నగరవాసుల సమస్యలకు సమాధానం ఈ శాంతివనం

Thu,June 27, 2019 12:16 AM

ఇంటి పంట
ఇంటా బయటా..లోపలా వెలుపలా అనుక్షణం పోరాటమే.. కాలరేఖ కనుచూపుమేరా జీవన అస్తిత్వ తీరాన ఆహారం కోసం, ఆవాసం కోసం ఆరోగ్యం కోసం, కాసింత ఆనందం కోసం అనంత కాలంగా, అవిరామంగా జరుగుతున్న సమరం. ఈ నిరంతర సంగ్రామంలో ఆధునిక జీవన సంఘర్షణలో అక్కడక్కడా చిన్న చిన్న ఆశలు ఎండిన మోడుల్ని చిగురించే ఆకుపచ్చ స్వప్నాలు. అలాంటి అనుభూతుల ఆనవాళ్లే మనకు భాగ్యనగరంలోని బోడుప్పల్‌లో కనిపిస్తాయి.
shanthi-vanam

శాంతి ధీరజ్..
పేర్లకు వేరైనా ఒకటిగా కలిసే, ఒక్కటిగా పలికే ముచ్చటైన జంట. వాళ్ల మిద్దెతోటకు మల్లే.. 1350 చదరపు అడుగుల్లో నిర్మించుకున్న వీళ్ల మిద్దెతోటను చూసి ఒక్కక్షణం ఆశ్యర్యపోయాను. ఎంతకాలమైందీ అంటే..కేవలం పదినెలలే అన్నారు. నిజమా..సాధ్యమా..అనిపిస్తుంది. నారపల్లిలోని మిద్దెతోట రైతు తుమ్మేటి రఘోత్తమరెడ్డి గారి స్ఫూర్తి తో తమ ఈ దంపతులు తమ ఇంటిపై మిద్దెతోట మొదలుపెట్టారు. మొదట వాడిపారేసిన కూలర్ టబ్బులు, 20 లీటర్ల వాటర్ క్యాన్ లు, 5 లీటర్ల ఆయిల్ క్యాన్‌లు, థర్మాకోల్ డబ్బాలు, పాత సూట్‌కేస్‌లతో మిద్దెతోట మొదలుపెట్టారు. మామిడి, దానిమ్మ, అంజీర్, సపోటా, జామ వంటి పండ్ల మొక్కలకు సిమెంట్ కుండీలు వాడుతున్నారు. సిమెంట్ టబ్స్‌లో (2.5X 2X 8) తీగజాతి కూరగాయ మొక్కలు (పప్పు దోస, బీర, నేతి బీర, బచ్చలి), దానిచుట్టూ మిరప వాటికింద ఆకుకూరలు పెంచుతున్నారు. వేప, అరటి, మునగ మొక్కలకు గ్రోబ్యాగ్స్ (12X 12 ఇంచులు) వాడుతున్నారు. 8 ఇంచుల లోతు ఉన్న సిమెంటు కుండీలో గోరుచిక్కుడు 7 అడుగులు పెరిగింది. గోడ నుంచి 3 అడుగుల పొడవు ఉండే కర్టెన్ రాడ్స్‌ను 2 అడుగుల చొప్పున నాటుకుని, అడ్డంగా ఇన్సులేటెడ్ జి.ఐ వైర్‌ను (బట్టలు ఆరవేసే తీగ) అడుగు దూరానికి ఒకటి 3 వరుసలుగా కట్టా రు. ఈ అడ్డు వైర్లకు నిలువుగా కొబ్బరితాళ్లు కట్టారు. ఈ వర్టికల్ పందిరిలకు దోస, బీర తీగలు పాకించారు. దీనివల్ల స్పేస్ యుటిలైజేషన్ జరుగుతుంది కదా అంటారు. అయితే ఇక్కడ ఒకే కుండీలో ఒకే మొక్క పెంచకుండా,రకరకాల మొక్కలు పెంచుతున్నారు.

మునగ కుండీలో తోటకూర, మిర్చి, ప్యాషన్ ఫ్రూట్ నాటిన టబ్‌లోనే ఉల్లి, మామిడిలో తోటకూర, సపోటా టబ్‌లో నేతి బీర, జీడిమామిడిలో తీగబచ్చలి, టమాటా, వంగ, తోటకూర ఒకే కుండీలో పెంచుతున్నారు. నిమ్మ కుండీలో గంగవాయిలి వేశారు. ఎటుచూసినా కుండీలలో గుత్తులుగుత్తులుగా ఆకుకూరలు, కూరగాయలు.. బయట కొనే పనే లేదు. చిన్న టబ్‌లో గోంగూర వేస్తే విపరీతంగా వచ్చింది. తెల్లవంగ గుత్తులుగుత్తులుగా కాస్తున్నాయి. మిద్దెతోటలో పండ్లమొక్కలు ఎత్తుగా పెరగకుండా,చిన్నసైజులో కాయడానికి అనువైన ఎన్నో మొక్కలను (బోన్సాయ్) పెంచుతున్నారు. ఇందుకు మొదటగా నర్సరీ నుంచి పండ్ల మొక్క తెచ్చి, తరువాత 3-4 రోజుల తరువాత నీటిలో ముంచి మట్టిని తొలిగించి, తల్లి వేరును పూర్తిగా కత్తిరించి,ఆ భాగంలో తెగుళ్లు సోకకుండా దాల్చిన చెక్క పౌడర్‌ను అద్దాలంటారు. తరువాత 1X 1X 1 కంటెయినర్‌లో నాటి 3 రోజులపాటు నీడలో ఉంచి తరువాత 3 రోజులపాటు సెమి షేడ్, ఆ తరువాత పూర్తిగా ఎండలోకి తీసుకరావాలి. ఈ రకంగా మార్పు చేసిన మొక్కలు తక్కువ ఎత్తులోనే కాయలు కాస్తాయన్నది వీరి అనుభవం. గులాబీ రంగు,తెలుపు రంగు మొక్కలను గ్రాఫ్టింగ్ చేసి, ఒకే మొక్కకు తెలు పు, గులాబీ, తెలుపు గులాబీ కలగలిసిన రంగు పూలు పూయిస్తున్నారు. మరి ఎరువు సంగతి ఏమిటంటే..? రెండు వంతుల ఎర్రమట్టి, రెండు వంతుల పశువుల ఎరువు, ఒక వంతు ఇసుక లేదా ధాన్యంపొట్టు లేదా రంపపుపొట్టు (2: 2: 1) చొప్పున వాడాము. ఐతే, ఎరువు ఘనరూపంలో వాడితే కంటెయినర్స్ నిండిపోతాయి. ద్రవరూపంలో మొక్కలకు కూడా మంచిదంటారు.

shanthi-vanam2
1 కేజీ మాగిన పశువుల ఎరువును 4 లీటర్ల నీటిలో 48 గంటలపాటు నానబెట్టి దానికి 1:5 నీరు కలిపి చిన్న మొక్కకు 50 ఎం.ఎల్, పెద్ద మొక్క 250 ఎం.ఎల్, సాయంత్రం పూట నీళ్లు పోసిన తరువాత దీనిని మొక్క ల మొదళ్లలో పోస్తున్నారు. ఇక తోటలోంచి వచ్చిన ఎండుటాకుల మీద మట్టి వేసి దానిని కుళ్లబెడుతున్నారు. దీనివల్ల ప్రతిసారీ కుండీల్లో మట్టి వాడాల్సిన అవసరం లేదంటారు. అసలు మొదట కలుపుకున్న మట్టి, ఎరువు మిశ్రమం బలమే మొదటి 7-8 నెలలు సరిపోతుందని వీళ్ల అభిప్రాయం. కొన్ని కుండీలలో వేప ఆకులు, కాయ లు, బెరడు ఏది దొరికితే దానిని నిలువ చేసుకుని పాటింగ్ మిక్స్‌లో కలుపుకుంటే తెగుళ్ల నియంత్రణ చేయవచ్చని అన్నారు. మరి మీ మిద్దెతోటకు చీడపీడల సమస్యలేమీ లేవా అంటే, ఎందు కు లేవూ..ఐతే, దీనికి చేతిని మించిన సాధనం లేదు. ఎక్కువగా మిద్దెతోటలపై 5రకాల చీడసమస్యలు ఎదురవుతుంటా యి. ప్రారంభ దశలోని ఏ చీడనైనా చేతితో నివారించుకోవచ్చు. మరీ సమస్య తీవ్రమైనపుడు, నల్లపేనుకు 1లీటర్ నీటికి 10 ఎం.ఎల్. వేపనూనె కలిపి పిచికారీ పిండినల్లికి 1లీటర్ నీటిలో 10ఎం.ఎల్.

కుంకుడు కాయ రసం కలిపి పిచికారీ, పాముపొడకు 1లీటర్ నీటికి 10ఎం.ఎల్. ఆవు మూత్రం పిచికారీ చేసుకోవాలి. వ్యాధి తీవ్రతను బట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేయాలి. పండుదోమకు ఎల్లో ట్రాపర్స్ (గ్రీజు పూసిన ఎల్లో ప్లాస్టిక్ షీట్స్ ) పెట్టుకోవాలి. వేరు తొలిచే పురుగు సమస్యకు కుండీల్లో మట్టి ఎరువు, రంపపు పొట్టు వేసుకున్నపుడే వేపపిండి, పిడికెడు నుంచి 100 గ్రాముల వరకు కుండీల సైజును బట్టి కలుపుకోవాల ని తమ మిద్దెతోట అనుభవాలను వివరించారు. కొద్దిసమయంలోనే చాలా అనుభవాల్ని ఒడిసిపట్టిన వీరు కొత్తగా మిద్దెతోట చేసేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు. ఐతే, ఒకే మొక్కను మిద్దెతోటలో పండించడానికీ, నేల మీద సాగు చేయడానికీ మధ్య కొంచెం తేడా ఉంటుందనే విషయం ప్రధానంగా గుర్తించాలంటారు.

-ఇళ్లు కట్టేటపుడే సిమెంట్, ఇసుక మిశ్రమంలో వాటర్ ప్రూఫ్ లిక్విడ్ కలుపాలి. దీనివల్ల నీరు నిలిచినా మిద్దెకు ఎలాంటి సమ స్య రాదు.
-వాటర్‌ట్యాంక్‌లకు వ్యతిరేక దిశ నుంచి కుండీలు ఎక్కువ పెట్టుకుంటూ రావాలి. దీనివల్ల మిద్దెమీద బరువును సులువుగా మేనేజ్ చేయవచ్చు.
-కంటెయినర్ నిండా ఎరువు, మట్టి మిశ్రమం నింపకూడదు. పైన 2 ఇంచుల గ్యాప్ ఉంచాలి. దీనివల్ల పోసిన నీరు బయటకు రాదు.
-కంటెయినర్‌కు అడుగు భాగంలో రంధ్రం ఉండాలి. ఎండిన ఆకులుగానీ, పెంకుగానీ పెట్టడం వల్ల ఎక్కువైన నీరు సులభంగా బయటకు పోతుంది.
-కంటెయినర్స్‌కు, మిద్దెకు మధ్య కొంత గ్యాప్ ఉండాలి. దీనివల్ల కింద నీరు నిలువదు. అలా లేకపోతే కింద నీరు నిలువ ఉండి స్లాబ్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉన్నది.
-గార్డెన్ అంతా ఒకేసారి నాటకూడదు. ఎప్పుడూ ఒక 25 శాతం కుండీ లు ఖాళీగా ఉంచాలి. ఒక పంట కోసుకునే సమయంలో అదే మొక్కలు ఖాళీ కుండీల్లో తిరిగి నాటుకోవాలి. దీనివల్ల సంవత్సరం పొడవునా అన్నిరకాల కూరగాయలు మనకు అందుబాటులో ఉంటాయి.
-మిద్దెతోటలలో పాలినేషన్ కోసం పొద్దుతిరుగుడు, ఆవాలు, బంతి వంటి పసుపు పచ్చని మొక్కలు నాటాలి
-మొక్కకు ఎప్పుడూ సాయంత్రం నాటుకోవాలి. దీనివల్ల రాత్రంతా అది చల్లగా ఉండి కోలుకునే అవకాశం ఉంటుం ది.
-తేమ ఉన్నప్పుడు నీళ్లు అవసరం లేదు. తేమ లేకపోతే నీరు కచ్చితంగా పోయాలి. ఆకు వడబడితే నీళ్లు వెంటనే అందించాలి. నీరు ఎక్కువైతే వేరు కుళ్లిపయి మొక్క వెంటనే చచ్చిపోతుంది.
-మొక్కలకు సాయంత్రం వేళల్లో నీరు పెట్టడం మంచిది.
-నేతిబీర, అంజీర్, గోంగూర, మునగకు ఉదయం, సాయంత్రం నీళ్లు పోయాలి. వీటికి ఎక్కువ నీరు అవసరం.
-ప్రతి నాలుగు నెలలకు ఒకసారి కూరగాయల నార్లు పోసుకోవాలి.
-కూరగాయలు, తీగజాతి ఒక్కొక్క రకం కనీసం 30 విత్తనాలు పెట్టుకుంటే కనీసం 15 మొక్కలు బతుకుతాయి. కొన్ని ఎక్కువ కాసినా మరికొన్ని తక్కువ కాసినా ఒకరోజు ఇంటికి సరిపోయే ఉత్పత్తి వస్తుంది.
-ఎండాకాలం చివరలో పెద్ద చెట్లకింద నారు పోసుకోవచ్చు. దీనివల్ల మొలకశాతం రాదనే సమస్య ఉండదు.
మిద్దెతోటలో రకరకాల టెర్రాకోట బొమ్మలు, ముఖ్యంగా కుండలు ఎత్తుకున్న స్త్రీల బొమ్మలు పెట్టుకుంటే, వాటిలో నీరు, -విత్తనాలు వేస్తే పక్షులు వస్తాయి. దీనివల్ల పురుగుల సమస్య తగ్గుతుంది.
-మరువం ఆకులకు ఎండ తగలాలిగానీ, కాండానికి కాదు. అందుకే దీన్ని పెద్ద మొక్కల మధ్య నాటుకోవాలి. -కలుపు మొక్క కూడా దేవు డు కావాలనే సృష్టించాడనిపిస్తుంది. ఎందుకంటే కలుపు పీకితే అక్కడ నేల గుళ్లబారుతుంది. దీనివల్ల మొక్కవేరుకు గాలిప్రసారం జరుగుతుంది. చివరగా,వచ్చేతరం ఆరోగ్యం. ఆనందం లక్ష్యంగా ఇంటిపంటల ఉద్యమం ముందుకు సాగాలి అనేదే మా అభిమతం అంటారు ఈ మొక్కల ప్రేమికులు.
కె.క్రాంతికుమార్‌రెడ్డి, 9603214455 నేచర్స్‌వాయిస్

shanthi-vanam3

శాంతి ధీరజ్ మిద్దె మీద ఒదిగినమొక్కలు

కూరగాయలు: టమాట,వంకాయ (నలుపు,తెలుపు)బెండ (2 రకాలు),గోరుచిక్కుడు,చెట్టు చెమ్మ,చెట్టు చిక్కుడు,మిరప, కాప్సికం,బజ్జి మిర్చి, మునగ

ఆకుకూరలు: పాలకూర,తోటకూర (ఆకుపచ్చ,ఎరుపు,పెరుగు తోటకూర), కోడిజుట్టుకూర, పుదీనా, పొన్నగంటి కూర, ఎర్రబచ్చలి, పచ్చ బచ్చలి, గంగవావిలి, గోంగూర, ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు, కరివేపాకు

పండ్ల మొక్కలు: యాపిల్, మామిడి, దబ్బ నిమ్మ, దానిమ్మ, డ్రాగన్‌ఫూట్, అంజీర్, స్టార్‌యాపిల్, సపోటా, జామ, తైవాన్ జామ, బొప్పాయి,అరటి (అమృతపాణి), ఆరెంజ్ ,అల్ల నేరే డు, ప్యాషన్ ఫ్రూట్(ఎరుపు,పర్పుల్),జీడి మామిడి,పెద్ద ఉసి రి, సీతాఫలం, మల్చరీ (బొంత పళ్లు), పైన్ యాపిల్, వాటర్ యాపిల్,ఆపిల్ బేర్, ద్రాక్ష( పచ్చ,ఎరుపు)

పూల మొక్కలు: కనకాంబరం (3రకాలు), కాగితం పూలు (బోగన్ విల్లియా),పొద్దుతిరుగుడు (చిన్నవి), గులాబీ (5- 6 రకాలు), సన్నజాజి, మందార, మల్లె,కాస్మోస్,అల్మండా (2రకాలు),టేబుల్ రోజెస్,లావెండర్ బెల్స్,డయాంధస్, బ్రహ్మ కమలం, బంతి, యావ్‌ు రిల్లీస్, రాధా మనోహరం

దుంపజాతులు: ఉల్లి,చేమ,పసుపు (ముద్ద పసుపు,కస్తూరి పసుపు)

తీగజాతులు: దొండ,కాకర,బీర,నేతి బీర,చెమ్మ కాయ,పప్పు దోస,అలసంద

ఔషధ మొక్కలు: కలబంద, తులసి, కర్పూర తులసి, సబ్జ, నిమ్మ గడ్డి, వాము, తిప్ప తీగ, తెల్ల వీసర

సుగంధ ద్రవ్య మొక్కలు: బిరియాని ఆకు, మిరియాలు, యాలకులు

బోన్సాయ్ మొక్కలు: సపోటా,సలాడ్ నిమ్మ,అంజీర్, జువ్వి, అడేనియవ్‌ు,దానిమ్మ ఆక్సిజన్‌ను ఎక్కువగా అందించే మొక్క లు స్పైడర్ ప్లాంట్,స్నేక్ ప్లాంట్,రబ్బర్,డౌస్,జడ్ జడ్ ప్లాంట్, ఫైకస్, పీస్ లిల్లీ,రెడ్ పోయన్,గ్రౌండ్ ఆర్కిడ్, సెటియా, మనీ ప్లాంట్ (3రకాలు), డ్రాగన్ ప్లాంట్, జేడ్, ఫైకస్, అగ్లోనియం, రెడ్ లిప్‌స్టిక్,కోలియస్ వీటితోపాటు కంది,బేబీకార్న్ వంటి పంటలు, వేప, జువ్వి వంటి మహావృక్షాలు,తమలపాకు వంటి వి ఇక్కడ పెరుగుతున్నాయి.

-ఇతర వివరాలకు.. వెంకటకృష్ణను సంప్రదించాల్సిన 98667 51439

676
Tags

More News