ఐపీఎల్-11లో క్రేజీ గణాంకాలు.. మైమరిపించేలా

Mon,May 28, 2018 12:45 PM

 A Look at ipl Competition Stats

ముంబయి: ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసిన మెగా టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). 2008లో ఆరంభమైన లీగ్‌కు క్రికెట్ ప్రేమికులు బ్రహ్మరథం పట్టడంతో ప్రతిఏడాది విజయవంతంగా సాగుతోంది. టోర్నీపై అంచనాలు పెరిగిపోవడం, అభిమానులను ఆకర్షించేందుకు ప్లేయర్స్ సైతం తమ శక్తివంచన లేకుండా ఫోర్లు, సిక్సర్లతో ఆకట్టుకుంటున్నారు. ఐపీఎల్ అంటేనే రికార్డులు అనేలా మైమరిపించేసింది. ఆదివారం ఐపీఎల్-11 సీజన్ ఫైనల్ సమరం ముగిసే వరకు ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌లను వీక్షించాం. ధనాధన్ క్రికెట్లో బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్‌తో పాటు పలు విభాగాల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదయ్యాయి.

ఆసక్తికర గణాంకాలు ఇవే:

టోర్నీలో జరిగిన మొత్తం మ్యాచ్‌లు: 60

టోర్నీలో అందరు బ్యాట్స్‌మెన్ కలిసి చేసిన పరుగులు: 19,901

పవర్‌ప్లేలో బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు: 5,983

బౌండరీల ద్వారా వచ్చిన పరుగులు: 11,840

డక్(0 పరుగులు) అయిన బ్యాట్స్‌మెన్: 67 మంది

ఫీల్డర్లు అందుకున్న క్యాచ్‌లు: 488

నమోదైన సెంచరీలు: ఐదు

మొత్తం అర్ధశతకాలు: 91

బౌలర్లు తీసిన వికెట్లు: 720

ఫోర్ల సంఖ్య: 1,652

సిక్సర్ల సంఖ్య: 872

మొయిడిన్ ఓవర్లు: 14

ఫ్రీ హిట్స్: 37

2137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles