డ్రెస్సింగ్‌ రూమ్‌ పంచుకున్న ఇంగ్లాండ్‌, ఆసీస్‌ జట్లు

Mon,September 16, 2019 04:41 PM

న్యూఢిల్లీ: ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా మధ్య రసవత్తరంగా జరిగిన యాషెస్‌ సిరీస్‌ 2-2 తో డ్రా అయిన విషయం తెలిసిందే. 47 సంవత్సరాల తరువాత యాషెస్‌ సిరీస్‌ డ్రా కావడం ఇదే తొలిసారి. కాగా, సిరీస్‌ అనంతరం రెండు జట్లు ఒకే డ్రెస్సింగ్‌ రూం పంచుకోవడం విశేషం. మైదానంలో ప్రత్యర్థుల్లా తలపడ్డ వీరు డ్రెస్సింగ్‌ రూంలో ఎంతో కలివిడిగా, సంతోషంగా మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ అరుదైన ఫోటోని ఇంగ్లాండ్‌ క్రికెట్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ఈ ఫోటో ఇపుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. క్రికెట్‌ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది.


కాగా, సిరీస్‌ డ్రా అయినప్పటికీ, ట్రోఫీ మాత్రం ఆస్ట్రేలియా దగ్గరే ఉంటుంది. ఎందుకంటే గతేడాది జరిగిన సిరీస్‌ ఆసీస్‌ గెలిచినందుకు గానూ ట్రోఫీని వారే నిలుపుకున్నారు.


2352
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles