గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు

Thu,July 4, 2019 01:14 AM

పశువులు, గొర్రెలు, మేకలు, పందులు మొదలైన చీలుగిట్టలుండే జంతువుల్లో సంక్రమించే వ్యాధుల్లో గాలికుంటు వ్యాధి ముఖ్యమైంది. ఈ వ్యాధి సూక్ష్మమైన ఆఫ్తో వైరస్ వల్ల పశువులకు సోకుతుంది. గాలి, ఇతర మార్గాల ద్వారా అతివేగంగా ఇతర పశువులకు వ్యాపించే అంటువ్యాధి.
disease
ఈవ్యాధి సోకడం వల్ల మరణాల తక్కువగా ఉంటుంది. అయినప్పటికీ పశువుల్లో ఉత్పాద క శక్తి తగ్గి తీవ్రమైన ఆర్థిక నష్టం కలుగుతుం ది. జబ్బు సోకిన పశువుల పాలు తాగి దూడ లు మరణిస్తాయి. ఈ వ్యాధి నివారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 5వ తేదీ నుంచి 22 వరకు నివారణ టీకాలు వేయించాలని పశు సంవర్ధక శాఖా మంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

వ్యాధి వ్యాప్తి: సాధారణంగా వ్యాధి సోకిన పశువులు ఆరోగ్యవంతమైన పశువుల దగ్గరగా ఉండటం వల్ల వ్యాధి వ్యాప్తికి కారణమౌతా యి. ముఖ్యంగా వ్యాధి సోకిన పశువుల ముక్కు ద్వారా బైటకు వదిలే గాలిలో ఎక్కువ మొత్తంలో వాయురూపంలో వైరస్ ఉంటుం ది. ఈ గాలిని ఆరోగ్యవంతమైన పశువులు నోటి ద్వారా, ముక్కు ద్వారా పీల్చినప్పుడు వ్యాధి సంక్రమణకు కారణమవుతుంది.

అంతేగాకుండా వ్యాధి సోకిన పశువుల నుంచి విడుదలయ్యే అంతస్రావాలలో వైరస్‌ను కలిగి ఉండి వ్యాధికి గురవుతాయి. అలాగే వ్యాధి లక్షణాలు కనబడే నాలుగు రోజుల ముందు వరకు పాలలోనూ వైరస్ ఉంటుంది. వాయురూపమైన వైరస్ వాతావరణ పరిస్థితులపై ఆధారపడి వ్యాధి వ్యాప్తి ఉంటుంది. కానీ పాల ద్వారా దూడలకు, పాల ట్యాంకుల ద్వారా వేరే పశువుల శాలకు వ్యాధి వ్యాప్తి జరుగుతుంది. అలాగే వ్యాధి సోకిన పశులు తిన్న గడ్డి ద్వారా, వైద్య పరీక్షల ద్వారా వ్యవసాయ పనిముట్ల ద్వారా కూడా వ్యాధి వ్యాప్తి జరుగుతుంది.

వ్యాధి లక్షణాలు: శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీల ఫారన్ హీట్ వరకు ఉంటుంది. నోటిలో చర్మపు పొరలు, పండ్ల చిగుళ్లు, నాలు క, ముట్టెలోపలి ప్రాంతాల్లో, బొబ్బలు ఏర్పడుతాయి. అవి 24 గంటల్లో చితికిపోవడం వల్ల పశువులు నొప్పి వల్ల మేత తినవు. నోటి నుంచి విపరీతమైన చొంగ, నురుగులు కారుస్తుంది. గిట్టల మధ్య, గిట్టపైన వలయంగా ఉండే ప్రాంతంలో బొబ్బలు ఏర్పడి, చితికి, నొప్పితో నడువలేక కుంటుపడుతాయి. అలాగే పాలిచ్చే పశువులు, చనుమొనలపై బొబ్బలు ఏర్పడి పొదుగు వాపు కూడా సంభవిస్తుంది.

నివారణ: గాలి కుంటు వ్యాధికి చికిత్స లేదు. నివారణ మార్గాలపై శ్రద్ధ వహించాలి. గాలికుం టు వ్యాధి టీకాలు మొదటిసారి 2 నెలల వయస్సులో, బూస్టర్ డోసు నెల తర్వాత చేయించా లి. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒకసారి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. టీకాలు వేసి న తర్వాత 2-3 వారాల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది ఏడాది కాలమంతా పనిచేస్తుంది. వ్యాధిగ్రస్త పశువుల నోటి చొంగలో వైరస్ అధిక శాతం ఉండి మేత, దాణా, నీరులో సంవత్సరం వరకు దాగి ఉండి అనుకూల పరిస్థితుల్లో వ్యాధిని కలుగజేస్తాయి. అందువల్ల పశువుల శాలలను సాధారణ క్రిమిసంహారక మందులతో కాకుండా సోడియం హైడ్రాక్సైడ్, 2 శాతం ఫార్మాలిన్, 4 శాతం సోడియం కార్బోనేట్ వంటి మందులతో శుభ్రం చేయ డం వల్ల వైరస్ నశిస్తుంది.

వ్యాధి చికిత్స:

వ్యాధి సోకిన పశువులను వేరుచేసి సత్వ ర చికిత్స చేయించాలి. నోటిలోని పుండ్ల ను పొటాషియం పర్మాంగనేటు నీళ్లలో శుభ్రం చేసి, వాటికి బోరోగ్లిజరిన్, యాంటిసెంప్టిక్ ఆయింట్‌మెంట్ పూత పూ యాలి. అలాగే కాలి పుండ్లకు జింక్ ఆక్సైడ్, లోరాక్సిన్, హిమాక్స్ వంటి ఆయింట్‌మెంట్ పూతగా పూయాలి. ఈగలు వాలకుండా వేపనూనె, లినమెంట్ వంటి వాటిని వాడాలి. అలాగే నోటిలోని చిగుర్లు, పుండ్ల మీద పొరలు అభివృద్ధికి విటమిన్ సీ కలిగి ఉండే పౌడర్ ఆప్థోకేర్ వంటి వాటిని వాడాలి.
dr-katam-sridhar

567
Tags

More News