యాక్టీరియా, ఎండాకు తెగులును తట్టుకునే సన్నరకం.

గమనిక: ఆర్‌ఎన్‌ఆర్ ఆంటే రాజేంద్రనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానమని, డబ్ల్యూజిఎల్ అంటే వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానమని, జేజీఎల్ అంటే జగిత్యాల వ్యవసాయ పరిశోధనా స్థానమని, కెఎన్‌ఎమ్ అంటే కూనారం వ్యవసాయ పరిశోధనా స్థానమని, బీపీటీ అంటే బాపట్ల పరిశోధనా కేంద్రంలో విడుదల చేసిన వంగడాలు అని రైతులు అర్థం చేసుకోవాలి.

నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945
గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా,

615
Tags

More News