మధ్య, స్వల్పకాలిక రకాలు మంచిది

Wed,July 10, 2019 11:58 PM

damini-improved-paddy
ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి రుతుపవనాల వల్ల రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. రైతులు వరి సాగును ముమ్మరం చేస్తున్నారు. వాతావరణ శాఖ ముందస్తు అంచనాల మేరకు ఈ ఏడాది వానలు కొంతమేరకు తగ్గే అవకాశం ఉన్నది. కాబట్టి మధ్యకాలిక (135 రోజులు), స్వల్పకాలిక (115-120 రోజులు) రకాలను సాగు చేయాలి.

-మధ్య కాలిక రకాలను రాష్ట్రంలో జూలై 15 వరకు నార్లు పోసుకోవచ్చు. ఒకవేళ జూలై 15 తర్వాత కూడా నార్లు పోయాలనుకుంటే స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం మంచిది.
-వానలు కొంతమేరకు ఆలస్యం అవ్వడం వల్ల దీర్ఘకాలిక రకాలను ముదురు నారుతో నాటువేసే బదులు అంతే దిగుబడినిచ్చే మధ్య, స్వల్ప కాలిక రకాలను జూలైలో నార్లు పోసుకొని ఆగస్టులో నాటు వేసుకోవడం మంచిది. రైతులు ముదురు నారును నాట్లు వేయాల్సిన పరిస్థితుల్లో మొక్కల మధ్య దూరం తగ్గించి దగ్గర దగ్గరగా కుదురుకు 4-5 మొక్కలతో నాట్లు వేసుకుంటే దిగుబడి తగ్గకుండా ఉంటుంది.
-మధ్యకాలిక సన్న గింజ రకాలైన (జేజీఎల్ 11470, జేజీఎల్ 384, జేజీఎల్ 11727, డబ్ల్యూజీఎల్ 14, డబ్ల్యూజీఎల్ 32100, డబ్ల్యూజీఎల్ 44, కృష్ణ, అలాగే స్వల్పకాలిక సన్నగింజ రకాలు (తెలంగాణ సోనా, జేజీఎల్ 3844, కేఎన్‌ఎం 733, జేజీఎల్ 11118, జేజీఎల్ 17004), దొడ్డుగింజ రకాలు (బతుకమ్మ, కేఎన్‌ఎం 118, జగిత్యాల రైస్1, వరంగల్ రైస్ 1, ఎంటీయూ 1010, ఐఆర్ 64) ముఖ్యమైనవి.
-ధృవీకరించిన సంస్థల నుంచి వరి విత్తనాలను సేకరించి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. తడి విత్తనశుద్ధికి కార్బండాజమ్ ఒక గ్రా, లీటరు నీటికి లేదా పొడి విత్తనశుద్ధికి 3 గ్రా, ఒక కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి.
-ప్రస్తుత పరిస్థితుల్లో నార్లు పోసి నాటుకోవడం మంచిది. ఒకవేళ కుదరని పరిస్థితుల్లో వెదజల్లే పద్ధతి లేదా డ్రమ్‌సీడర్ పద్ధతిలో విత్తుకొనే అవకాశం ఉన్నది. నాటు యంత్రాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలలో ట్రేలలో పద్ధతి లేదా పాలిథీన్ షీట్ మీద జూలై నెల ఆఖరి వరకు వరి నార్లు పోసుకోవచ్చు.
-నారు మడి తయారుచేసుకునే టప్పుడు దుక్కి బాగా చదును చేసుకోవాలి. పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. నీళ్లు పెట్టడానికి వీలుగా కాలువలు తయారుచేయాలి. చివరి దమ్ములో 5 సెంట్ల నారుమడికి 2.25 కిలోల యూరియా, 6.25 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 1.7 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
-నారుమడిలో ఊద, ఒడిపిలి వంటి గడ్డిజాతి కలుపు ఉన్నైట్లెయితే విత్తిన 15-20 రోజులకు సైహలోఫాప్-పి. బ్యూటైల్ అనే కలుపు మందును 1.5 మి.లీ. లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.
dr-m-v-ramana

350
Tags

More News