దేశాధ్యక్షుడి తరువాత నేనే ఫేమస్

Tue,May 29, 2018 11:09 AM

After president, maybe Im most popular in Afghanistan Rashid Khan

ముంబయి: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-11లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ప్రపంచవ్యాప్తంగా పలు రంగాల ప్రముఖులు నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. క్వాలిఫయర్-2లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌షోతో జట్టును ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఐతే చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఫైనల్ పోరులో పరాజయం పాలైన విషయం తెలిసిందే.

తాజాగా 19ఏళ్ల అఫ్గనిస్థాన్ యువ సంచలనం రషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌లో అగ్రశ్రేణి క్రికెటర్లకు ఉన్న హోదా గురించి మీకు తెలిసిందే..మ‌రీ మీ దేశంలో మీరూ ఎంజాయ్ చేస్తున్నారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానంగా.. నాకు తెలిసినంత వరకు దేశాధ్యక్షుడి తరువాత బహుశా, అఫ్గనిస్థాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిని నేనే అని రషీద్ వ్యాఖ్యానించాడు. ఈ ఏడాది సీజన్‌లో అతడు 21 వికెట్లు పడగొట్టాడు. వచ్చే జూన్‌లో అఫ్గనిస్థాన్ జట్టు టీమిండియాతో చరిత్రాత్మక టెస్టు మ్యాచ్ ఆడనున్న విషయం తెలిసిందే.

4347
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles