1983 🏆.. 2011 🏆.. 2019 ❓

Wed,June 5, 2019 01:17 PM

After Kapil dev and Dhoni, can Virat clinches world cup title ?

హైద‌రాబాద్: క‌పిల్‌దేవ్ సార‌థ్యంలో క‌ప్ కొట్టాం. ఆ త‌ర్వాత మిస్ట‌ర్ కూల్ ధోనీ కెప్టెన్సీలోనూ విశ్వ‌విజేతలుగా నిలిచాం. ఇక డాషింగ్ ప్లేయ‌ర్ కోహ్లీ నేతృత్వంలో భార‌త్ వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలుస్తుందా. ఇంగ్లండ్‌లో జ‌రుగుతున్న ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో.. ఇవాళ విరాట్ సేన త‌న మొద‌టి మ్యాచ్‌ను ఆడ‌నున్న‌ది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ టీమ్ ఫెవ‌రేట్‌గానే బ‌రిలోకి దిగుతున్నా.. సౌతాఫ్రికాను త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. 1983లో క‌పిల్ కెప్టెన్సీలో ఇండియా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను గెలిచింది. మైటీ విండీస్‌ను ఓడించి అప్ప‌ట్లో చ‌రిత్ర సృష్టించారు. 2011లోనూ ధోనీ గ్యాంగ్‌.. స్వంత గ‌డ్డపై ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకున్న‌ది. ఇప్పుడు ఆ ఇద్ద‌రు హేమాహేమీల బాధ్య‌త కోహ్లీపై ఉంది. టోర్నీలో అత్యంత కీల‌క ఆట‌గాడిగా కోహ్లీ.. కెప్టెన్సీ చేప‌ట్ట‌నున్నాడు. కోహ్లీ గేమ్‌పైనే మాజీ క్రికెట‌ర్లు అంచ‌నాలు వేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ రెండుసార్లు వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడాడు. అయితే మొద‌టిసారి అత‌ను మెగా టోర్నీలో కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌డుతున్నాడు. కపిల్‌, ధోనీ త‌ర‌హాలో కోహ్లీ సంచ‌ల‌న చ‌రిత్ర సృష్టిస్తాడా అన్న సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. వ‌ర‌ల్డ్‌క‌ప్ టైటిల్ కోహ్లీ ఖాతాలోకి వెళ్తాందా లేదా అన్న ఉత్సుక‌త అంద‌రిలోనూ త‌లెత్తుతోంది. 2017లో ఇంగ్లండ్‌లో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌లో ప్ర‌వేశించిన ఇండియా.. ఇవాళ్టి నుంచి వ‌ర‌ల్డ్‌క‌ప్ రేస్‌ను ఎలా స్టార్ట్ చేస్తుందో చూడాల్సిందే.

1961
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles