నానో త్రీడీ పరిజ్ఞానం ల్యూర్‌తో కత్తెర పురుగుకు అడ్డుకట్ట

Wed,July 24, 2019 10:36 PM

LURE
మక్కజొన్న పంటలో కత్తెరపురుగు, పత్తిలో గులాబీరంగు పురుగుల ఉనికి అంచనా వేయటానికి త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించిన ల్యూర్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే అందుబాటులో ఉన్న సాధారణ ఫిరమోన్ ట్రాప్‌ల (లింగాకర్షక బుట్టల)లో వాడే ల్యూర్‌లతో పోలిస్తే అనేక ఉపయోగాలున్నాయి. సాధారణ ల్యూర్‌లు రబ్బరుతో లేదా చెక్కలతో చేసి, తర్వాత వాటిని కృత్రిమ ఫిరమోన్ ద్రావణంలో ముంచి తయారుచేస్తారు. దీనివల్ల వాటి సామర్థ్యం 15-20 రోజుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత అవి మగ పురుగులను ఆశించలేవు. దీనికితోడు ఉష్ణోగ్రత హెచ్చు, తగ్గులతో ఫిరమోన్ ఎక్కువ లేదా తక్కువగా విడుదల అవుతుంది. అయితే వీటన్నింటిని అధిగమించే త్రీడీ పరిజ్ఞానం కత్తెర పురుగును సరిగ్గా అంచనా వేస్తుంది. ఇందులో ఔషధ పరిశ్రమలలో లాగా కచ్చిత మోతాదులో ఫిరమోన్‌ను వాడతారు. ఇది పౌడర్ రూపంలో ఉంటుంది. అట్లనే నానో పార్టికల్స్‌గా ఉండటం వల్ల సమానంగా, ఒకే మోతాదులో 60-70 రోజుల పాటు ఫిరమోన్ విడుదలవుతుంది. కాబట్టి ఒక పంట కాలం మొత్తానికి ఒకే ల్యూర్ సరిపోతుందని నిపుణులు అంటున్నారు. సాధారణ ల్యూర్‌ల లాగా ప్రతి 15-20 రోజులకు మార్చాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పురుగు ఉధృతిపై, అంచనాపై నిరంతర నిఘా ఉంటుంది. ఎకరాకు 8-10 లింగాకర్షక బుట్టలు సిఫారసు చేస్తున్నారు. అయితే ఎక్కువగా, నిరంతరంగా వాడితే అసలు మగ పురుగులే లేకుండా చేయవచ్చు. తద్వా రా ఆడ, మగ పురుగుల మధ్య సంపర్కం చెందకుండా చేసి, సంత తి అభివృద్ధిని పూర్తిగా అరికట్టవచ్చు. సాధారణ ల్యూర్‌లు సబ్సిడీ పై మార్కెట్‌లో 10-15 రూపాయలకు లభిస్తున్నాయి. త్రీడీ ల్యూర్‌లు రూ.60లకు అందుబాటులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
-మజ్జిగపు శ్రీనివాస్ రెడ్డి, 8096677036

ఎక్కువకాలం పనిచేస్తాయి

సాధారణ ఫిర్‌మోన్‌లలో వాడే ల్యూర్‌ల నుంచి రసాయనం విడుదలపై నియంత్ర ణ ఉండదు. కాబట్టి ఎక్కువ, తక్కువ ఫిర్‌మోన్ రసాయనం విడుదల ఉంటుంది. వీటిని అధిగమించే త్రీడీ ల్యూర్‌లను రైతులు, ప్రభుత్వాలు ఆదరిస్తున్నా యి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతులు ఇప్పటికే వివిధ పంటల్లో వినియోగిస్తున్నారు. 60-70 రోజులు పనిచేస్తుంది. మగ కత్తెర పురుగులను కచ్చితంగా ఈ త్రీడీ నానో ల్యూర్‌లు ఆకర్షిస్తున్నాయి. మక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబీ రంగు పురుగు, వంకాయలో కొమ్మ కాయతొలుచు పురుగు, టమాటాలో పిన్‌వాం వంటి పురుగులను ఈ పరిజ్ఞానంతో సమర్థవంతంగా నివారించవచ్చు.
-డాక్టర్ పురుషోత్తం దివాంగే, బెంగుళూరుకు చెందిన ఫిర్‌మోన్‌ల శాస్త్రవేత్త

రైతులకు సబ్సిడీ ఇవ్వాలి

గుజరాత్ నుంచి ఈ త్రీడీ ల్యూర్ ఉన్న లాంగాకర్షక బుట్టలు తెచ్చుకొని వాడాము. వంకాయ, టమాటాలలో వీటిని వినియోగించా. ఈ టెక్నాలజీతోనే పురుగులను అరికట్టగలిగాం. పురుగు మందులపై పెట్టే ఖర్చులు తగ్గాయి. సమ గ్ర సస్యరక్షణకు ఇది ఉపయోగకరం. ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై వీటిని అందించాలి. మక్కజొన్న, పత్తి పంటలలో నష్టనివారణ కోసం వీటిని వ్యవసా య, ఉద్యానశాఖ అధికారులు అందుబాటులోకి తేస్తే బాగుంటుది.
- వెలాది పురుషోత్తం రావు, సేంద్రియ రైతు

336
Tags

More News