నిమ్మలో నల్లదోమ నివారణ

Thu,August 22, 2019 01:15 AM

lemon
నిమ్మ తోటలో ఆగస్టు నుంచి మార్చి వరకు అంటే చిగు ర్లు వస్తాయి. ఈ దశలో నల్లదోమ ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తుంది. లక్షణాలు: నల్లరంగులో ఉన్న పిల్ల పురుగులు ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీనివల్ల ఆకులు ముడుచుకునిపోతాయి. నల్లదోమ విసర్జన నుంచి వచ్చే తేనె లాంటి పదార్థం ఆకులపై పడి శిలీంద్రాలు పెరుగుతా యి. దీనివల్ల నల్లటి బూజు ఏర్పడి, కిరణజన్య సంయోగక్రియ జరుగక చెట్లు క్షీణిస్తాయి. ఆకులు ముదరకముందే రాలిపోతాయి. నల్లదోమ ఆశించిన చెట్లలో పూత, కాయల పరిమాణం, నాణ్యత తగ్గిపోయి కాయలకు మార్కెట్లో ధర ఉండదు. నివారణ: చెట్లలోని ఎండు కొమ్మలను, నీటి కొమ్మలను కత్తిరించి మొక్కలకు బాగా గాలి తగిలేటట్లు చేయాలి. ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్‌ 2.5 మి.లీ. లేదా ఇమిడాక్లోప్రిడ్‌ 0.5 మి.లీ లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి ఆకుల అడుగుభాగం, పైభాగం బాగా తడిచేటట్లు పిచికారీ చేయాలి.

రైతుబడికి ఆహ్వానం

రైతు పంట పొలాలే జీవితంగా వ్యవసాయంలో రేయింబవళ్లు పనిచేస్తాడు. తమవైన అనుభవాలు, గుణపాఠాలతో మెరుగైన, మేలైన పంట విధానాల కు జీవం పోస్తాడు. ఇలాంటి అనుభవాలు పదిమందితో పంచుకుంటే రైతులకు మరింత మేలు జరుగుతుంది. కాబట్టి రైతులు తమవైన అనుభవాలు, గుణపాఠాలతో పాటు, తమ సృజనాత్మక పనిలో భాగంగా కొత్తగా ఆవిష్కరించిన పనిముట్ల గురించి రైతుబడికి రాసి పంపించగలరు.

రచనలు పంపవలసిన చిరునామా

8-2-603/1/7,8,9, కృష్ణాపురం, రోడ్‌నంబర్‌.10, బంజారాహిల్స్‌,
హైదరాబాద్‌-500034. [email protected],
Fax-040-23291118

138
Tags

More News