మళ్లీ ధోనీ కాళ్లపై పడ్డ అభిమానులు.. ఇది 17వసారి!

Wed,March 27, 2019 03:03 PM

Again two Dhoni fans breach the security to touch his feet during IPL Match

న్యూఢిల్లీ: ఎంతోమంది క్రికెటర్లకు అభిమానులు ఉంటారు. తమ అభిమాన క్రికెటర్లను దగ్గర నుంచి చూస్తే చాలు.. వాళ్ల ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు దక్కితే అదే పదివేలు అనుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. అంతెందుకు సచిన్‌ను దేవుడిగా ఆరాధించే వాళ్లూ ఉన్నారు. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అభిమానుల ైస్టెలే వేరు. ధోనీ కనిపిస్తే చాలు.. వచ్చి అతని కాళ్ల మీద పడిపోతారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో మ్యాచ్ మధ్యలో ఇలా అభిమానులు వచ్చి ధోనీ కాళ్లు మొక్కారు. తాజాగా ఐపీఎల్‌లో భాగంగా చెన్నై, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇద్దరు అభిమానులు సెక్యూరిటీని బోల్తా కొట్టించి ధోనీ దగ్గరికి వచ్చారు. అతని కాళ్లు మొక్కి పులకించిపోయారు. ఇలా మ్యాచ్ మధ్యలో అభిమానులు ధోనీ కాళ్లు మొక్కడం 17వసారి. ఈ ఏడాదిలోనే ఇలాంటివి ఐదు సంఘటనలు జరిగాయి. మొన్న ఇండియా, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌లోనూ ఓ అభిమాని ఇలాగే తన కాళ్లు మొక్కడానికి రాగా.. అతనికి దొరకకుండా ధోనీ పరుగెత్తిన వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
3064
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles