పాకిస్థాన్‌పై ఇది మ‌రో స్ట్ర‌యిక్ : కేంద్ర హోంశాఖ మంత్రి

Mon,June 17, 2019 12:25 PM

హైద‌రాబాద్‌: వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో దాయాది దేశం పాకిస్థాన్‌పై భార‌త్ సునాయాస విజ‌యం న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తి ప్ర‌కారం కోహ్లీ సేన 89 ర‌న్స్ తేడాతో పాక్‌పై నెగ్గింది. ఈ విక్ట‌రీపై టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ నాయకులు, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌, మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌లు కోహ్లీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు.


కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. పాకిస్థాన్‌పై ఇది మ‌రో దాడి అని, దాని ఫ‌లితం కూడా అలాగే ఉంద‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు. పాక్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆట‌గాళ్ల‌కు షా కంగ్రాట్స్ చెప్పారు. ప్ర‌తి భార‌తీయుడు ఈ విక్ట‌రీ ప‌ట్ల గ‌ర్వంగా ఫీల‌వుతున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఈ విజ‌యాన్ని ప్ర‌తి ఒక్క‌రూ సెల‌బ్రేట్ చేసుకుంటున్నార‌న్నారు.






















5454
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles