వివిధ పంటలలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు

Thu,November 7, 2019 12:02 AM

fields
సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో రాష్ట్రంలో అధిక వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంట చేలల్లో వాన నీరు నిలిచింది. దీంతోపాటు పంటలు నేలకొరగడంతో రైతులకు ఎక్కువగా నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో రైతులు పంటపొలాల్లో సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా మంచి దిగుబడులు పొందవచ్చుని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ప్రస్తుతం వివిధ పంటలలో ఆచరించాల్సిన విధానాల గురించి గడ్డిపల్లి కేవీకే మృత్తికా శాస్త్రవేత్త అరిగెల కిరణ్‌కుమార్‌ వివరించారు. మరిన్ని వివరాల కోసం 7893989055 నెంబర్‌ను సంప్రదించవచ్చు. వివిధ పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారు అందించిన వివరాలు..

వరిలో..

- అధిక వర్షపాతం, గాలివానతో రైతులకు అధిక నష్టం కలుగవ చ్చు. వరిపంట ప్రస్తుతం కోత దశ లో ఉన్నది. గాలి కారణంగా వరి పొలాలు నేలకొరిగిపోయాయి. దీనికి రైతులు పడిపోయిన పొలాలను జడలు కట్టడం చేయాలి.
- వరిపొలాల గింజలు నేలకు తాకి తే ఆ పొలంలో నీటిని బైటికి పంపించి ఆరబెట్టాలి. లేకపోతే గింజలు మొలక వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే గింజలు నల్ల గా మారుతాయి. దీంతో రైతులకు మార్కెట్‌లో ధర తగ్గుతుంది.
- పొలంలో తేమ ఉంటే 2 శాతం ఉప్పు ద్రావణం పొలంపై పిచికారీ చేయాలి. లీటరు నీటిలో 2 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయడం ద్వారా మొలకెత్తే గింజ శాతం తగ్గించుకోవచ్చు.
- రైతులు తడిసిన ధాన్యం కోతకు వస్తే క్వింటాలు ధాన్యానికి కేజీ ఉప్పు కలిపి ఆరబెట్టాలి. దీనిద్వారా మొలకెత్తే శాతాన్ని తగ్గించుకోవచ్చు.
fields1

పత్తి లో..

- పత్తిచేలో నిల్వ ఉన్న నీటిని తీసివేయాలి. అకాల వర్షాల వలన ఎండు తెగులు వచ్చే ప్రమాదం ఉన్నది. దీని నివారణకు కాపర్‌ ఆక్సీక్లోరైడ్‌ 3 గ్రాములు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత పొటాషియం నైట్రేట్‌ 5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
- పత్తిలో అక్కడక్కడ నత్రజని, మెగ్నీషియం లోపం ఉన్న పంటలకు యూరియా 20 గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. మెగ్నీషియం సల్ఫేట్‌ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కందిలో..

- కంది ఆరుతడి పంట. కాబట్టి నీటి నిల్వ లేకుండా చేయాలి.
- పొటాషియం నైట్రేట్‌ 5 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- ప్రస్తుతం అధిక తేమ మబ్బులతో కూడిన వాతావరణం ఉన్నది. కాబట్టి తెగుళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆశించిన దిగుబడులు పొందవచ్చు.

నట్టె కోటేశ్వర్‌రావు, 9989944945 గరిడేపల్లి, సూర్యాపేట జిల్లా

162
Tags

More News