HomeLATEST NEWSAnother Controversy in IPL as Ishant and Watson exchange heated words

ఐపీఎల్‌లో మరో గొడవ.. ఇషాంత్ vs వాట్సన్.. వీడియో

Published: Wed,March 27, 2019 01:16 PM
  Increase Font Size Reset Font Size decrease Font size   
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో మన్కడింగ్ గొడవ కొనసాగుతుండగానే.. మరొకటి మొదలైంది. చెన్నై, ఢిల్లీ మ్యాచ్‌లో ఇషాంత్ శర్మ, షేన్ వాట్సన్ మధ్య మాటల యుద్ధం జరిగింది. చెన్నై ఇన్నింగ్స్‌లో తొలి వికెట్ తీసిన తర్వాత ఇషాంత్ సంబురాలు చూసి నాన్ ైస్ట్రెకింగ్ ఎండ్‌లో ఉన్న వాట్సన్ నవ్వాడు. అది చూసిన ఇషాంత్ ఆగ్రహంతో ఊగిపోతూ వాట్సన్‌పైకి దూసుకెళ్లాడు. అప్పటికీ వాట్సన్ నవ్వుతూనే కనిపించాడు. వెంటనే ఢిల్లీ టీమ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వచ్చి ఇషాంత్‌ను దూరంగా లాక్కెళ్లాడు. ఆ తర్వాత ఢిల్లీ బౌలర్ కాగిసో రబాడాతోనూ వాట్సన్ గొడవ పడ్డాడు. ఈసారి రబాడా నవ్వుతూ కనిపించగా.. వాట్సన్ మాత్రం సీరియస్‌గా కనిపించాడు.
అయితే మ్యాచ్ తర్వాత ఇదే వాట్సన్, రబాడా మళ్లీ నవ్వుతూ కనిపించారు. ఢిల్లీ కోచ్‌గా ఉన్న రికీ పాంటింగ్ వీళ్లిద్దరినీ కలిపే ప్రయత్నం చేశాడు. దీంతో ఇద్దరూ ఆ గొడవను లైట్ తీసుకొని నవ్వుకున్నారు. ఈ మ్యాచ్‌లో చెన్నై 6 వికెట్లతో గెలిచిన విషయం తెలిసిందే. 148 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
4844
Tags

More News

NATIONAL-INTERNATIONAL

SPORTS

Health

Technology