అగ‌ర్వాల్ సెంచ‌రీ: భార‌త్ 241/ 0

Thu,October 3, 2019 10:11 AM

సాగరతీర నగరం వేదికగా దక్షిణాఫ్రికాతో మొదలైన తొలి టెస్ట్‌లో భార‌త్ జోరు కొన‌సాగుతుంది. స‌ఫారీ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ గేమ్‌పై ప‌ట్టు సాధిస్తుంది. ఇద్దరు ఓపెనర్లు రోహిత్ శ‌ర్మ 138( 16 ఫోర్స్, 5 సిక్స్), మ‌యాంక్ అగ‌ర్వాల్ 100 ( 13 ఫోర్స్, 2 సిక్స్) ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డ్‌ని ప‌రుగులెత్తిస్తున్నారు. ఈ క్ర‌మంలో మయాంక్ అగ‌ర్వాల్ అద్భుత‌మైన ఇన్నింగ్స్‌తో కెరీర్‌లో తొలి సెంచరీ న‌మోదు చేసుకున్నాడు. అంత‌క‌ముందు రోహిత్ శ‌ర్మ ఓపెన‌ర్‌గా తొలి సెంచ‌రీ న‌మోదు చేసిన విష‌యం విదిత‌మే. ప్ర‌స్తుతం భార‌త్ వికెట్ న‌ష్ట‌పోకుండా 241 ప‌రుగులు చేసింది. తొలి రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 59.1 ఓవర్లలో 202 పరుగులు చేసిన సంగ‌తి తెలిసిందే . టీ విరామం తర్వాత వరుణుడి రంగ ప్రవేశంతో స్టేడియం మొత్తం చిత్తడిగా మారడంతో ఆటను నిలిపివేశారు. మొత్తంగా తొలి రోజు ఆటలో పూర్తి ఆధిపత్యం ప్ర‌ద‌ర్శించిన భార‌త్ రెండో రోజు కూడా ఆధిప‌త్యం కొన‌సాగిస్తున్న‌ట్టు క‌నిపిస్తుంది.

1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles