బ్యాటింగ్ స‌గ‌టు బెట‌రే.. మ‌రి రాయుడిని ఎందుకు ప‌క్క‌న‌పెట్టారు !

Mon,April 15, 2019 05:38 PM

Ambati Rayudu not selected for world cup

హైద‌రాబాద్‌: ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే వ‌రల్డ్‌క‌ప్ కోసం బీసీసీఐ సెలెక్ట‌ర్లు 15 మందితో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఆ బృందంలో అంబ‌టి రాయుడుకు చోటు ద‌క్క‌లేదు. నాలుగ‌వ నెంబ‌ర్ పొజిష‌న్ కోసం రాయుడు ఎంపిక అవుతాడ‌న్న ఆశ‌లు ఉండే. కానీ బీసీసీఐ సెలెక్ట‌ర్లు అత‌నికి మొండి చెయ్యి చూపారు. వాస్త‌వానికి రాయుడు వ‌న్డే కెరీర్ బాగుంది. ప్ర‌స్తుతం ఉన్న బ్యాట్స్‌మెన్ లిస్టులో రాయుడు యావ‌రేజ్ నాలుగ‌వ స్థానంలో ఉంది. అత‌ని వ‌న్డే బ్యాటింగ్ స‌గ‌టు 47.05గా ఉంది. రాయుడు క‌న్నా మెరుగైన స్థానంలో కోహ్లీ(59.57), ధోనీ(50.37), రోహిత్ (47.37) యావ‌రేజ్‌తో టాప్ మూడు పొజిష‌న్స్‌లో ఉన్నారు. మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ వ‌న్డే బ్యాటింగ్ యావ‌రేజ్ 44.83గా ఉంది. మేటి ప్లేయ‌ర్‌ స‌చిన్ స‌గటు క‌న్నా ఎక్కువే ఉన్నా.. రాయుడుకి మాత్రం సెలెక్ట‌ర్లు వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఛాన్స్ ఇవ్వ‌లేదు. 2017లో జ‌రిగిన చాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్ కోసం సెలెక్ట‌ర్లు అనేక ప్ర‌యోగాలు చేశారు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, మ‌నీష్ పాండేల‌కు ఎన్నో అవ‌కాశాలు ఇచ్చారు. కానీ వాళ్లు పెద్ద‌గా రాణించ‌లేదు. అయితే విజ‌య్ శంక‌ర్ వైపు సెలెక్ట‌ర్లు మొగ్గు చూపిన‌ట్లు తెలుస్తున్న‌ది. బౌలింగ్‌, బ్యాటింగ్ చేయ‌గ‌ల శంక‌ర్ నాలుగ‌వ నెంబ‌ర్ పొజిష‌న్‌లో బెట‌ర్ అన్న అభిప్రాయానికి వ‌చ్చారు. రాయుడుకి ఎవ‌రూ వ్య‌తిరేకంగా లేర‌ని, కానీ శంక‌ర్ వైపు అంద‌రూ ఫేవ‌ర్‌గా ఉన్న‌ట్లు చీఫ్ సెలెక్ట‌ర్ ఎంఎస్‌కే ప్ర‌సాద్ తెలిపారు. నిజానికి నెంబ‌ర్ ఫోర్ పొజిష‌న్‌లో రాయుడికి మంచి అనుభ‌వం ఉంది. 2017లో అత‌ను ఆ స్థానంలో 15 వ‌న్డేలు ఆడాడు. ఆ మ్యాచ్‌ల్లో అత‌ని స‌గ‌టు 42.18గా ఉంది. కానీ వ‌న్డేల్లో 4వ పొజిష‌న్‌లో ఆడ‌ని శంక‌ర్‌కు సెలెక్ట‌ర్లు ఎందుకు ఛాన్స్ ఇచ్చ‌రో స్ప‌ష్టంగా తెలియ‌డంలేదు.3394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles