ఆరు పదవుల కోసం 17 మంది రంగంలో

Tue,September 24, 2019 06:39 AM

హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సోమవారం ముగిసింది. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేకంగా ఎన్నికల కోసం ఏర్పాటు చేసి రిటర్నింగ్ కార్యాలయంలో 62 మందిలో 45 మంది తమ నామినేషన్ ఉపసంవరణ పత్రాలను ఎన్నికల అధికారి సంపత్‌కు అందజేయగా రంగంలో 17 మంది పోటీకి నిలిచినట్టు ఆయన ప్రకటించారు. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష పదవి కోసం కే.దీలిప్ కుమార్, టీమ్ ఇం డియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్, ప్రకాష్‌చంద్ జైన్‌లు ఉన్నారు. ఉపాధ్యక్ష పదవి కోసం జోన్ మోనోజ్, సర్థర్ దైజిత్ సింగ్‌లు, కార్యదర్శి పదవి కోసం ఆర్.ఎం.భాస్కర్, ఆర్.విజయ ఆనంద, ఎస్.వెంకటేశ్వరన్, కోశాధికారి పదవి కోసం చాతిరి బాబురావు సాగర్, హనుమంత్ రెడ్డిలు సంయుక్త కార్యదర్శిగా సతీష్‌చంద్ శ్రీవత్సవ్, జే. శివజీ యాదవ్, నరేష్‌శర్మలు కౌన్సిల్ సభ్యుడి అనూరాధ, రవేందర్ సింగ్, వినోద్ కు మార్ ఎన్నికల రంగంలో ఉన్నట్టు ఎన్నికల అధికారి వీ.ఎస్.సంపత్ ప్రకంటించారు.

1251
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles