చ‌రిత్ర సృష్టించిన బాక్స‌ర్ అమిత్ పంగ‌ల్‌

Fri,September 20, 2019 05:12 PM

హైద‌రాబాద్‌: బాక్స‌ర్ అమిత్ పంగ‌ల్ చ‌రిత్ర సృష్టించాడు. వ‌ర‌ల్డ్ మెన్స్ బాక్సింగ్ చాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో ప్ర‌వేశించాడత‌ను. 52 కిలోల కేట‌గిరీలో జ‌రిగిన సెమీస్‌లో అమిత్ విజ‌యం సాధించి గోల్డ్ మెడ‌ల్‌పై ఆశ‌లు రేపాడు. వ‌ర‌ల్డ్ బాక్సింగ్ ఈవెంట్‌ ఫైన‌ల్లో ఓ భార‌తీయ బాక్స‌ర్ ప్ర‌వేశించ‌డం ఇదే తొలిసారి. ర‌ష్యాలోని ఈక‌ట‌రిన్‌బ‌ర్గ్‌లో జ‌రుగుతున్న ప్ర‌పంచ చాంపియ‌న్‌షిప్‌లోని 63 కిలోల విభాగంలో మ‌రో బాక్స‌ర్ మ‌నీష్ కౌశిక్ బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకున్నాడు. రెండ‌వ సీడ్‌ అమిత్ పంగ‌ల్ 3-2 తేడాతో క‌జ‌కిస్తాన్‌కు చెందిన సాకెన్ బిబ‌సినోవ్‌పౌ గెలుపొందాడు. శ‌నివారం ఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుంది. ఫైన‌ల్లో ఉజ్బ‌కిస్తాన్‌కు చెందిన షాకోబెదిన్ జైరోవ్‌తో అమిత్ త‌ల‌ప‌డ‌నున్నాడు. జైరోవ్ మ‌రో సెమీస్‌లో ఫ్రెంచ్ బాక్స‌ర్ బిల్లాల్ బెన్నామాపై గెలుపొందాడు. 2017 ఆసియా చాంపియ‌న్‌షిప్‌లో 49 కిలోల కేట‌గిరీలో పంగ‌ల్ బ్రాంజ్ మెడ‌ల్ గెలిచాడు. అదే ఏడాది వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో అత‌ను క్వార్ట‌ర్ ఫైన‌ల్లోకి ప్ర‌వేశించాడు. 2018లో ఆసియా క్రీడ‌ల్లో చాంపియ‌న్‌గా నిలిచాడు. ఈ ఏడాది ఇప్ప‌టికే పంగ‌ల్ ఆసియా క్రీడ‌ల్లో 52 కిలోల కేట‌గిరీలో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని సాధించాడు. గ‌తంలో ఎన్న‌డూ భార‌త బాక్స‌ర్లు వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్‌లో రెండు ప‌త‌కాలు సాధించ‌లేదు. తొలిసారి పంగ‌ల్‌, మ‌నీశ్‌ల‌కు ప‌త‌కాలు ఖ‌రార‌య్యాయి. గ‌తంలో విజేంద‌ర్ సింగ్‌(2009), వికాశ్ కృష్ణ‌(2011), శివ‌త‌ప్ప‌(2015), గౌర‌వ్ బిందూరి(2017)లు గెలిచారు.700
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles